ఒకప్పుడు స్కూల్ అంటే.. బెల్ మోగగానే బైటకు పరుగులు, మధ్యలో లంచ్ బాక్స్ షేరింగ్, ఫ్రెండ్స్‌తో మజా.. కానీ ఇప్పుడు? టిఫిన్ బాక్స్‌లో భోజనం కాకుండా కత్తులు, బ్యాగ్‌లో పుస్తకాల బదులు దేశీ గన్స్! అవును.. ఇది చదివిన వెంటనే షాక్ అవుతున్నారు కదా? కానీ ఇది నిజం. ఇటీవల ఉత్తరాఖండ్‌లో ఒక విద్యార్థి తన టీచర్‌ను రివాల్వర్‌తో కాల్చాడు. ఈ ఘటన మాత్రమే కాదు, ఇప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో స్కూల్ విద్యార్థులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. కూకట్‌పల్లిలో ఓ మైనర్ బాలికను మరో మైనర్ బాలుడు హత్య చేయడం మరో ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది విషయం ఒకటుంది. ఇది పూర్తిగా ఆ అబ్బాయి నేరమేనా? వ్యవస్థ, సామాజిక తప్పిదాలు కూడా ఉన్నాయా అనే విషయాన్ని కచ్చితంగా చర్చించాలి.
చిన్న చిన్న గొడవలు… ఒక్కసారిగా కత్తులు, రాడ్లు, గన్స్ వరకు వెళ్తున్నాయి. ఇది ఎందుకు జరుగుతోంది? నిపుణులు చెబుతున్న కారణాలు రెండు..! అందులో ఒకటి…పిల్లల్లో పెరిగిన అసహనం, ఆవేశం. రెండోది…సోషల్ మీడియా, సినిమాలు, రీల్స్‌లో హింసాత్మక కంటెంట్. రివెంజ్ తీర్చుకోవడమే ‘హీరోయిజంలా’ చూపించడం.
అలాంటి మాటలు ఎందుకు?
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి…ఈ పరిస్థితులలో పిల్లలు బెట్టింగ్ యాప్‌లకు, అలాగే సోషల్ మీడియా ప్రభావం వల్ల దొంగతనాలకు.. పాల్పడుతున్నారు. దీనికి కారణం మన సొసైటీ…! సొసైటీ అంటే ఎవరో కాదు మనమే…పిల్లలకు నేర్పటానికి ముందు మనం మారాలి. మనం ఏం చూపిస్తున్నాం వాళ్ళకి… లాంటి మాటలు మాట్లాడుతున్నాం…నోరు తెరిస్తే చావులు…చిన్న చిన్న గొడవలకు వాడ్ని చంపెయ్యాలి…చితక్కొట్టాలి…ఇంకా ఏవేవో బూతులు…మరి ఇలాంటివి మనం చేసేటప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారు?
మీడియాకు కనీసం సిగ్గుందా?
మీడియా పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. ఫోన్‌లను కొని ఇచ్చేసి వాటితో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడకుండా మన పని మనం చేసుకుంటున్నాం. హత్య జరిగింది అని చెబుతూ దాన్ని ఎలా చేస్తున్నారో ఎలా తప్పించుకోవాలో కూడా మీడియాలో చెబుతన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే వాటిని వీడియోలు తీసి రీల్స్ అప్లోడ్ చేస్తున్నారు. మరి రీల్స్ చూడటానికి ఒక ఏజ్ పరిమితి లేదు. పిల్లలపై అవి తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే స్మగ్లింగ్ చేసేవాడు హీరో…ధూమపానం స్టైల్‌గా చేయటం హీరోయిజం…ఎంత ఎక్కువ మందిని నరికి నరికి చంపితే అంత క్రేజ్. ముందు అలాంటి సినిమాలను బ్యాన్ చెయ్యాలి. A సర్టిఫికెట్ సినిమా అంటారు కానీ OTTలలో పిల్లలు వాటిని చూడకుండా ఉంటారా?
ఇప్పుడు మనమంతా ఇంకో విషయం గురించి కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా స్కూల్స్ సేఫ్‌గా ఉన్నాయా? లేక మినీ కదనరంగాలుగా మారుతున్నాయా? ఇది స్కూల్స్ తప్పా లేక పేరెంట్స్ తప్పా లేక పిల్లలదా..ఎక్కడ ఉంది లోపం?
ఇంకా ఒక సీరియస్ ఇష్యూ ఏమిటంటే.. వాళ్ళను ఎవరు అర్ధం చేసుకోలేని పరిస్థితి. ఒక పిల్లవాడు కోపం, నిరాశ, భయం ఏదైనా ప్రాబ్లెమ్‌లో ఉంటే, దాన్ని ఎవరికీ చెప్పలేక.. లోపలే ఎమోషన్స్‌తో కుమిలిపోతాడు. ఆ తరువాత ఒక చిన్న ఇన్సిడెంట్‌లో ఆగ్రహం బాంబులా పేలిపోతుంది.ఇక ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒక్కటే…ఇది ఎవరి బాధ్యత? స్కూల్‌దా? పేరెంట్స్‌దా? లేక సమాజం మొత్తందా? నిజానికి.. ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ . ఎందుకంటే పిల్లలు ఏమి చూస్తారు, ఏమి వింటారు, ఎలా రియాక్ట్ అవుతారు. ఇది బుక్స్ మాత్రమే టీచ్ చేయదు. మన సొసైటీ షేప్ చేస్తుంది.
మిగిలిన రాష్ట్రాల మాటేంటి?
ఇప్పటికే కొన్ని మోడల్స్ ఉన్నాయి. కేరళలో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ అనే ప్రోగ్రాం చాలా సక్సెస్ అయ్యింది. కొంతమంది స్కూల్స్‌లో ‘సేఫ్ ఫీడ్‌బ్యాక్ బాక్స్’ పెట్టారు. అక్కడ పిల్లలు తన పేరు చెప్పకుండా.. తమ ప్రోబ్లమ్స్ రాయొచ్చు. తమిళనాడులో కూడా కొన్నిసేఫ్ జోన్ ఆట్టెంప్ట్స్ ఉన్నాయి. కానీ ఇవన్ని కొన్ని రాష్ట్రాల ప్రయత్నాలు మాత్రమే. అసలు దేశవ్యాప్తంగా ఒక ‘సేఫ్ స్కూల్ లా’ రావాలి. ప్రతి స్కూల్‌లో రెగ్యులర్ సేఫ్టీ ఆడిట్స్ , కౌన్సిలర్ల ప్రెజన్స్ , పిల్లల మానసిక ఆరోగ్యంపై దృష్టి..అన్నీ ఇంప్లీమెంట్ అవ్వాలి. చివరగా.. స్కూల్ అంటే బుక్స్ , ఎగ్జామ్స్ , ర్యాంక్స్ మాత్రమే కాదు. అది ఒక సేఫ్ స్పేస్ కావాలి. అక్కడి నుంచి బయలుదేరే ప్రతి పిల్లవాడూ సొసైటీకి బెటర్ సిటిజెన్ కావాలి. కానీ… అక్కడ హింసను నేర్చుకుంటే? ఆ ఫ్యూచర్ ఎలా ఉంటుంది?
మనమంతా ఒకసారి స్వయం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే..’ఒక స్కూల్‌లో knife కల్చర్ మొదలైతే.. రేపు గన్ కల్చర్‌కి మారడానికి ఎక్కువ సమయం పట్టదు.’ కాబట్టి ఇప్పటి నుంచైనా పిల్లల పట్ల బాధ్యతగా ఉండండి.
ALSO READ: గాజాపై కరువు కాటు.. పేగులను పెకిలించే కన్నీటి కథ

‘అమ్మా..ఇలా ఎందుకు చేశావు? నేనేం చేశా అమ్మా..’ కన్న బిడ్డను తోసేసి చంపేసిన కసాయి తల్లి!
Gaza Famine: గాజాపై కరువు కాటు.. పేగులను పెకిలించే కన్నీటి కథ
LGBTQ: అణచివేతల చీకట్లో నిలబడ్డ వెలుగులు.. ప్రేమకు పరిధులుంటాయా? ఇది వినిపించని గొంతుల గర్జన!
Taloja Jails: మానవ హక్కులను కాలరాస్తున్న తలోజా జైళ్లు.. లోపలికి వెళ్లడమే కానీ బయటకు రాలేం..!
South Africa Massacre: కార్మికులను ఆకలితో మాడ్చి చంపేసిన ప్రభుత్వం.. సొరంగంలో కుళ్ళిన శవాలకుప్పలు!
Kolkata Murder-Sexual Assault Case: దేశంలో హత్యాచార రాజకీయాలు .. నిజాన్ని దాటేందుకు మరెన్నో కుట్రలు!!