Menu

LGBTQ: అణచివేతల చీకట్లో నిలబడ్డ వెలుగులు.. ప్రేమకు పరిధులుంటాయా? ఇది వినిపించని గొంతుల గర్జన!

Tri Ten B 7 months ago
what is LGBTQ

ఎవరు గీశారు ఈ సరిహద్దులు..
ఎందుకు కట్టారు ఈ గొడలు
మేం ఎవరిని ప్రేమించాలో కూడా సమాజమే చెబుతుందా?
మా అస్థితత్వం ఏంటో కూడా మీరే నిర్ణయిస్తారా?

మా హృదయం ఎలా స్పందించాలో.. మా భావాలు ఎవరిమీద పుడితే సరిందో కూడా మీరే తేలుస్తారా?

నిజంగా ప్రేమకి నియమాలు, నిబంధనలు ఉండాలా? ఉంటే అది ప్రేమవుతుందా?
మా శరీరాలకి ఈ శిక్షలు ఎందుకు?
మా భావనలకి ఈ బంధలెందుకు?

ఇది ఇప్పటి వివక్ష కాదు.. వేల సంవత్సరాల నాటిది.. సంస్కృతి చాటున తరతరాలుగా స్వేచ్ఛను కాలరాస్తూ వచ్చారు. ‘ఇది తప్పు’, ‘ఇది పాపం’ అనే ముద్రలు వేస్తూ, వేలాది జీవితాలను బలితీసుకున్నారు. మగవాడికి ధైర్యం, ఆడదానికి సంయమనం..ఇలా ఇద్దరి మధ్యే ప్రేమ ఉండాలని తీర్పు చెప్పడానికి మీరెవరు? నువ్వు ఇలా ఉండాలి.. నువ్వు ఇలానే ఉండాలని చెప్పే అధికారం మీకెవరిచ్చారు? ప్రేమించాలన్న మనసుకి పరిమితులు ఎందుకు? అసలు ప్రేమకి ధర్మం ఉందా? ప్రేమకి జాతి ఉందా? ప్రేమకి జెండర్ ఉందా? ఇది మీ మతాలు సృష్టించిన నియమాలు కావా? మీరు చదివిన పాఠ్యపుస్తకాల్లో ఇది ఉండకపోవచ్చు. మీరు చదువుకున్న స్కూల్, కాలేజీ పుస్తకాల్లో LGBTQ అనే పదమే లేకపోవచ్చు. ఇప్పుడు సమయం వచ్చింది. LGBTQ కమ్యూనిటి పోరాటానికి తెరలు తియ్యాల్సిన సమయం దగ్గరపడింది. ఇప్పటికీ చాలా మంది L అంటే ఏంటి, G అంటే ఎవరు, B అనే పదానికి అర్థమేంటి? T అనే పదం దేనికోసం..? Q అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే మీకు చదువు చెప్పినవాళ్లే ఈ విషయాలను దాచేశారు. ఈ సమాజపు మూఢనమ్మకాలు వాటిని పాతిపెట్టే ప్రయత్నం చేశాయి. అందుకే తెలియకపోయినా తెలుసుకోవాలి. తెలుసుకోవడమే మొదటి అస్త్రం. ప్రశ్నించడం రెండో అస్త్రం..! పోరాడడం మూడో అస్త్రం..ఈ మూడు అస్త్రాల బాణాలను ఎక్కుపెట్టాలంటే.. ఈ అక్షరాల వెనుక ఉన్న గొంతులు, బాధలు, నిజాలు అర్థం చేసుకోవాలి.

LGBTQ హక్కులు

L(LESBIAN)
ఒక స్త్రీ మరో స్త్రీ పట్ల ఆకర్షణ కలగడం సహజమే. ఇది లోపం కాదు. ‘ఆమెకు’ కూడా ‘ఆమెను’ ప్రేమించే హక్కు ఉంది. కానీ ఈ సమాజం ఆమె ప్రేమను ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ప్రేమించే వ్యక్తి ఒక పురుషుడు కాదు కాబట్టి దీన్ని ఏదో తప్పులా చూస్తుంది.

G (GAY)
ఒక పురుషుడికి మరో పురుషుడిపై ప్రేమ కలగొచ్చు. ఈ ప్రేమకు చుట్టూ ఉన్న సమాజం ఒప్పుకోదు.

B(BISEXUAL)
ఒక మనిషికి ఆడవారిపై, మగవారిపై కూడా ప్రేమ, ఆకర్షణ కలగొచ్చు. దీన్నే బైసెక్సువాలిటీ అంటారు. ఇది కూడా ఒక ఐడెంటిటీనే!

LGBTQ హైదరాబాద్

T(TRANSGENDER)
ఒకరు పుట్టినప్పుడు శరీరం ఒకలా ఉండొచ్చు. కానీ తన మనసు చెప్పే జెండర్ ఫీలింగ్ ఇంకోలా ఉండొచ్చు. మగ శరీరంతో పుట్టినా.. వాళ్లు ఆడవారిలా ఉండాలంటారు. ఆడ శరీరంలో పుట్టినా.. కొందరు మగవారిలా ఉండాలంటారు. ఇలాలేని ఇష్టం శరీరంలో ఉండలేక తమ జెండర్‌ను శాస్త్ర బోధనలో మార్చుకుంటారు. నిజానికి LBGTQలో మిగిలిన వారి కంటే ట్రాన్స్‌జెండర్లు తమ భావ సమాజం ముందు నిలిపేందుకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. చిన్ననాటి నుంచే ‘నువ్విలా మాట్లాడుతున్నావ్?’ ‘నువ్వేంటి ఇలా నడుస్తున్నావ్?’ అని నొప్పించేలా మాట్లాడుతారు. స్కూల్లో, విధుల్లో, ఇంట్లో…ఇలా ప్రతిచోటా చిన్న చిన్న పదాలతో పెద్ద గాయాలను తగిలించేందుకు సమాజం ఎప్పుడు ముందుంటుంది. ఎందుకంటే ఆ సమాజానికి ఇతరులను జడ్జ్ చేయడమే పని కాబట్టి! ట్రాన్స్‌జెండర్ అనే పదాన్ని నమ్మకంగా పలకడమే గొప్ప విషయంగా భావించకూడదు. వాళ్లను అందరిలాగానే చూడడం, వాళ్ల ఆత్మగౌరవాన్ని గుర్తించడం, వాళ్లకు హక్కులు కల్పించడం కూడా చేయాలి. ట్రాన్స్‌జెండర్ల ప్రేమకి, జీవితానికి, కలలకు కూడా చోటు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్లూ అందరిలాంటి మనుషులే. అందరి కన్నా ఎక్కువగా పోరాడుతున్న మనుషులే.

Q(QUEER)
క్వీర్ అనేది ఒక పరస్పర స్వేచ్ఛల ప్రపంచం. ఇది రూల్స్ లేని ప్రేమ. ఇది పట్టింపుల లేని మనసుకు చిహ్నం. ఎవరి ప్రేమనైనా, ఆకర్షణనైనా, లేదా ఎలాంటి ఐడెంటెని అంగీకరించని భావజాలన్నీ క్వీర్ అంటారు. ‘నేను ఏది కాదు.. నేను నేనే’ అని చెప్పుకోవడం క్విర్‌తనంలో భాగం!

హైదరాబాద్‌లో LGBTQ కవాతు

ఇది సహజత్వమే..:

ఈ భూమిమీద మనుషులే కాదు.. అనేక జీవరాశులు.. పక్షులు, జంతువులు, చేపలు కూడా హోమోసెక్సువల్ ప్రవర్తనను చూపుతాయి. కొన్ని జాతులలో ఇది ప్రేమగా, బంధంగా, సహజమైన భాగంగా ఉంటుంది. అవి నేరంగా చూడవు.. తప్పుడు కోణంలో చూడవు. కానీ మనిషి ఒక్కడే ఇలా అతితెలివిగా ప్రవర్తిస్తున్నాడు. ప్రేమపై కోణాల్ని, జెండర్‌పై రూల్స్‌ను, జీవన విధానాలపై నిబంధనలు విధించుకుంటూ.. ప్రేమకు పెడుతున్నాడు. నిజానికి మనసుకు వర్ణాలు ఉండవు.. మనసుకు శరీర రూపాలు అవసరం లేదు. ఎవరిని ప్రేమించాలో మన మనసే తేల్చాలి.. ఆ నిర్ణయం పూర్తిగా మనదే అవ్వాలి. ఎందుకంటే ప్రతి మనిషికీ తన భావాలను చెప్పే హక్కు ఉంది. ప్రేమించే హక్కూ ఉంటుంది. జీవించే హక్కు కూడా ఉంది. ఎవరు ఎలా ఉండాలనుకుంటారో, వాళ్ల గుర్తింపును గౌరవించే లక్షణం అందరిలో ఉండాలి. ఫైనల్‌గా చెప్పేది ఒక్కటే ప్రేమ ప్రేమ .. ఇదే నిజం!

ఇంకా చదవండి: ప్రేమ శాశ్వతం కాదా? తీపి కలల నుంచి కల్లోల సముద్రపు కన్నీరు వరకు సాగే ప్రయాణం!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *