మనలో చాలా మందికి లైఫ్‌లో ఒక స్టేజీ వచ్చేసరికి ఒక విషయంలో ఫుల్ క్లారిటీ వస్తుంది.. ‘అప్పులు చేస్తే తిప్పలేనా?’ అనే సందేహం వస్తుంది. అసలు చెప్పాలంటే అప్పు అంటే తప్పు కాదు. కానీ మనం ఆ అప్పును ఎలా తీసుకుంటాం? తీసుకున్న అప్పును ఎక్కడ ఖర్చు చేస్తాం అన్నదే మన భవిష్యత్తుని మార్చేస్తుంది. ఈరోజు నిజంగా, అప్పులు చేస్తే ఎలాంటి తిప్పలు వస్తాయి? అలాగే అప్పులు లేకుండా బతకాలంటే ఏం చేయాలి? అనేదానికి ఒక క్లియర్ explainer చూద్దాం.
శాలరీలో సగం EMIలకేనా?
మొదట ‘అప్పులు చేస్తే వచ్చే తిప్పలు’ గురించి మాట్లాడితే.. చాలా మందికి మొదటి రోజు సరే అనిపిస్తుంది కానీ తర్వాతే అసలు గేమ్ మొదలవుతుంది. శాలరీ పడక ముందే EMI రిమైండర్లు వస్తాయి.. ‘మీ డ్యూ రేపు, మీ ఓవర్ డ్యూ ఇవాళ’ అని. మన నెలసరి ఆదాయంలో ఒక పెద్ద భాగం ముందే పోతుంది. అదే అసలైన మెంటల్ ప్రెషర్. ఒక ఎమర్జెన్సీ వచ్చినా, చేతిలో డబ్బు ఉండదు. ఎందుకంటే అవన్నీ EMIలకు అల్రేడీ బుక్ అయిపోతాయి
వడ్డీతో యమ డేంజర్
ఇంకా లోన్ తీసుకున్నా, నిజమైన తిప్పలు వడ్డీలోనే ఉంటాయి. రూ.10,000 తీసుకున్నా, తిరిగి చెల్లించాల్సింది రూ.12,000.. రూ.14,000… రూ.16,000 అవుతూనే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ EMIలు, లోన్ యాప్‌లలో చిన్న మొత్తాలు తీసుకున్నట్టు అనిపించినా.. నెలాఖరుకి చూసేసరికి అది సైకలాజికల్ ట్రాప్ అయిపోతుంది. రెండు నెలలు లేట్ అయితే… కాల్స్, మెసేజ్‌లు, వార్నింగ్‌లు.. కొన్ని యాప్స్ అయితే, గుర్తు తెలియని నంబర్ల నుంచి రోజుకి 20 సార్లు కాల్ చేస్తాయి. వ్యక్తిగత శాంతి పోవటమంటే ఇదే అన్నమాట.
అనవసర ఖర్చులు వద్దు:
ఇంకో ఇబ్బంది ఏంటంటే… అప్పు చేసిన మనిషి తన నిర్ణయాలను తీసుకోవాలంటే ముందుగా ‘EMI’ గురించి ఆలోచించుకుంటారు. కొత్త ఫోన్ కొనాలా? ట్రిప్‌కి వెళ్ళాలా? ఫ్యామిలీకి ఏదైనా కొనాలా? లాంటివి వాయిదా పడుతూనే ఉంటాయి. అప్పు తీసుకునే ముందు మనమే డబ్బుని కంట్రోల్ చేస్తాం.. ఒకసారి డబ్బు అప్పు తీసుకున్నామా? ఆ అప్పు మనల్ని కంట్రోల్ చేస్తుంది. That is the hard truth.
అలాగే ఒక లోన్ తీసుకుంటే చాలనుకుంటాం కానీ అవసరం లేని ఖర్చులకి మరో లోన్.. క్రెడిట్ కార్డ్.. తర్వాత పర్సనల్ లోన్.. ఇలా చైన్ రియాక్షన్ ప్రారంభమవుతుంది. ఒక లోన్ తిరిగి చెల్లించటానికే ఇంకో లోన్ తీసుకోవడం మొదలైతే.. దాని పేరే డెబిట్ ట్రాప్. దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం.
