Menu

Jobs: తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న జాబ్ ట్రెండ్‌.. ఈ ఒక్క స్కిల్‌ ఉంటే ఉద్యోగం పక్కా!

Lakshmi Aruna 3 months ago
jobs in linkedln

హైదరాబాద్(Hyderabad) వ్యాపార వీధుల్లో ఇప్పుడు మార్పుల మధుర గాలి వీచుతోంది. కృత్రిమ మేధస్సు వేడి వెలుగులో చిన్న వ్యాపారాలు కొత్త ఆశలతో ముందుకు పరుగులు తీస్తున్నాయి. పని వేగం పెరిగి. ఖర్చులు తగ్గి. నాణ్యత మెరుగై ప్రతి అడుగులో ఆత్మవిశ్వాసం పెరిగింది. నియామకాల్లోనూ ప్రచారాల్లోనూ రోజువారీ పనుల్లోనూ కృత్రిమ మేధస్సు సహచరంలా నిలిచి వ్యాపార ప్రపంచానికి కొత్త లయను తెచ్చింది. నమ్మకం. భద్రత లాభం వెంట నడుస్తూ సరైన వేదికను ఎంచుకునే జాగ్రత్త మరింత పెరిగింది. ఈ మార్పుల సంగీతంలో హైదరాబాద్ వ్యాపారాలు ఒక కొత్త శకానికి దారితీస్తున్నాయి.

లింక్డిన్‌(LinkedIn) చేసిన కొత్త స్టడీ ప్రకారం, హైదరాబాద్‌లో ఉన్న చిన్న, మధ్య తరహా వ్యాపారాల్లో దాదాపు 10లో 9 వ్యాపారాలు AIను ఉపయోగిస్తున్నాయి లేదా త్వరలో ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నాయి. అంటే, ఈ నగరంలోని చిన్న వ్యాపారాలు ఇప్పుడు టెక్నాలజీ మీద ఎక్కువగా ఆధారపడుతూ, తమ పని విధానాలను మార్చుకుంటున్నాయి. ఈ వ్యాపారులంతా వచ్చే ఏడాది తమ బిజినెస్ పెరుగుతుందనే నమ్మకం కూడా వ్యక్తం చేస్తున్నాయి. కారణం సింపుల్ అండి..! AI వాడటం వల్ల పని త్వరగా, తక్కువ ఖర్చుతో, మంచి క్వాలిటీతో పూర్తవుతోంది. అందుకే ఇప్పుడు చాలా మంది AI ను తమ వ్యాపారంలో ఒక భాగంగా చేసుకుంటున్నారు.

హైరింగ్‌, మార్కెటింగ్‌, ఆపరేషన్స్.. వీటిలో AI పెద్ద పాత్ర పోషిస్తోంది. ఉదాహరణకు, ఉద్యోగులను ట్రైన్ చేయడానికి, కొత్త ఉద్యోగులను వెతకడానికి, కంపెనీ డేటాను అర్థం చేసుకోవడానికి, అలాగే రోజువారీ పనులను ఆటోమేటిక్‌గా చేసుకోవడానికి AI చాలా ఉపయోగపడుతోంది. ఇప్పుడు కంపెనీలు డిగ్రీ కంటే కూడా, సమస్యలను ఎలా పరిష్కరిస్తారు?, టెక్నాలజీ ఎంతవరకు తెలుసు? AI పై అవగాహన ఉందా? అనే నైపుణ్యాలను ఎక్కువగా చూస్తున్నాయి.

మార్కెటింగ్ విషయంలో కూడా AI ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చాలా కంపెనీలు తమ మార్కెటింగ్ బడ్జెట్‌లో ఒక పెద్ద భాగాన్ని AI టూల్స్‌పై ఖర్చు చేస్తున్నారు, ఎందుకంటే దాంతో సరైన కస్టమర్లను సరిగ్గా టార్గెట్ చేయగలుగుతున్నారు. సేల్స్‌లో ఫాలో-అప్స్ కూడా ఆటోమేటిక్‌గా జరగడం వల్ల చిన్న వ్యాపారాలకూ పెద్ద కంపెనీల లాంటి సామర్థ్యం వస్తోంది. ఇప్పుడైతే వ్యాపారాలు ఏ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌నైనా ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు. వారికి ముఖ్యమైనది.. ప్లాట్‌ఫారమ్ నమ్మకంగా ఉందా? డేటా సేఫ్‌గా ఉందా? పెట్టిన డబ్బుకు సరైన లాభం వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చినప్పుడు మాత్రమే వారు ఆ ప్లాట్‌ఫారమ్‌ను వాడుతున్నారు.

మొత్తం మీద చూస్తే, హైదరాబాద్‌లోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలు AI వాడటం వల్ల మరింత స్మార్ట్‌గా, వేగంగా పని చేసే స్థాయికి చేరుకుంటున్నాయి. హైరింగ్‌ నుంచి మార్కెటింగ్‌ వరకు, పనులన్నీ AI సహాయంతో సులభంగా జరుగుతున్నాయి. ఈ వేగం చూస్తుంటే, హైదరాబాద్‌ త్వరలోనే భారతదేశంలో AI ఆధారిత వ్యాపారాల కేంద్రంగా మరింత బలంగా నిలుస్తుంది అనడంలో సందేహమే లేదు.

ALSO READ: మీ పర్సనల్ ఫైనాన్స్ ప్లాన్‌లో మొదటి స్టెప్ ఏంటి? ఇది చేయకపోతే మీ ఆస్తులు మొత్తం కరిగిపోతాయ్!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *