బంగారానికి భారతీయులకూ విడదీయరాని బంధం ఉంది. అటు ఫైనాన్షియల్ బ్యాకప్‌గానూ
బంగారం చాలా బెస్ట్ అంటారు ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం బంగారం ధరలు పీక్ స్టేజ్‌లో ఉండడంతో ఇది మరోసారి బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 12లక్షల మార్క్‌ను దాటింది. దీంతో పెట్టుబడిదారుల చూపు మరోసారి పసిడిపై పడింది. ఇంతకీ బంగారం పెట్టుబడులకు ఉన్న ఆప్షన్స్ ఏంటి?
చాలా మంది ఫిజికల్ గోల్డ్‌ను కొంటుంటారు. అయితే గోల్డ్ మేకింగ్, వాల్యూ అడిషన్ కారణంగా కొనుగోలుదారుడు 16శాతం వరకు అధికంగా ధరను చెల్లిస్తున్నామని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బంగారం కొన్నామన్న తృప్తితో పాటు ఎంతో కొంత రాబడులు వస్తే చాలు అనుకునేవాళ్లు ఫిజికల్ గోల్డ్ కొనడం గురించి ఆలోచించవచ్చని.. కానీ లాంగ్ టర్మ్‌లో మంచి రాబడి కావాలంటే మాత్రం ఫిజికల్ గోల్డ్ బెస్ట్ ఆప్షన్ కాదని అభిప్రాయపడుతున్నారు.
ఆర్థిక స్థోమత బాగుంటే బంగారాన్ని బిస్కెట్స్ రూపంలో తీసుకోవడం మంచిది. మార్కెట్లో ఉన్న హోల్‌సేల్ ధరకే ఇది దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. పైగా వాల్యూ అడిషన్ పేరుతో ఇక్కడ అదనపు బాదుడూ ఉండదు. కాకపోతే వీటిని ఇంట్లో పెట్టుకోవాలంటే సేఫ్టీ, సెక్యూరిటీల గురించి కూడా ఆలోచించాలి.
కొందరు అర గ్రాము, గ్రాము, రెండు గ్రాములు.. ఇలా గోల్డ్ కాయిన్స్ కొంటుంటారు. వీటికి మేకింగ్, వేస్టేజ్ ఛార్జీలు అత్యధికంగా ఉంటాయి. అందుకే వెయిట్ టు వెయిట్ మార్చుకునే అవకాశం ఉన్నప్పుడే కాయిన్స్ కొనడం గురించి ఆలోచించండి. లేకపోతే ఇది చాలా కాస్ట్లీ ఆప్షన్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
పెట్టుబడిగా బంగారం గురించి ఆలోచించే వాళ్లకు మార్కెట్లో గోల్డ్ ETF, గోల్డ్ ఫండ్స్, గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్ లాంటి వివిధ ఎంపికలు ఉన్నాయి. పేర్లు వేరైనా వీటి లక్ష్యం దాదాపు ఒకటే.. మంచి రాబడులు ఇవ్వడం. ఉదాహరణకు గోల్డ్ ETFపై ఓ లుక్కేద్దాం. ఇవి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. బంగారాన్ని నేరుగా కొనుగోలు చేస్తాయి. ఇవి స్టాక్ మార్కెట్లో యూనిట్స్ రూపంలో ట్రేడ్ అవుతాయి. HDFC గోల్డ్ ETF, యాక్సిస్ గోల్డ్ ETF, ఐసీఐసీఐ ప్రూ గోల్డ్ ETF లాంటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా -సెబీ పర్యవేక్షణ ఉంటుంది. ఫిజికల్ గోల్డ్‌కు బెస్ట్ అల్టెర్నెట్ ఇది.
ALSO READ: అప్పు తీసుకోవడం మంచిదే..! కానీ ఇక్కడే ట్విస్ట్.. ఇలా చేశారంటే మాత్రం అడ్డంగా బుక్ అవుతారు!

ITR: ఇన్కమ్ టాక్స్ రిఫండ్ ఇంకా రాలేదా? ఇలా చేయండి!
Step Up SIP: రిటైర్మెంట్ కోసం ఎలా ప్లాన్ చేయాలి? ఈ SIPతో మీ రాబడి రెట్టింపు!
Debt Trap: పీకల్లోతు అప్పుల్లో చిక్కుకున్నారా? ఈ 5 మార్గాలతో ఈజీగా బయటపడవచ్చు!
SIP: లక్ష పెడితే రూ.51లక్షలు..! ఇన్వెస్టర్లకు ఫేవరెట్ స్కీమ్ ఇది..!
Business Ideas: ఈ 6 బిజినెస్ ఐడియాస్తో మీరు లక్షలు సంపాదించవచ్చు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ!
Investment Ideas: PPF బెటరా? FD బెటరా? మీ ఫైనాన్షియల్ గోల్స్‌కి ఏది సరిపోతుంది?