పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) గురించి వివిధ రకాల వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌ను అడియాల జైలులో నిర్బంధించి దాదాపు రెండు సంవత్సరాలు దాటడంపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలను పెంచింది. ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు అక్కాచెల్లెమ్మలు దాడికి గురయ్యారు. ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ముగ్గురూ జైలు బయట ప్రశాంతంగా కూర్చొని ఆయనను కలసే అవకాశం ఇవ్వాలని కోరినప్పుడు అక్కడికి వచ్చిన పంజాబ్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కుటుంబ సభ్యుల ప్రకారం అధికారులు అకస్మాత్తుగా వీధి లైట్లు ఆర్పేసి చీకటి వాతావరణంలో వారిపై దాడి చేసినట్లు చెప్పారు. అందులో వృద్ధురాలైన నరీన్ నియాజీ నేలకేసి విసిరివేయబడినట్లు, ఆమెను రోడ్డుపై లాగినట్లు ఆరోపించారు. ఈ ఘటనలో ఉన్న మహిళా కార్యకర్తలను కూడా పోలీసులు తోసిపుచ్చినట్లు, చెంపదెబ్బలు కొట్టినట్లు వారు చెప్పారు.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత సోషల్‌మీడియాలో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, భద్రతపై అనేక వదంతులు వ్యాప్తి చెందాయి. కొన్ని ఖాతాలు ఆయన జైలులోనే మరణించాడని అసత్య ప్రచారం చేశాయి. అయితే అధికార పరిధిలో ఉన్న ఎవరూ ఈ విషయంపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజల్లో ఇంకా గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో జైలు అధికారులు ఆయనను ఏ వ్యక్తినీ కలవనీయకుండా ఒక నెలకుపైగా నిషేధం విధించారు.
మరోవైపు PTIకి చెందిన వేలాది మంది కార్యకర్తలు అడియాల జైలు బయటకు చేరుకొని నిరసనలు వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను రాజకీయంగా అణిచివేయడానికి ప్రభుత్వ వ్యవస్థలు ప్రయత్నిస్తున్నాయని వారు ఆరోపించారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిడి కూడా వరుసగా పలుమార్లు వచ్చినా జైలు అధికారులు ఆయనకు అనుమతి ఇవ్వలేదని పార్టీ నేతలు తెలిపారు. ఈ నియంత్రణలు సైనిక వ్యవస్థ ప్రభావంలో జరుగుతున్నాయని PTI ఆరోపిస్తోంది. దేశంలో ఉన్న రాజకీయ అస్థిరత, న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై ప్రజల్లో సందేహాలు పెరగడంతో ఇమ్రాన్ ఖాన్ స్థితి గురించి మరింత పారదర్శక సమాచారం ఇవ్వాలని పౌర సమాజం కోరుతోంది.
ALSO READ: శాలరీలో చేతికి సగమే ఇస్తారా? మీ జేబుకు ప్రభుత్వం పెద్ద సైజు చిల్లు పెట్టిందా?

USA WEAPONS: అమెరికా రాజకీయాల నీడలో నలిగిన మరో దేశం.. ఇది చాలా దారుణం!
Balochistan: బలూచిస్థాన్ రక్తపాతం.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. అసల కథేంటి?
Asia Climate Change: 2 కారణాలు.. గాల్లో లక్షల ప్రాణాలు..సైంటిస్టుల షాకింగ్ స్టడీ!
Railway Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. లక్షకు పైగా రైల్వే ఉద్యోగల భర్తీపై కీలక అప్డేట్!
Indonesia: మృత్యు ఒడిలోకి 313మంది..! ఆ దేశంలోనే వరదలు, భూకంపాలు ఎందుకు?
New Year Plans: తెలంగాణ టూరిజం గోవా టూర్ ప్యాకేజ్.. న్యూఇయర్‌కి భలే ఆఫర్ బాస్.. పూర్తి వివరాలివే!