ఆ రోజుల్లో బడికి వెళ్తే ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉండేవాళ్ళం. ఇష్టాంగా చదువుకునేవాళ్ళం. ఆటపాటలు, కొత్త కొత్త గేమ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, పీటీ అని ఇలా ఎన్నో ఉండేవి. పిల్లలకు చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేవి. ఉపాధ్యాయుల పిల్లలపై చాలా ప్రేమ పంచె వారు. అక్కడే చిన్న షాపుల్లో చిరుతిండ్లు తీసుకొని ఎగురుకుంటూ వచ్చేవాళ్ళం..కానీ ఇప్పుడు రోజులు మారాయి. స్కూల్ అంటేనే పిల్లలు భయపడుతున్నారు. స్కూల్ వాళ్లు కూడా వారి సంస్థ పేరు కోసం పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పుడు పిల్లలు అవుట్ డోర్ ఫన్ మర్చిపోయారు. మంచి ర్యాంకులు రావాలంటూ అటు ఉపాధ్యాయులు ఇంట్లో తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు. సరిగ్గా చదవలేదంటే అందరిలో అవమానాలు పడాల్సి వస్తోంది. ఇదంతా భరించలేక విద్యార్థులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఇండియన్ స్కూల్స్‌లో తరచుగా బుల్లియింగ్ జరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. దీని కారణంగా మానసిక సమస్యలు వస్తున్నాయి.
పిల్లలకు అర్థమవుతుంది:
ఈ నవంబర్‌లో జైపూర్‌లో ఒక నాలుగో తరగతి పిల్లాడు పాఠశాలలో ఉండగానే తన ప్రాణానికి హాని జరిగే పని చేసి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులు, టీచర్లకు చాలా షాక్ ఇచ్చింది. ఈ ఘటన తర్వాత CBSE పాఠశాలకు నోటీసు పంపి, ఎందుకు ఇలా జరిగిందో కొన్ని కారణాలు చెప్పింది. అందులో పాఠశాల దాదాపు పద్దెనిమిది నెలలుగా వచ్చిన సూచనలు, సమస్యలను సరిగ్గా పట్టించుకోలేదన్న కారణం కూడా ఉంది. చాలా మంది పెద్దలు.. చిన్న పిల్లలు మరణం అంటే ఏమిటో అసలు అర్థం చేసుకోరని అనుకుంటారు. కానీ పిల్లల మనస్తత్వంపై చేసిన పరిశోధనలు చెప్పేది వేరే విషయం. 8-10 సంవత్సరాల లోపే చాలా మంది పిల్లలు మరణాన్ని తమకు ఉన్న బాధ, ఒత్తిడి ముగిసే మార్గంగా కూడా ఊహించగలరు. ఒక పిల్లవాడు ఇలా ఆలోచించే స్థితికి రావడం అంటే అతను చాలా కాలంగా భావోద్వేగంగా ఇబ్బంది పడుతూ ఉండి, ఆ బాధ ఎవరూ గుర్తించకపోవడం సాధారణంగా కనిపిస్తుంది.
ALSO READ: మహిళలకు గుడ్ న్యూస్.. గర్భాశయ క్యాన్సర్‌కు చెక్?
భారత్ అంతటా జరిగిన NCPCR, UNESCO, పాఠశాల భద్రతా సర్వేలు ఒక కఠినమైన నిజాన్ని చూపిస్తున్నాయి. పిల్లలు బెదిరింపులను తరచుగా ఎదుర్కొంటున్నా చాలా కేసులు బయటకు రావడం లేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తన మారినప్పుడు అది చిన్న కోపం లేదా వయస్సు మార్పు అనుకుని పెద్ద సమస్యను గుర్తించరు. తరువాత అసలు విషయం బయటపడుతుంది.
లక్షణాలేంటి?
బుల్లియింగ్ మొదట పెద్దగా కనిపించదు. అది మెల్లగా ప్రారంభమవుతుంది. పిల్లవాడు స్నేహితులతో కలవకపోవడం, పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం ఇలా చిన్న చిన్న మార్పులు మొదట కనిపిస్తాయి. పిల్లవాడు అసాధారణంగా ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తే తల్లిదండ్రులు కోపంతో కాకుండా ప్రేమతో మాట్లాడాలి. అతను ఎలా ఫీలవుతున్నాడో అడగాలి. అవసరం అయితే పాఠశాల కౌన్సెలర్‌ను ముందుగానే సంప్రదించడం మంచిది.
పిల్లవాడు బుల్లియింగ్ను ఎదుర్కొంటున్నప్పుడు అది నేరుగా చెప్పడు. అతని భావాలలో మార్పులు కనిపిస్తాయి. సాధారణంగా మాట్లాడే పిల్లాడు అకస్మాత్తుగా చాలా నిశ్శబ్దంగా మారడం, ఒంటరిగా ఉండడం, తరచూ ఏడవడం, చిన్న విషయాలకు కోపపడటం, పాఠశాలకు వెళ్లేముందు భయపడటం ఇలా ప్రవర్తించవచ్చు. ఇవన్నీ ఎక్కువ రోజులుగా అతను భయంతో లేదా ఒత్తిడితో ఉన్నట్లు చూపించే లక్షణాలు. బుల్లియింగ్ వల్ల శరీరంలో కూడా ఇబ్బందులు కనిపిస్తాయి. కారణం లేకుండా తలనొప్పి, కడుపు నొప్పి, వికారం రావచ్చు. విచిత్రంగా ఇవి వారాంతాల్లో లేదా సెలవు దినాల్లో తగ్గిపోతాయి. చిన్న పిల్లల్లో పీడకలలు రావడం లేదా మంచం తడపడం కూడా కనిపించవచ్చు. ఇది భయం, అవమానాన్ని తట్టుకోలేక శరీరం ప్రతిస్పందిస్తున్న సంకేతం.
చదువులో కూడా మార్పులు కనిపిస్తాయి. పాఠాలు ఆసక్తిగా చేదివేవాడు అకస్మాత్తుగా ఆసక్తి కోల్పోవచ్చు. హోంవర్క్ చేయకపోవడం, ప్రాజెక్టులకు దూరంగా ఉండడం, మార్కులు తగ్గిపోవడం, తరగతిలో పాల్గొనకపోవడం జరగవచ్చు. పిల్లవాడు ఎవరో తనను బాధిస్తారనే భయంతో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి చదువుపై దృష్టి పెట్టలేడు. తల్లిదండ్రులు చేయాల్సింది చాలా సులభం. పిల్లవాడి మాటలు పూర్తిగా వినాలి. అతను చెప్పే చిన్న విషయాన్నీ చిన్నగా తీసుకోకూడదు. జరిగినవి రికార్డు చేయాలి. సందేశాలు, ఫొటోలు, గాయాలు ఏవి ఉన్నా వాటిని సురక్షితంగా దాచుకోవాలి. పాఠశాలలో ఉన్న యాంటీ-బుల్లియింగ్ కమిటీతో మాట్లాడాలి. అవసరమైతే తాత్కాలికంగా రోజువారీ పనుల్లో మార్పులు చేయాలి. పిల్లవాడికి భయం లేదా ఒత్తిడి తగ్గేలా వాతావరణం కల్పించాలి. పిల్లవాడు తనను తాను ఇబ్బంది పెట్టుకునేలా మాట్లాడితే వెంటనే నిపుణుడైన సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి.
ALSO READ: టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..! CTET నుంచి కీలక అప్డేట్.. ముఖ్యమైన తేదీలివే!

‘అమ్మా..ఇలా ఎందుకు చేశావు? నేనేం చేశా అమ్మా..’ కన్న బిడ్డను తోసేసి చంపేసిన కసాయి తల్లి!
LGBTQ: పాత చింతకాయ పచ్చడి ప్రసంగాలు మానుకుంటే చాలా మంచిది..! వారి పట్ల ఇంత వివక్ష ఎందుకు?
Parenting: గట్టిగా అరవద్దు.. పిల్లల ముందు గొడవ పడొద్దు.. అధ్యయనాలు చెబుతున్న కఠిన నిజాలు!
Relationships: కన్నీటి చుక్కలో దాగిన శాంతి.. ఈ సమాజంపై ఓ మహిళ ఒంటరిగా గెలవగలదా?
Women’s Life: ఓ స్త్రీ.. నీ విలువెంత? ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెబుతారా?
India’s Hidden Script: బాల్యం నుంచే Gender Roles ను నేర్పిస్తున్న ఫ్యామిలీలు, సొసైటీ