అయితే ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే.. ‘అప్పులు లేకుండా ఎలా బ్రతకాలి?’ అది అసాధ్యం కాదు.. దానికి డిసిప్లిన్ మాత్రం అవసరం. మొదట ఏది ముఖ్యమో, ఏది లగ్జరీ ఖర్చు అనేది తెలుసుకోవాలి. ఫోన్ కూడా EMIలో తీసుకోవచ్చు.. కానీ నిజంగా అవసరమా? మనం రాబడికి మించి అప్పు చేయకూడదు. అవసరం లేకున్నా కొనాలని అనుకునే వాటిని 30 రోజుల రూల్‌తో కంట్రోల్ చేయండి. ఒక్కసారి ఆ 30 రోజులు వెయిట్ చేస్తే, కొనాలనే కోరిక 80శాతం తగ్గిపోతుంది.
మరొక ముఖ్యమైన పాయింట్.. ఎమర్జెన్సీ ఫండ్ . 3-6 నెలలు ఖర్చును మనం దాచుకుంటే, అత్యవసర సమయంలో అంతపెద్ద ఒత్తిడి ఉండదు. అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రాదు. శాలరీ వచ్చిన వెంటనే 10%-20% సేవింగ్‌కి పక్కన పెట్టాలి. డబ్బులు దాచటం చిన్న స్టెప్ అనిపించినా.. భవిష్యత్తులో అదే మనకి పెద్ద ప్రొటెక్షన్.
అలాగే ఒక చిన్న అలవాటుచేసుకోవాలి.. చేతిలో ఉన్నదానికంటే ఎక్కువ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం. ఇంటి అద్దె, ట్రాన్స్‌పోర్ట్ , ఫుడ్ లాంటివి శాలరీలో 50శాతం లోపలే ఉన్నాయంటే, మిగిలిన దానితో పొదుపు చేయడం సులభం. Don’t impress others. Don’t compare. ఫైనాన్సియల్ ఫ్రీడమ్ అంటే మనకు మనమే కళ్లెం వేసుకోకపోవడం.
ఇంకొక నిజం ఏంటో తెలుసా.. అప్పు లేకుండా బతికే వ్యక్తి జీవితం సింపుల్‌గా ఉంటుంది, కానీ ఆనందంగా గడిపే జీవితాల్లో అది ఒకటి. ఎందుకంటే అతను ఎవరికీ సమాధానం ఇవ్వనక్కర్లేదు. కాల్స్ పిక్ చేయాల్సిన బాధ ఉండదు. EMI బ్రేక్ అయిపోతుందేమో అన్న భయం ఉండదు. అతను తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయం వెలకట్టలేని సంతోషాన్ని ఇస్తుంది.
సో, చివరగా చెప్పాలంటే.. అప్పు తీసుకోవడం తప్పు కాదు కానీ సరైన ప్లాన్ లేకుండా తీసుకోవడం మాత్రం నిజమైన ఇబ్బందే. ఇన్‌కమ్, ఎమెర్జెన్సీ నీడ్స్, ఫ్యూచర్ గోల్స్ చూసుకుని.. తిరిగి చెల్లించగలననే నమ్మకం వున్నప్పుడు మాత్రమే లోన్ తీసుకోండి. లేకపోతే.. అప్పుల్లేని జీవితంకంటే ఫ్రీ, కాన్ఫిడెంట్, పీస్‌ఫుల్ లైఫ్ మరొకటి లేదు.
ALSO READ: ఆ అగ్నిపర్వతం పేలితే ఏమౌతుంది? వాల్కెనో మిస్టరీస్ ఆఫ్ ది వరల్డ్!

ITR: ఇన్‌కమ్ టాక్స్ రిఫండ్ ఇంకా రాలేదా? ఇలా చేయండి!
Debt Trap: పీకల్లోతు అప్పుల్లో చిక్కుకున్నారా? ఈ 5 మార్గాలతో ఈజీగా బయటపడవచ్చు!
Business Ideas: ఈ 6 బిజినెస్ ఐడియాస్తో మీరు లక్షలు సంపాదించవచ్చు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ!
Investment Ideas: PPF బెటరా? FD బెటరా? మీ ఫైనాన్షియల్ గోల్స్‌కి ఏది సరిపోతుంది?
Loan Offers: వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్.. అమెజాన్, ఫ్లిప్‌కార్టు నుంచి బిజినెస్ లోన్స్.. పూర్తి వివరాలివే!
Aadhar Update: కాలు బయటకు పెట్టాల్సిన అవసరమే లేదు.. ఇంటి నుంచే మీ మొబైల్ నంబర్‌తో పాటు ఆధార్ అడ్రెస్‌ను ఇలా ఇలా అప్డేట్ చేసుకోండి!