Menu

Business Ideas: ఈ 6 బిజినెస్‌ ఐడియాస్‌తో మీరు లక్షలు సంపాదించవచ్చు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ!

Lakshmi Aruna 2 months ago
AI and Digital Marketing Business EV Charging Stations Bottled Air Business Wearable Technology Agriculture Technology Startups Recycling and Waste Management business ideas telugu

మనలో చాలా మంది సొంతంగా వ్యాపారం(Business) పెట్టుకోవాలని, మన కాళ్ల మీద నిలబడాలని అనుకుంటుంటాం. అయితే ఏ వ్యాపారాన్ని ఎంపిక చేసుకోవాలో అన్నది చాలా మంది కన్ఫూజన్. ఈ రోజుల్లో కాలం ఎంత వేగంగా మారుతోందో, అలాగే మనుషుల అవసరాలు, ట్రెండ్లు కూడా మారుతున్నాయి. ఈ మార్పులను అర్థం చేసుకుని ముందుకు వెళ్లేవారే నిజమైన విజయాన్ని అందుకోగలరు. ఇప్పుడు తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి, తర్వాత భారీగా లాభాలు పొందగలిగే కొన్ని కొత్త వ్యాపార అవకాశాల గురించి తెలుసుకుందాం!

ALSO READ: PPF బెటరా? FD బెటరా? మీ ఫైనాన్షియల్ గోల్స్‌కి ఏది సరిపోతుంది?

ఆన్‌లైన్‌ మార్కెటింగ్:

ప్రస్తుతం ఏ వ్యాపారమైనా ఆన్‌లైన్ లేకుండా పూర్తి అవడం లేదు. అందుకే డిజిటల్ మార్కెటింగ్(Digital Marketing), కృత్రిమ మేధస్సు సేవలపై డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఎవరికైనా SEO, సోషల్ మీడియా మార్కెటింగ్, AI టూల్స్ వాడటం లేదా బ్రాండింగ్ చేసే స్కిల్స్ ఉంటే, కంపెనీలను ఆన్‌లైన్‌లో ఎదగడంలో సహాయం చేస్తూ మంచి ఆదాయం సంపాదించవచ్చు. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు, కానీ ఆదాయం మాత్రం చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.

ఈవీ స్టేషన్లు:

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది కానీ ఛార్జింగ్ స్టేషన్లు మాత్రం ఇంకా తక్కువగానే ఉన్నాయి. సరైన ప్రదేశంలో EV ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే రాబోయే సంవత్సరాల్లో మంచి లాభాలు రావచ్చు. పైగా ప్రభుత్వం కూడా ఈ రంగాన్ని ప్రోత్సాహిస్తూ పలు పథకాలు ఇస్తోంది. భవిష్యత్తులో ఇది చాలా స్టేబుల్ వ్యాపారంగా మారే అవకాశం ఉంది.

బాటిల్డ్ ఎయిర్:

పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న కొద్దీ శుద్ధమైన గాలి విలువ ఎంత ముఖ్యమో ప్రజలు గ్రహిస్తున్నారు. విదేశాల్లో ఇప్పటికే శుద్ధ గాలిని బాటిల్స్‌లో అమ్మడం మొదలైంది. ఇండియాలో కూడా ఇది ఒక కొత్త, ప్రత్యేకమైన వ్యాపార అవకాశంగా మారవచ్చు. భవిష్యత్తులో ప్రజలు శుభ్రమైన గాలి కోసం మరింత ఆసక్తి చూపే అవకాశం ఉండడంతో ఈ వ్యాపారం భారీ లాభాలు ఇచ్చే అవకాశం ఉంది.

వేర్‌బుల్ టెక్నాలజీ:

స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి వేర్‌బుల్ గాడ్జెట్లు ఇప్పుడు చాలా మంది రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ ఈ పరికరాలపై డిమాండ్ మరింత పెరుగుతోంది. టెక్నాలజీపై ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలో పెద్ద స్థాయిలో వ్యాపారం మొదలుపెట్టవచ్చు. ఇండియాలోని వేర్‌బుల్ మార్కెట్ ప్రతి సంవత్సరం వేగంగా పెరుగుతోంది.

అగ్రిటెక్ స్టార్టప్‌లు:

వ్యవసాయం ఇప్పుడు పాత పద్ధతులకే పరిమితం కాదు. డ్రోన్స్, హైడ్రోపోనిక్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, స్మార్ట్ సెన్సర్లు లాంటి టెక్నాలజీలు వ్యవసాయాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. రైతుల ఆదాయం పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వం కూడా అగ్రిటెక్ స్టార్టప్‌లకు పలు ప్రోత్సాహకాలను ఇస్తోంది. ఇది భవిష్యత్తులో పెట్టుబడిదారులకు మంచి లాభాలు ఇచ్చే రంగంగా మారే అవకాశం ఉంది.

రీసైక్లింగ్:

ప్రతి సంవత్సరం ప్లాస్టిక్(Plastic), ఈ-వ్యర్థాలు(e-Waste), ఆర్గానిక్ వ్యర్థాలు కోట్ల టన్నులుగా తయారవుతున్నాయి. ఈ వ్యర్థాలను రీసైకిల్ చేసి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం ఇప్పుడు ఒక పెద్ద అవసరంగా మారింది. పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా ఇది లాభదాయకమైన వ్యాపారంగా ఎదుగుతోంది. ప్రభుత్వం కూడా ‘క్లీన్ ఇండియా’ లక్ష్యంతో ఈ రంగానికి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తోంది. రాబోయే సంవత్సరాల్లో రీసైక్లింగ్ రంగం మరింత పెద్ద మార్కెట్‌ను సృష్టించబోతోంది.

నిజానికి మన చుట్టూ ఎన్నో అవకాశాలు ఉంటాయి. తక్కువ పెట్టుబడితో మొదలయ్యే ఎన్నో వ్యాపారాలు భవిష్యత్తులో కోట్ల రూపాయల విలువకు ఎదగగలవు. కాలం మారుతున్న కొద్దీ మార్కెట్ కూడా మారుతోంది. ఈ మార్పులను చూసి, అర్థం చేసుకుని, సరైన వ్యాపారం ఎంచుకుంటే విజయం తప్పదు.

ALSO READ: వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్టు నుంచి బిజినెస్‌ లోన్స్.. పూర్తి వివరాలివే!

 


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *