మనకు ఆధార్(Aadhar) ఎందుకు అవసరం? బ్యాంక్ ఖాతా నుండి స్కాలర్షిప్ వరకు.. ఎక్కడ చూసినా ఆధార్ తప్పనిసరి. కానీ ఒక చిన్న విషయం చాలా పెద్ద సమస్యలు తెస్తుంది. అదే ఆధార్‌లో ఉన్న చిరునామా. పాత చిరునామా, తప్పు చిరునామా ఉంటే మన రోజువారీ పనుల్లో ఎంత ఇబ్బందో తెలుసు కదా? చెక్‌బుక్ వస్తే ఇంటికి రాదు.. క్రెడిట్ కార్డ్ వస్తే తిరిగి వెళుతుంది.. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, పెన్షన్, స్కాలర్షిప్..ఇలా ఏదైనా కూడా సరైన అడ్రెస్ లేకపోతే మనకి అవసరానికి అడ్డంపడుతుంది. ఇక ఇప్పుడు ప్రభుత్వం తీసుకురానున్న కొత్త రూల్ ప్రకారం.. మీరు ఇంటి వద్ద నుంచే ఆధార్ మొబైల్‌ను అప్డేట్ చేయవచ్చు.
ఎవరైనా కూడా ఓటీపీ వెరిఫికేషన్, ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈజీగా తమ మొబైల్ నంబర్‌ను మార్చుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. mAadhaar యాప్‌లో మొబైల్ నంబర్‌ను ఛేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ సర్వీస్ ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ.. త్వరలోనే యూజర్లు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
Coming Soon! Update Mobile number in Aadhaar from the comfort of your home — through OTP & Face Authentication.
No more standing in the queue at the Aadhaar Centre.
Stay tuned…
Download now!
Android: https://t.co/f6QEuG8cs0
iOS: https://t.co/RUuBvLwvsQEarly adopters… pic.twitter.com/ZDjguIc9rZ
— Aadhaar (@UIDAI) November 28, 2025
మరోవైపు కొత్త ఇంటికి మారినా… లేదా ఆధార్‌లో చిరునామాలో ఏదైనా పొరపాటు కనిపించినా… వెంటనే అప్డేట్ చేయాలి. ఒక మంచి విషయం ఏమిటంటే.. UIDAI ఈ ప్రాసెస్ మొత్తం ఇంకాస్త సులభం చేసింది. ముందులా చాలాసార్లు పత్రాలు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ డేటాబేస్‌ల్లో ఉన్న PAN, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు లాంటి వివరాలతో ఆటోమేటిక్‌గా ధృవీకరించేస్తారు. ఇంతకంటే సింపుల్ ఏముంటుంది? అదనంగా, ఇప్పుడు విద్యుత్ బిల్లు లాంటి యుటిలిటీ బిల్లులనూ చిరునామా ధృవీకరణ కోసం అంగీకరిస్తున్నారు.
ఆధార్ చిరునామా ఆన్లైన్లో ఎలా అప్డేట్ చేయాలి?
మరి ఇలా ఆన్లైన్లో ఆధార్ చిరునామా ఎలా అప్డేట్ చేయాలి? అనేది స్టెప్ బై స్టెప్‌గా చూద్దాం…
–> మొదట myAadhaar పోర్టల్‌కి వెళ్లాలి.
–> మీ ఆధార్ నంబర్, క్యాప్ట్చా, మీ మొబైల్‌కి వచ్చిన OTPతో లాగిన్ అవ్వాలి.
–> లాగిన్ అయితే ‘Address Update’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
–> తర్వాత ‘Update Aadhaar Online’ అనే ఎంపిక వస్తుంది. దానిని ఎంచుకుని, సూచనలు చదివాలి
–> ‘Proceed to Update Aadhaar’ పై క్లిక్ చేయాలి.
దశలవారీగా చిరునామా అప్డేట్ విధానం:
ఇప్పుడు మీరు అప్డేట్ చేయాలనుకునే “చిరునామా” ఎంపికను ఎంచుకోవాలి. మీ ప్రస్తుత చిరునామా అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి కొత్త వివరాలు నమోదు చేయాలి. ‘Care of’ అంటే తండ్రి పేరు లేదా భర్త పేరు ఏదైనా, కొత్త ఇంటి చిరునామా, సంబంధిత పోస్టాఫీస్ పేరు… ఇవన్నీ సరిగ్గా నమోదు చేయాలి.
దాని తర్వాత చిరునామా నిర్ధారణ పత్రాన్ని ఎంచుకోవాలి. ఎంపిక చేసిన పత్రం స్కాన్ కాపీని అప్లోడ్ చేసి ‘Next’ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. తదుపరి స్క్రీన్‌లో మీరు నమోదు చేసిన అన్ని వివరాలు ప్రివ్యూ రూపంలో కనిపిస్తాయి. ఒక్కసారి బాగా చూసి అన్ని సరైందనిపిస్తే రూ.50 చెల్లించాలి. ఇది తిరిగి రాని మొత్తమే.
చిరునామా సవరణ పూర్తవడానికి ఎంత సమయం పడుతుంది?
సాధారణంగా చిరునామా అప్డేట్ కొన్ని రోజుల్లో పూర్తవుతుంది. కొన్నిసార్లు కొన్ని వారాలు పట్టొచ్చు. అప్డేట్ పూర్తయ్యాక తాజా చిరునామాతో కొత్త e-Aadhaarను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తానికి, ఆధార్ చిరునామా అప్డేట్ ప్రక్రియ ఇప్పుడు ముందుకంటే చాలా సులభమైంది. మీరు ఇటీవలే కొత్త ఇంటికి మారినా, లేదా మీ ఆధార్ చిరునామాలో ఏదైనా తప్పు ఉన్నా… ఆలస్యం చేయకుండా వెంటనే అప్డేట్ చేసుకోండి. ఇది రెండు నిమిషాల పని… కానీ భవిష్యత్తులో వచ్చే పెద్ద సమస్యలన్నింటినీ ఈ ఒక్క స్టెప్ తప్పించేస్తుంది.
ALSO READ: ఆ భాష మాట్లాడే మనుషుల మీద సమాజం చిన్నచూపు.. ఎందుకిలా? ప్రతిభకు భాష కొలమానమా?

ITR: ఇన్కమ్ టాక్స్ రిఫండ్ ఇంకా రాలేదా? ఇలా చేయండి!
Asia Climate Change: 2 కారణాలు.. గాల్లో లక్షల ప్రాణాలు..సైంటిస్టుల షాకింగ్ స్టడీ!
Railway Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. లక్షకు పైగా రైల్వే ఉద్యోగల భర్తీపై కీలక అప్డేట్!
Debt Trap: పీకల్లోతు అప్పుల్లో చిక్కుకున్నారా? ఈ 5 మార్గాలతో ఈజీగా బయటపడవచ్చు!
Indonesia: మృత్యు ఒడిలోకి 313మంది..! ఆ దేశంలోనే వరదలు, భూకంపాలు ఎందుకు?
New Year Plans: తెలంగాణ టూరిజం గోవా టూర్ ప్యాకేజ్.. న్యూఇయర్‌కి భలే ఆఫర్ బాస్.. పూర్తి వివరాలివే!