ఈ సారి ఆమె ఐదుగురికి కాదు… ఒకే ఒక ప్రశ్నకి భార్యగా పుడుతుంది. ఆనాటి ద్రౌపది తిరిగి పుడితే… ఈ సమాజాన్ని ఏమి అడుగుతుంది? తెలుసుకోవాలనుందా…ముందుగా లాంగ్ లాంగ్ ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం..! పురాణాల్లోని చరిత్రలో.. ఆ ద్రౌపదికి వైభవం ఉంది… కానీ వ్యక్తిగతంగా ప్రశాంతత లేదు. ఐదుగురు భర్తలు ఉన్నా, ఒక్క భర్త ప్రేమగా పక్కన కూర్చోలేని జీవితమది. అయినా ఆమె ఏనాడు ప్రశ్నించలేదు… ఎందుకంటే ఆ కాలంలో ఆమెకు ప్రశ్నించే హక్కే లేదు. కానీ…ఒకవేళ ఈ జన్మలో ద్రౌపది పుడితే?
ఈ సారి ద్రౌపది బట్టలు లాగినవాళ్లను చూస్తూ ఊరుకోదు, “నా మౌనమే మీ అహంకారానికి కారణమా?” అని ప్రశ్నిస్తుంది. అవమానాన్ని ఓనవాలు చెబుతూ జయజాలాలు చెప్పే రాజసభకు ఈసారి ఆమె తన నోట మాటలు కాదు…పలుకుబడి, ధైర్యం, న్యాయం అడుగుతుంది.
ఈ జన్మలో ద్రౌపది పెళ్లి అయిన మూడో రోజే విడాకులు తీసుకుంటుంది, ఎందుకంటే ఆ సంబంధం “బలవంతపు ఒప్పందం” అని గుర్తిస్తుంది కాబట్టి. ఆమె గౌరవం కోసం ఆరంభమైన మహాభారత యుద్ధం…ఈసారి ఆమె దాన్ని అవసరం అనుకోదు. ఆమె కలం.. యుద్ధానికి బదులుగా చైతన్యాన్ని లేవనెత్తుతుంది.
ఈ ద్రౌపది ఒక పత్రికా సంపాదకురాలు అవుతుంది, లేదా జడ్జ్, లేదా మానవ హక్కుల ఉద్యమ నాయకురాలు… ఇలా ఏదైనా కావొచ్చు..ఈ ద్రౌపది అప్పటిలా మౌనంగా కృష్ణుడి కోసం చూడదు. ఎందుకంటే ఈ యుగంలో ఏ కృష్ణుడు రాడు తనని కాపాడటానికి అని తనకు తెలుసు.
నేటి ద్రౌపది సిగ బిగించుకొని కూర్చోదు..ఆ కురులపై చేయి వేసిన వాడి చెయ్యి విరిచే ఒక విప్లవంగా మారింది..తనకు కత్తి అవసరం లేదు.ఒక కలం లేదా గళం చాలు… ఒక సినిమా పాటపై అభ్యంతరం చెప్పినంత మాత్రాన, ఆమెను “సంస్కార హీనురాలు” అంటారేమో…ఒక దుస్తుల ఎంపికపై కామెంట్స్ చేసి, ఆమెను “భారతీయతను తగలబెట్టిందని” ఈ సమాజం తీర్పు ఇవ్వవచ్చు…కానీ ఈ ద్రౌపది వెనక్కి తగ్గదు.
ఎందుకంటే ఈసారి ఆమె రాజసభలో ఒంటరిగా కాదు..ఆమెతో పాటు నిలుస్తారు లక్షల మంది మహిళలు…ఆమె తిరిగి పుడితే… భర్తల కోసం కాదు… సమాజానికి అద్దం చూపడానికి పుడుతుంది. ఒక్కసారి ఆమె మొహం చూస్తే మీ వాదనలు కాదు… మీవంటి వ్యవస్థలే ప్రశ్నలుగా మారతాయి.
ద్రౌపది మళ్ళీ తిరిగి పుడితే… యుద్ధం కాదు, మార్పు కోసం ప్రయత్నం చేస్తుంది. కారణం, ఈసారి ఆమెకు ప్రేమ కాదు… స్వేచ్ఛ తన అవసరం కాబట్టి!
ALSO READ: నువ్వెవరు? ఈ కులాలు, వర్గాలు ఎవరి సృష్టి? నిజంగా దేవుడు ఉన్నాడా?

Rationalist Files: ‘ఆమెను మోసం చేశారు..’ నిజమైన హేతువాదం సోషల్‌మీడియాలో కాదు.. నిజ జీవితంలో కనిపించాలి..! సిద్ధాంతాల వెనుక దాక్కునే పిరికితనం!
Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Marriage System: ఇది పెళ్లి కాదు..దోపిడి..! ఇదేం సన్నాసి సంత.. ఇంతటి నీతిమాలిన వివాహ వ్యవస్థ ఎక్కడా ఉండదు!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Relationships: మనల్ని మనమే మరిచిపోయిన కథ.. బతుకుతున్నామా లేదా నటిస్తున్నామా?