Menu

Cyclone Ditwah Updates: మరో తుఫాన్‌ టెన్షన్.. ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్!

Praja Dhwani Desk 2 months ago
The cyclonic storm Ditwah is expected to weaken into a deep depression on December 1 morning and a depression by the evening, says Cyclone Warning Centre, Visakhapatnam

డిసెంబర్ 1 ఉదయం నాటికి దిత్వా(Ditwah) తుఫాను(Cyclone) తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఆ రోజు సాయంత్రం నాటికి వాయుగుండంగా మారుతుందని విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ తుఫాను ప్రభావంతో నవంబర్ 29, 30 తేదీల్లో దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాలలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 29న నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలు, రాయలసీమ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షపాతంతో ‘ఆరెంజ్ అలర్ట్’.. ప్రకాశం, YSR కడప, అన్నమయ్య జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది వాతావరణశాఖ(IMD).

ALSO READ: శ్రీలంకలో అల్లకల్లోలం.. దిత్వా తుఫాన్‌ ఎఫెక్ట్‌తో పెరుగుతున్న మరణాలు..!

నవంబర్ 29న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల, నవంబర్ 30న చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఒకటి లేదా రెండు చోట్ల నవంబర్ 29, 30 తేదీలలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా, నవంబర్ 30న నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు. ప్రకాశం, YSR కడప జిల్లాలతో పాటు రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు.

నవంబర్ 30న అనంతపురం, శ్రీ సత్యసాయి, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేశారు. డిసెంబర్ 1వ తేదీన వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు డిసెంబర్ 1 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.

ALSO READ: బంగాళాఖాతంలో మరో తుఫాను? ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు తప్పదా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *