Menu

Human Brain: కొంతమంది వ్యక్తులకు భయమే తెలియదా? మన మెదడు చెబుతున్న షాకింగ్‌ ఫ్యాక్ట్ ఇదే!

Lakshmi Aruna 3 months ago
what is VLGN

హఠాత్పరిణామానికి ఒక మనిషి భయపడిపోతే ఇంకొకరు మాత్రం నిశ్చలంగా ఉంటారు. ఒకే భావన ఇద్దరు వ్యక్తులకు వేర్వేరుగా ఎలా అనిపిస్తాయి? కొందరికి భయంగా ఎందుకు అనిపించదు? అనే ప్రశ్నలకు శాస్త్రవేత్తలు ఎట్టకేలకు సమాధానాలు దొరికాయి. భయాలకు నెరవకుండా ధైర్యంగా మసులుకునేలా మానవ మెదడు ఎలా పనిచేస్తుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. బ్రిటన్‌ యూనివర్సిటీ కాలేజ్ పరిశోధకుల బృందం భయానికి సంబంధించి మానవ మెదడు ఎలా ప్రతి స్పందిస్తుంది? అనే అంశంతోపాటు భయం వేళ మెదడు పని తీరుపై స్పష్టమైన అవగాహనకు వచ్చారు. ఈ వివరాలు ప్రఖ్యాత సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పలు రకాల ఫోబియాలు, ఆదుర్తా, ఏదైనా చికిత్స తర్వాత ఎదుర్కొనే సమస్యలను ఎదుర్కొనే రోగులను థెరపీ ద్వారా స్వస్థత చేకూర్చేందుకు కొత్త విషయాలు దోహపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

భయం ఎలా పోతుంది?

మనిషికి పుట్టుకతోనే కొన్ని భయాలుంటాయి. పెద్ద శబ్దాలు, హఠాత్తుగా తమ వైపు దూసుకొచ్చే వస్తువులను చూసి భయపడతాడు. అయితే కొన్నాళ్లకు కొన్ని భయాలు పోతాయి. చిన్నప్పుడు టపాసుల పేలుళ్లు భయపడిన వ్యక్తే ఆ తర్వాత తెగ టపాసులు కాలుస్తాడు. ఇదే తరహాలో ఎలుకలపైకి పక్షుల లాంటి వస్తువులు దూసుకొస్తున్నట్లు పరిశోధకులు ప్రయోగం చేశారు. ఎగిరొచ్చే వాటి నీడ పెద్దదయ్యే కొద్దీ ఎలుకలు భయపడ్డాయి. ప్రాణభయంతో పారిపోయాయి. అయితే నీడను ఇలా పదే పదే పెద్దగా చేసిన తర్వాత కేవలం నీడ పరిమాణం మాత్రమే పెరగడం ఎలుకలు గమనించి, ఆ తర్వాత భయపడటం మానేశాయి. పారిపోకుండా అలాగే చూశాయి.

VLGN అంటే ఏంటి?

ఇలా జరగడానికి ఎలుక మెదడులోని VLGN అనే ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోంది. మెదడులోని సెరిబ్రల్‌ కార్టెక్స్‌ ప్రాంతంలో స్టోర్ అయ్యే సమాచారం ఎక్కువగా VLGNలో స్టోర్ అవుతోంది. ఈ సమాచారాన్ని పదేపదే విశ్లేషించాక సంబంధిత అంశంలో భయపడాల్సిన పనిలేదని VLGN నిర్ధారిస్తోంది. నిజానికి నేర్చుకోవడం, గుర్తుంచుకోవడం, ప్రవర్తనకు సంబంధించిన అంశాల్లో సెరబ్రల్‌ కార్టెక్స్‌దే కీలకపాత్ర అని ఇన్నాళ్లూ భావించాం. కానీ అది తప్పు అని తేలింది. ఈ జ్ఞాపకాలన్నింటినీ VLGN మాత్రమే భద్రపరుస్తోంది. దీంతో శ్వాస, గుండెలయ, స్పృహ, నిద్ర లాంటి అంశాలకు మధ్య సంబంధం తెల్సుకునేందుకు అవకాశం చిక్కింది. VLGN సర్క్యూట్‌లలో మార్పులు చేయడం ద్వారా రోగిని భయపడకుండా చేయొచ్చు. ఇందుకు సంబంధించి ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది.

ALSO READ: ఆ అగ్నిపర్వతం పేలితే ఏమౌతుంది? వాల్కెనో మిస్టరీస్‌ ఆఫ్‌ ది వరల్డ్!

 


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *