Menu

Rohit – kohli in ODIs : వన్డే క్రికెట్ కే ఈ తరం టార్చ్ బేరర్స్! ఈ ఫార్మాట్ లో రారాజులు కోహ్లీ, రోహిత్!!

Sumanth Thummala 2 months ago
Virat Kohli and Rohit sharma

ఆటలో గొప్ప ప్లేయర్స్ ఉంటారు.‌ కానీ ఆటకే వన్నె తెచ్చి వారు కొందరే ఉంటారు.‌ అలా వన్డే ఫార్మాట్ నే‌ పూర్తిగా ఒక దశాబ్దం పైగా శాసిస్తున్న ఆటగాళ్ళు రోహిత్ శర్మవిరాట్ కోహ్లీ.

ఈ ఫార్మాట్ లో వీళ్ళు ఆడుతున్నారంటే క్రికెట్ అభిమానుల నుండి కామెంటేటర్స్ వరకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. అంతే ఉత్సాహంగా వీళ్ళ ఆట ఉంటుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్, తన రికార్డులు ఎవరు బ్రేక్ చేస్తారు అని అడిగినప్పుడు కోహ్లీ రోహిత్ ఇద్దరి పేర్లు చెప్పాడు.

తన అంచనా తప్పుకాలేదు.

అసలు వీళ్ళ ఇద్దరి రికార్డులు కలిపితే ఈ ఫార్మాట్ లో ఇంకెవరికీ సాధ్యం కానంత ఎత్తులో ఉన్నారు. అందుకే వన్డే మ్యాచ్ అంటే ఎలా ఆడాలో వీళ్ళను చూస్తే చాలు అనిపిస్తుంది. టీ20ఐ, టెస్ట్ ఫార్మాట్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన వీళ్ళు, 2027 వరల్డ్ కప్ వరకు టీం‌లో ఉంటారా లేదా అని కొన్ని సందేహాలు లేవనెత్తుత్తున్న సమయంలో, వాటిని పటాపంచలు చేసి తామేంటో నిరూపించారు ఇద్దరూ.

Virat Kohli Rohit Sharma partnership and records

ఈరోజు రాంచీలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో వీళ్ళిద్దరూ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించారు. 136(109) పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఈ ఫార్మాట్ లో తాము ఎందుకు బెస్ట్ అనేది చూపించారు. ఈ పార్టనర్ షిప్ లోనే‌ వీరిద్దరూ ఎన్నో రికార్డులను నమోదు చేశారు. ఓవరాల్ వీళ్ళ వన్డే రికార్డులను చూస్తే;

జోడీ నెం.1:

– వన్డేలో 2వ అత్యధిక 100+ భాగస్వామ్యాల రికార్డును సమం చేశారు (20*).

– 3వ అత్యధిక పరుగులు సాధించిన జోడీ 5619* (102 ఇన్నింగ్స్)

– జాయింట్ అత్యధిక 150+ పరుగుల భాగస్వామ్యాలు 12*

– వన్డేల్లో బెస్ట్ సగటు ఉన్న జోడీ 58.53 (కనీసం 3500 పరుగులు చేసిన జోడీ)

వన్డేల్లో మకుటం లేని మహారాజు:

విరాట్ కోహ్లీ ని క్రికెట్ లో కింగ్ అని పిలుస్తారు. కానీ తన వన్డే రికార్డుల గురించి మాట్లాడుకుంటే తనని వన్డే మహారాజు అని పిలుచుకోవాలి ఏమో! ఈ రోజుకి తన బెస్ట్ ఆటతీరును ఈ ఫార్మాట్ లోనే చూపిస్తాడు విరాట్ కోహ్లీ.

306 మ్యాచ్‌ల్లో 14390 పరుగులు, 58.02 ఆవరేజ్, 93.41 స్ట్రైక్ రేట్ తో 52 సెంచరీలు,75 అర్థ సెంచరీలు నమోదు చేశాడు.

ఈ ఫార్మాట్ లో తన రికార్డులను చూస్తే;

* వన్డేలో అత్యధిక సెంచరీలు -52*

* ఈ ఫార్మాట్ లో రెండవ అత్యధిక పరుగులు 14,390*

* రెండవ అత్యధిక హాఫ్ సెంచరీలు 75*

* అత్యుత్తమ బ్యాటింగ్ ఆవరేజ్ 58.02 (కనీసం 10 వేల పైచిలుకు పరుగలు చేసిన బ్యాటర్స్ లో)

* ఫాస్టెస్ట్ 8000,9000,10000,11000,12000,13000,14000 రన్స్ కొట్టిన బ్యాటర్

* గెలుపులో అత్యధిక సెంచరీలు 43*

* సక్సెస్ఫుల్ చేస్ లలో అత్యధిక సెంచరీలు 28*

* ఒక ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ 765.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)


* వరల్డ్ కప్స్ లలో 2వ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ 1795*

* ఒక ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక పరుగులు 558 (vs సౌతాఫ్రికా)

* ఒక సిరీస్ లో అత్యధిక సెంచరీలు -3

* ఒకే టీం (శ్రీలంక) మీద అత్యధికంగా 10 సెంచరీలు కొట్టిన ప్లేయర్.

* ఐసీసీ ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా అత్యధికంగా అవార్డులు అందుకున్న ప్లేయర్ (3).

* వన్డేలో ఇండియా తరపున అత్యధిక రేటింగ్ – 909.

* ఐసీసీ వన్డే నెం.‌1 ర్యాంకింగ్స్ లో వరుసగా అత్యధిక కాలం ఉన్న ఇండియన్ ప్లేయర్ 1258 రోజులు (2017-2021).

* ఇండియా తరపున వన్డే లో అత్యధిక క్యాచ్ లు 164*

Virat Kohli Odi records, Virat records

ఇందుకే విరాట్ కోహ్లీ ని 2011-2020 ఐసీసీ దశాబ్దపు ప్లేయర్(Player of The Decade) అవార్డు వచ్చింది అంటేనే‌ చెప్పొచ్చు ఈ ఫార్మాట్ ను తను ఎంతలా శాసించాడో.

హిట్ మ్యాన్ రోహిత్:

ఇక రోహిత్ శర్మ కూడా తక్కువ ఏం తినలేదు. తన పేరు మీద కూడా వన్డేలో అసాధారణ రికార్డులు ఉన్నాయి. అవేంటంటే;

*ODI ఫార్మాట్ లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు 264.

* వన్డేలో 3 డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక ప్లేయర్.

* ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సెంచరీలు – 8.

* వన్డే వరల్డ్ కప్ లలో అత్యధిక సెంచరీలు – 7.

* అత్యధిక సిక్సర్లు -352*.

 

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)


* 3వ అత్యధిక సెంచరీలు -33.

* 2వ అత్యధిక సెంచరీలు చేసింగ్ లో -17

* ఓపెనర్ గా వన్డేల్లో 2వ అత్యధిక సెంచరీలు – 31

* అత్యధిక 150+ స్కోర్లు – 8

* ఇండియా తరఫున ఓపెనింగ్ లో అత్యధిక రన్స్ పార్టనర్ షిప్ శిఖర్ ధావన్ తో కలిసి – 5148 రన్స్

రోహిత్ కెరీర్ ను 2012 కు ముందు ఆ తరువాత చూడాలి.

2007 నుండి 2012 వరకు 81 ఇన్నింగ్స్ లో 30.43 ఆవరేజ్ తో కేవలం 1978 రన్స్ చేశాడు. దాంట్లో 2 సెంచరీలు,12 అర్థ సెంచరీలు ఉన్నాయి.

ఎప్పుడైతే తను ఓపెనర్ గా మారాడో, తన ఆటతీరే పూర్తిగా మారిపోయింది. అంతా ఒక సరికొత్త రోహిత్ శర్మ ను చూశారు. 2013 నుండి 9,449 పరుగులు చేశాడు (4వ అత్యధికం). అందుకే తనను హిట్ మ్యాన్ అని క్రికెట్ అభిమానులు పిలుచుకుంటారు.

ఇలా రోహిత్ శర్మ కూడా వన్డే ఫార్మాట్ లో తన బెస్ట్ ఇస్తాడు.

 

ఇంతటి ఘనమైన రికార్డులు ఉన్నాయి కాబట్టే, విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్ లో దిగ్గజాలు గా ఉన్నారు. ఒక విధంగా ఈ ఫార్మాట్ కు ప్రస్తుతం టార్చ్ బేరర్స్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు! అందుకే వీరిద్దరి అవసరం టీం కు 2027 వరల్డ్ కప్ లో కచ్చితంగా ఉంటుంది.


Written By

Sumanth Thummala is aContent Writer and the co-founder of Prajadhwani news. He works passionately toward creating positive change in the world through meaningful, responsible writing.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *