చాలా మంది జీవితంలో ఒకసారి అయినా ‘ఏదో ఒక రోజు 1 కోటి అయినా సంపాదిస్తే బాగుండు’ అనుకుంటారు. కానీ ఆ కోటి రూపాయలు చేరుకోవాలంటే పెద్ద జీతం కావాలి, పెద్ద పెట్టుబడి కావాలి అది మనవల్ల కాదులే, అనుకుని వెనక్కి తగ్గిపోతారు. నిజానికి, అంత నిరాశ అవసరం లేదు. నెలకు కేవలం రూ.10,000 SIP ఇన్వెస్ట్ చేస్తూ కొద్దిపాటి డిసిప్లిన్ పాటిస్తే, కోటి రూపాయలు టార్గెట్ చేరడం పూర్తిగా సాధ్యమే. ఇందులో ఏ క్లిష్టమైన ఫార్ములాలు అవసరం లేదు. కేవలం సమయానికి పెట్టుబడి పెట్టడం, స్మార్ట్‌గా ఫండ్స్ ఎంపిక చేసుకోవడం చాలు.
మీరు రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేస్తుంటే, కాంపౌండింగ్ అనే పవర్ మీ డబ్బుని ఊహించని లెవెల్స్‌కి తీసుకెళ్తుంది. మీరు ఈరోజు పెట్టిన డబ్బు పెరుగుతుంది.. ఆ లాభంపైనా ఇంకొన్ని లాభాలు వస్తాయి.. ఇలా మీ డబ్బు సంవత్సరం తర్వాత సంవత్సరం వేగంగా గ్రో అవుతూ ఉంటుంది.
రూ.10,000 SIPని ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిది?
ఒకే ఫండ్‌లో మొత్తం డబ్బు పెట్టకుండా, దాన్ని కొన్ని విభాగాలుగా చీల్చితే రిస్క్ తగ్గుతుంది. మార్కెట్ ఎక్కడ బాగా పెరిగితే, ఆ సెక్టార్ మీ మొత్తం పోర్ట్‌ఫోలియోను కూడా పైకి లాగుతుంది.
అందుకే రూ10,000 SIPను ఇలా సెట్ చేయడం బెస్ట్:
➜ Flexi-cap ఫండ్‌లో 25%
➜ Multi-cap ఫండ్‌లో 20%
➜ Large & Mid-cap ఫండ్‌లో 20%
➜ Mid-cap ఫండ్‌లో 20%
➜ Small-cap ఫండ్‌లో 15%
ఇలా రకరకాల ఫండ్ కాంబినేషన్ పెట్టడం వల్ల లార్జ్ కంపెనీల స్థిరత్వం, మిడ్ క్యాప్ కంపెనీల గ్రోత్, చిన్న కంపెనీల లాంగ్ టర్మ్ హై రిటర్న్స్.. ఇవన్నీ మీ పోర్ట్‌ఫోలియాలో కలిసి ఉంటాయి. ఏ సెగ్మెంట్ డౌన్ అయినా, మిగతా సెగ్మెంట్లు దాన్ని కవర్ చేస్తాయి.
అలా చేస్తే 1 కోటి ఎప్పుడు వస్తుంది?
మీరు నెలకు రూ.10,000 SIP పెట్టడం ప్రారంభించి, ప్రతి సంవత్సరం దాన్ని 10% పెంచుకుంటూ వెళితే.. దాదాపు 15 సంవత్సరాల్లో మీరు కోటి రూపాయల మార్క్‌ను చేరవచ్చు. చాలా మంచి ఫండ్స్ లాంగ్ టర్మ్‌లో ఏడాదికి 12% నుంచి 15% వరకు రిటర్న్స్ ఇచ్చాయి. మీరు SIP మొత్తాన్ని సంవత్సరానికి పెంచలేకపోతే కూడా, ఫిక్స్‌డ్ రూ.10,000 SIPతో 20–23 సంవత్సరాల్లో 1 కోటి చేరే ఛాన్స్ ఉంటుంది.
ఈ ఫండ్స్ ఏం చేస్తాయి? వీటి పని ఏమిటి?
Flexi-cap ఫండ్స్ అంటే.. పెద్ద కంపెనీలు, మధ్యస్థాయి కంపెనీలు, చిన్న కంపెనీలు… వీటిల్లో దేనిలోనైనా పెట్టుబడి పెట్టడానికి ఫండ్ మేనేజర్‌కి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్ ఏ దిశలో కదిలినా, దానికి తగ్గట్టు ఫండ్ మేనేజర్ మార్పులు చేస్తారు.
Multi-cap ఫండ్స్ మాత్రం లార్జ్, మిడ్, స్మాల్.. ఈ మూడు రకాల కంపెనీల్లో ఒక ఫిక్స్‌డ్ శాతం డబ్బు పెట్టడం తప్పనిసరి. ఇది పర్ఫెక్ట్ డైవర్సిఫికేషన్.
Large & Mid-cap ఫండ్స్‌లో లార్జ్ కంపెనీల భద్రత + మిడ్ కంపెనీల గ్రోత్ రెండూ ఉంటాయి. రిస్క్ కూడా కొంచెం తక్కువ.
Mid-cap ఫండ్స్ అంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్య తరహా కంపెనీలు. రిస్క్ ఉంటుందిగానీ, లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్‌ని ఇస్తాయి.
Small-cap ఫండ్స్ మాత్రం చాలా వోలటైల్. ఒక్కోసారి పెద్దగా పడిపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్‌లో ఇవి అత్యధిక లాభాలు ఇస్తాయి. కాస్త రిస్క్ తీసుకోగలిగే ఇన్వెస్టర్లకు బాగా సూట్ అవుతాయి.
SIP ప్రయాణం ఎలా ప్రారంభించాలి?
ముందుగా Groww, Zerodha, Paytm Money లాంటి ప్లాట్‌ఫామ్‌లో మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీ రిస్క్ లెవల్‌ని అర్థం చేసుకోండి. ఆ తర్వాత పైన చెప్పిన అలొకేషన్ ప్లాన్ ప్రకారం SIPలు స్టార్ట్ చేయండి. ప్రతి సంవత్సరం మీ SIP మొత్తాన్ని కాస్త పెంచండి. ముఖ్యంగా 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఈ పెట్టుబడిని నిలుపుకోవాలి. మధ్యలో డ్రాప్ అయితే కాంపౌండింగ్ పవర్ తగ్గిపోతుంది.
ALSO READ: SIPలో ఏది బెస్ట్? నెలకు రూ.5,000 లేదా? ఏడాదికి రూ.60,000? ఏది లాభం?

ITR: ఇన్కమ్ టాక్స్ రిఫండ్ ఇంకా రాలేదా? ఇలా చేయండి!
Step Up SIP: రిటైర్మెంట్ కోసం ఎలా ప్లాన్ చేయాలి? ఈ SIPతో మీ రాబడి రెట్టింపు!
Debt Trap: పీకల్లోతు అప్పుల్లో చిక్కుకున్నారా? ఈ 5 మార్గాలతో ఈజీగా బయటపడవచ్చు!
SIP: లక్ష పెడితే రూ.51లక్షలు..! ఇన్వెస్టర్లకు ఫేవరెట్ స్కీమ్ ఇది..!
Business Ideas: ఈ 6 బిజినెస్ ఐడియాస్తో మీరు లక్షలు సంపాదించవచ్చు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ!
Investment Ideas: PPF బెటరా? FD బెటరా? మీ ఫైనాన్షియల్ గోల్స్‌కి ఏది సరిపోతుంది?