Menu

Tsunami: సునామీలను ముందుగానే కనిపెట్టే జంతువులు ఉన్నాయా? ఇది తెలిస్తే మీ ప్రాణాలు నిలబడతాయి!

Lakshmi Aruna 6 months ago
russia tsunami updates

మనం కొన్ని సినిమాల్లో చూసే ఉంటాం…జంతువులన్నీ వలస పోతుంటాయి…అక్కడ వాతావరణం ప్రమాదమేనా లేక సరిపడా నీరు లేకపోవటం వల్లనో అవి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తాయి..అయితే.. సముద్రం తీరంలో ఉన్న జంతువులు ఒక్కసారిగా అడవుల వైపు పరుగెడితే… అది కేవలం సహజ ప్రవర్తన కాదని మీకు తెలుసా? అది ఒక పెద్ద హెచ్చరిక. ప్రాణాలను కాపాడే సహజ అలారం. ఈ విషయం అర్థం చేసుకోలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతారు…

దీనికి ఒక రియల్ ఇన్సిడెంట్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2004 డిసెంబర్ 26… ఇండియన్ ఓషన్. చరిత్రలోనే అత్యంత భయంకరమైన సునామీ తాకి 2 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ విపత్తులో జంతువులు మాత్రం ఆశ్చర్యకరంగా బతికిపోయాయి. ఇండోనేషియా, శ్రీలంకలోని ఏనుగులు, జింకలు, కుక్కలు, గేదెలు ఇవన్నీ సునామీ వచ్చేముందే అడవుల వైపు పరిగెత్తడం మొదలుపెట్టాయి. అయితే ఇక్కడ సందేహం వాటికి సునామీ వస్తోందని ఎలా తెలిసింది? ఎవరూ చెప్పలేదు కదా…ఇక్కడే మనం జంతువులకు వుండే సహజ శక్తి గురించి తెలుసుకోవాలి.

సౌండ్‌ ద్వారా పసిగడతాయా?

జంతువుల శరీరంలో ఒక అద్భుతమైన సహజ సెన్సార్ ఉంటుంది. మనం ఫీలవలేని భూకంపనలు వాటికి ముందే తెలిసిపోతాయి. సముద్రపు లోతుల్లో భూకంపం సంభవిస్తే, నీటిలో ఒత్తిడి ఒక్కసారిగా మారుతుంది. మన చెవులు వినలేని అల్ట్రాసోనిక్ శబ్దాలను జంతువులు స్పష్టంగా వింటాయి. మరియు వాసనల్లో, పర్యావరణ మార్పుల్లో చిన్న చిన్న తేడాలు వచ్చినా అవి వెంటనే గుర్తిస్తాయి. ఈ అన్ని సంకేతాలు కలిసే వాటికి ఒక అలారం లాగా పనిచేస్తాయి ‘ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో’ అని వాటి మెదడు వాటిని హెచ్చరిస్తుంది.

విపత్తు వస్తోందని ముందే తెలిసిన జంతువులు ఎత్తైన ప్రదేశాల వైపు పరుగెత్తుతాయి. ఈ సహజ అలారాన్ని మనుషులు పట్టించుకోకపోవడం వల్లే అనేక ప్రాణాలు పోతుంటాయి. తీరప్రాంతంలో ఉంటూ ఏనుగులు, జింకలు, కుక్కలు ఇలా జంతువులు ఒక్కసారిగా పారిపోతున్నట్టు కనిపిస్తే…ఆ దృశ్యం అందంగా అనిపించినా, అది మీకు ప్రాణాలను కాపాడే సిగ్నల్ కావచ్చు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే సురక్షిత ప్రదేశానికి వెళ్లాలి. సునామీ, వరదలు, భూకంపాలు వీటిని మనం ఆపలేం. కానీ ముందే సంకేతాలను గుర్తించడం ద్వారా మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రకృతి మనకంటే తెలివైనది.. మనకు తెలిసినా తెలియకపోయినా ప్రకృతికి తెలిసిపోతుంది. జంతువులు చూపే ఈ సహజ సంకేతం.. ఒక ప్రాణాన్ని కాపాడే అలారం. మీరు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఇది గుర్తు చేయండి. ఒక సమాచారం.. ఒక షేర్… ఎవరో ఒకరి ప్రాణాన్ని రక్షించవచ్చు.

ALSO READ: నా సముద్రపు కన్నీటి కథ..రహస్య ప్రపంచంలో తేలియాడుతున్న రాకాసి ప్లాస్టిక్‌ కవర్లు!

 


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *