Menu

SIP: లక్ష పెడితే రూ.51లక్షలు..! ఇన్‌వెస్టర్లకు ఫేవరెట్‌ స్కీమ్‌ ఇది..!

Lakshmi Aruna 2 months ago
This Nippon India fund grew Rs 1 lakh into Rs 51 lakh, Rs 10K SIP Rs 2.5 crore in 21 years

నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్(Nippon India Pharma fund) అనే మ్యూచువల్ ఫండ్(Mutual Fund) గత 15-20 సంవత్సరాలుగా ఇన్‌వెస్టర్లకు ఫేవరెట్‌గా నిలుస్తోంది. నిప్పాన్ ఇండియా కంపెనీలో ఉన్న అన్ని ఈక్విటీ ఫండ్లలో ఇది మొదటిస్థానంలో ఉంది. ఈ ఫండ్‌లో ఎవరో ప్రతి నెలా కొంచెం కొంచెం డబ్బు పెట్టి SIP చేసి ఉంటే, గత 20 ఏళ్లలో వారికి సగటున ప్రతి సంవత్సరం దాదాపు 18.26% లాభం వచ్చింది. అలాగే ఎవరో ఒకేసారి పెద్ద మొత్తంగా(Lump Sum) డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటే, వారికి ప్రతి సంవత్సరం సుమారు 19.04% వరకు లాభం వచ్చింది. మొత్తం చెప్పాలంటే, చిన్న చిన్న మొత్తాల్లో పెట్టినా, పెద్ద మొత్తంలో పెట్టినా, ఇరవై ఏళ్ల పాటు ఈ ఫండ్ చాలా మంచి లాభాలు ఇచ్చింది. అందుకే ఇది నిప్పాన్ ఇండియా కంపెనీలోని ఈక్విటీ ఫండ్లలో టాప్‌గా నిలిచింది.

ఈ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ జూన్ 5, 2004న ప్రారంభించారు. అంటే 21 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతోంది. ప్రారంభం నుండి, ఇది ఆకట్టుకునే 20.12% CAGRని అందించింది.

SIP పెట్టుబడి ఉదాహరణ (21 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పటి నుంచి):

నెలవారీ SIP: రూ. 10,000
21 సంవత్సరాలలో వార్షిక రాబడి (CAGR): 18.61%
మొత్తం పెట్టుబడి మొత్తం: రూ. 25,20,000
21 సంవత్సరాల తర్వాత మొత్తం కార్పస్: రూ. 2.48 కోట్లు

ఏకమొత్తం పెట్టుబడి ఉదాహరణ (21 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పటి నుంచి)

ఒకేసారి పెట్టుబడి: రూ. 1,00,000
21 సంవత్సరాలలో వార్షిక రాబడి (CAGR): 20.12%
21 సంవత్సరాల తర్వాత మొత్తం కార్పస్: రూ. 51.34 లక్షలు

నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్ మన డబ్బును పెద్ద ఫార్మా కంపెనీలు, మధ్యస్థాయి ఫార్మా కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది. దీనికారణంగా మనకు స్థిరంగా మంచి లాభాలు రావడానికి ప్రయత్నిస్తుంది. ఇది మందులు తయారు చేసే కంపెనీలు, ఆరోగ్య సేవలు ఇచ్చే కంపెనీలు, ఆసుపత్రులు, మెడికల్ టెస్ట్ సెంటర్లు, భీమా కంపెనీలు, పరిశోధన చేసే సంస్థలు లాంటి ఆరోగ్యానికి సంబంధించిన చాలా రంగాల్లో డబ్బు పెట్టుబడి పెడుతుంది.

భారత్‌లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది, జనాభా ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య సేవలు కోసం డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ మొత్తం వృద్ధి ఈ ఫండ్‌కు చాలా ఉపయోగపడుతుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఆరోగ్యానికి సంబంధించిన కంపెనీలు భవిష్యత్తులో ఎక్కువగా పెరుగుతాయని ఈ ఫండ్ నమ్ముతుంది, అందుకే ఈ ఫండ్ ఆ రంగాల్లో పెట్టుబడి పెడుతుంది.

ఫండ్ పోర్ట్‌ఫోలియో: టాప్ స్టాక్స్

సన్ ఫార్మాస్యూటికల్: 12.67%

దివిస్ లాబొరేటరీస్: 8.07%

లూపిన్: 7.26%

సిప్లా: 6.29%

అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్: 5.97%

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్: 5.62%

విజయ డయాగ్నస్టిక్: 3.42%

మెడ్‌ప్లస్ ఆరోగ్య సేవలు: 3.32%

గ్లాండ్ ఫార్మా లిమిటెడ్: 3.05%

గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్: 2.87%

ఫండ్ పోర్ట్‌ఫోలియో: అగ్ర రంగాలు

ఫార్మా & బయోటెక్: 75.07%

ఆరోగ్య సంరక్షణ సేవలు: 21.28%

రిటైల్: 3.32%

ఇతరాలు: 0.41%

ALSO READ: ఈ 6 బిజినెస్‌ ఐడియాస్‌తో మీరు లక్షలు సంపాదించవచ్చు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *