Menu

Careers and Education: AI జమానాలోనూ ఈ డిగ్రీలు సేఫ్‌.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్!

Archana 2 months ago
As layoffs driven by artificial intelligence sweep across industries, a new report flips a long-held assumption on its head: the safest degrees for the future aren't engineering at all, but fields powered by empathy, judgment, and hands-on decision-making that AI can't mimic.

AI వచ్చేసింది. మనం ఏది అడిగితే అది చేస్తుంది. కానీ అదే AI మన నెత్తి మీదే కుంపటి పెట్టనుందా? ఎందుకంటే మన జాబ్ తీసేసుకుంటుంది. మన పని అదే చేసేస్తుంది. ఎందుకిలా అంటున్న అనుకుంటున్నారా? ఉదయం మీరు ఆఫీస్‌కి వెళ్తున్నారు.. కానీ అక్కడ మీ డెస్క్ మీద రోబో కూర్చుంది. మీ జాబ్ ఏమీ లేదు.. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మీ పని తీసుకుంది. ఇది కేవలం సినిమా సీన్ కాదు. ఇప్పటికే చాలా కంపెనీల్లో జరుగుతున్న వాస్తవం. లేఅవుట్స్ వచ్చాయి. చాలామంది జాబ్స్ పోగొట్టుకుంటున్నారు. అయితే కొన్ని డిగ్రీలు మాత్రం ఏఐని ఎదిరించి నిలబడడుతున్నాయి. ఇంతకీ మీ డిగ్రీ ఏమిటి? అది సేఫ్‌గా ఉందా? లేక రిస్క్‌లో పడిందా? ఇక ఏ డిగ్రీలు సేఫ్?

రిపోర్టు ఏం చెబుతోంది?

ఇక మనం 2025కి వచ్చేశాం. ఏఐ ప్రపంచాన్ని మార్చేస్తోంది. కానీ ఐడీపీ ఎడ్యుకేషన్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. ఏఐ రాకతో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇలా అడుగుతున్నారు. నా ఫ్యూచర్ కెరీర్ సేఫ్‌గా ఉంటుందా అని..ఈ రిపోర్ట్ ప్రకారం హ్యూమన్ టచ్ ఉన్న ఫీల్డ్స్ మాత్రమే సేఫ్. అంటే ఎంపతీ.. జడ్జ్‌మెంట్.. క్రియేటివిటీ.. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవి మెషీన్‌లు చేయలేని పనులు. ఇంజినీరింగ్, ఐటీ లాంటివి గొప్పవే కానీ హెల్త్‌కేర్.. మెడిసిన్ ఇవి టాప్ పొజిషన్‌లో ఉన్నాయి. ఎందుకంటే పేషెంట్‌తో మాట్లాడటం.. ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వటం.. ఇవి రోబోలు చేయలేవు.

ఈ రిపోర్ట్‌లో టాప్ కెరీర్లు ఏమిటి?

ముందుగా నర్స్ ప్రాక్టీషనర్స్.. వీళ్లు పేషెంట్స్‌కి కేర్ తీసుకుంటారు.. మెడిసిన్ గురించి గైడ్ చేస్తారు. శాలరీ ఏమిటంటే.. యూఎస్‌లో సంవత్సరానికి లక్షా 26 వేల డాలర్స్. గ్రోత్ 46 శాతం అంటే భవిష్యత్తులో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇక ఫిజీషియన్ అసిస్టెంట్స్. డాక్టర్‌లకు హెల్ప్ చేస్తారు.. డయాగ్నోసిస్ చేస్తారు. శాలరీ లక్షా 30 వేలు, గ్రోత్ 28 శాతం. యూరాలజిస్ట్స్.. రీహాబిలిటేషన్ ఫిజీషియన్స్ వీళ్లు స్పెషలైజ్డ్ మెడిసిన్ చేస్తారు. శాలరీ 2 లక్షల 36 వేలు, గ్రోత్ కేవలం 3-4 శాతం మాత్రమే కానీ రిస్క్ జీరో. ఎందుకంటే సర్జరీలు.. పేషెంట్ కేర్ ఇవి హ్యూమన్ జడ్జ్‌మెంట్ కావాలి.నర్స్ ఆనెస్తెటిస్ట్స్.. సర్జరీల్లో పేషెంట్‌ని స్లీప్ చేసి వాచ్ చేస్తారు. శాలరీ 2 లక్షలు 12 వేలు గ్రోత్ 10 శాతం. ఫిజిక్సిస్ట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్లు సైన్స్ రీసెర్చ్ చేస్తారు కానీ ఎక్స్‌పెరిమెంట్స్.. క్రిటికల్ థింకింగ్ కావాలి. సాలరీ లక్షా 55 వేలు. నర్స్ మిడ్‌వైవ్స్.. ఫిజికల్ థెరపిస్ట్స్ .. బిర్త్ డెలివరీ.. ఇంజురీ రికవరీలు చేస్తారు . సాలరీలు లక్షా 29 వేలు.. 99 వేలు. డెంటిస్ట్స్.. న్యూరాలజిస్ట్స్ కూడా టాప్‌లో ఉన్నారు. వీటిలో అడ్వాన్స్‌డ్ డిగ్రీలు అవసరం మెడిసిన్.. నర్సింగ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్. కానీ బ్యాచిలర్స్ తర్వాత కూడా ఫిజికల్ థెరపీ.. ఫిజిక్స్ లాంటివి సేఫ్.

మరోవైపు ఇండియన్ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్. మనం అబ్రాడ్ చదువుకోవడానికి యూఎస్.. యూకే.. కెనడా.. ఆస్ట్రేలియా వెళ్తాం. కానీ ఇమ్మిగ్రేషన్ పాలసీలు మారుతున్నాయి. పోస్ట్ స్టడీ వర్క్ వీజాలు టైట్ అవుతున్నాయి.. లివింగ్ కాస్ట్ పెరిగింది. ఇక్కడ ఏఐ కూడా జాబ్ మార్కెట్‌ని చేంజ్ చేస్తోంది. ఈ రిపోర్ట్ చెబుతోంది ఏంటేంటే హెల్త్‌కేర్ డిగ్రీలు చదివితే జాబ్ సెక్యూరిటీ బెటర్. వీళ్లు ఆక్యుపేషనల్ షార్టేజ్ లిస్ట్‌ల్లో ఉంటారు. వీసా ఈజీగా వస్తుంది. ఇంజినీరింగ్ వాల్యువబుల్ కానీ హెల్త్‌కేర్ ఎడ్యుకేషన్.. సైకాలజీ లాంటివి మరింత స్టేబుల్. మన ఫ్యామిలీలు శాలరీ మాత్రమే చూడకుండా లాంగ్ టర్మ్ సెక్యూరిటీ కూడా కన్సిడర్ చేయాలి.

ఇక హ్యూమన్ ఎలిమెంట్ ఎప్పటికీ రిప్లేసబుల్ కాదు. ఎంపతీతో మాట్లాడటం.. ఎథికల్ డెసిషన్స్ తీసుకోవటం.. అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్‌లో రియాక్ట్ అవ్వటం ఇవి మనల్ని స్పెషల్ చేస్తాయి. కాబట్టి మీరు స్టూడెంట్స్ అయితే ఈ ఫీల్డ్స్‌ని ఎంచుకోండి.

ALSO READ: సచిన్‌, కపిల్‌ నుంచి యువరాజ్‌ వరకు.. అంతా ధర్మేంద్ర అభిమానులే..! దిగ్గజ నటుడికి క్రికెట్‌తో విడతియ్యరాని బంధం!


Written By

S. Archana is an SEO specialist and sub-editor known for her strong adaptability and dedicated work ethic. A committed professional and an eager everyday learner, she continually sharpens her skills to deliver thoughtful, effective results.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *