Menu

America-Israel: అమెరికాకు కావాల్సింది ఇదే.. అణు బాంబుల కథ పచ్చి అబద్ధం..!

Tri Ten B 8 months ago
clean break document

ప్రపంచం శాంతి గురించి మాట్లాడుతుంది కానీ.. కొన్ని దేశాలు మాత్రం యుద్ధమే శాంతి అనే మాయతో ముందుకు సాగుతుంటాయి. ఈ ప్రపంచపఠంలో అమెరికాకు ఉన్న గర్వం, తలపొగరు మరో దేశానికి ఉండదు. తన ఆధిపత్యం కోసం ఏ దేశాన్ని అయినా నాశనం చేయడానికి అమెరికా వెనుకాడదు. ఇటు ఇజ్రాయెల్‌ను మించిన స్వార్థం మరో దేశానికి ఉండదు. పొరుగుదేశాలను ముట్టడిస్తూ.. ఆ దేశాల ప్రాంతాలను అస్తవ్యస్తం చేయడమే లక్ష్యంగా పెట్టుకునే బుద్ధి ఇజ్రాయెల్‌ది. ఇటు అమెరికా.. అటు ఇజ్రాయెల్‌.. ఈ రెండు కలిసి మధ్యప్రాచ్య దేశాలను రక్తంతో నింపేశాయి. కాల్పుల విరమణతో ముగిసిన ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేయకూడదని.. అందుకే ఈ దాడి చేశామని బయటకు చెబుతున్నా అసలు కారణం మాత్రం వేరే ఉంది. ఈ కారణాలు తెలిస్తే ఆశ్చర్యం మాత్రమే కాదు ఆగ్రహం కూడా కలుగుతుంది. ఇంతకీ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ చేసిన కుట్ర ఏంటి? దీని వెనుక ఉన్న కారణాలేంటో నేను మీకు explain చేస్తా..! ముందు ఇప్పటి పరిస్థితులు అర్థం చేసుకోవాలన్నా.. లేదా అమెరికా-ఇజ్రాయెల్‌ ప్లాన్ తెలియాలన్నా ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లాలి..!

నాడు సద్ధాంను అన్యాయంగా చంపేశారా?

అది 2003.. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ప్రపంచానికి మాయ మాటలు చెప్పారు. ఇరాక్‌ వద్ద ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధాలు ఉన్నాయట.. సద్దాం హుస్సేన్‌ అల్‌ఖాయిదాతో చేతులు కలిపాడట.. ప్రపంచాన్ని రక్షించాలంటే ఇరాక్‌ మీద దాడి తప్పదట. ఆ మాటలు నమ్మిన చాలా దేశాలు అమెరికా వెంట నడిచాయి.. కానీ తర్వాతి రోజుల్లో అసలు నిజాలు బయటపడ్డాయి. ఇరాక్‌ వద్ద ఎలాంటి క్రూరమైన ఆయుధాలు దొరకలేదు. సద్దాం హుస్సేన్‌కు ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు రుజువుకాలేదు.. కానీ అప్పటికే ఇరాక్‌ బూడిదైంది. యుద్ధంలో ప్రజల రక్తం నదిలా పారింది. ఒక చక్రవర్తిగా దేశాన్ని నడిపిన సద్దాం హుస్సేన్‌ను బహిరంగంగా ఉరి తీయడంతో, అమెరికా తన విజయాన్ని ఘనంగా ప్రకటించుకుంది. కానీ అది నిజానికి విజయం కానే కాదు.. ఒక దేశాన్ని నేలమట్టం చేసిన ఘోరమైన ఘట్టం. శాంతి తెస్తామన్న అమెరికా మాటలు అబద్ధమయ్యాయి. ఇరాక్‌ గాయం ఇప్పటికీ మానని దేహంలా కనిపిస్తూనే ఉంది. ఇదే ప్లాన్‌ను ఇప్పుడు ఇరాన్‌పై ప్రయోగించాలనుకుంది అమెరికా..! కానీ ఇరాన్‌ ఎదురుదాడులతో సక్సెస్‌ కాలేకపోయింది. ఇంతకీ అసలు అమెరికా-ఇజ్రాయెల్‌ ఈ విధమైన ప్లాన్‌ను ఎందుకు వేశాయో తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ రెండు దేశాల డీల్‌ అర్థంకావాలి.

క్లీన్ బ్రేక్‌ డాక్యుమెంట్‌లో ఏముంది?

నిజానికి ఇది ఒక్కసారిగా వచ్చిన యుద్ధ ప్రణాళిక కాదు. ఇది చాలా పాతది. 1996లోనే ‘క్లీన్ బ్రేక్’ అనే ఓ సీక్రెట్‌ డాక్యుమెంట్ బయటకు వచ్చింది. అమెరికాలో ఉన్న నెయోకాన్ వ్యూహకర్తలు రాసిన ఈ ప్రణాళికలో కొన్ని విషయాలు భయాన్ని రేపేలా ఉన్నాయి. ఇరాక్‌, సిరియా, లెబనాన్‌, ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకోవాలని ఈ డాక్యుమెంట్‌లో క్లియర్‌కట్‌గా ప్రస్థావించి ఉంది. ఇజ్రాయెల్‌కు పూర్తి భద్రత కలిగే విధంగా మధ్యప్రాచ్యాన్ని అస్తవ్యస్తం చేయడం ఈ వ్యూహం అసలైన లక్ష్యం. ఎక్కడైతే ప్రజలు ఏకతాటిపై ఉంటారో, బలమైన ప్రభుత్వాలు ఉంటాయో, సొంతంగా పాలించుకోగల శక్తి ఉంటుందో.. ఆ రాజ్యాలను విచ్ఛిన్నం చేయాలి.. చీల్చాలి..! మరణం, వలసలు, అస్థిరత లాంటివి ఈ వ్యూహంలో భాగమే. ఇజ్రాయెల్‌కు ‘సెట్లర్‌ కొలనియలిజం’ లాంటి దారుణమైన ఆశయముంది. పాలిస్తీనా భూములను ఆక్రమించుకుని.. అక్కడి ప్రజలను తరిమికొట్టి, కొత్త శరణార్థ శిబిరాలను తయారు చేయడం.. ఇదే వాళ్ల యుద్ధతంత్రం. ఈ పని ఇప్పటికీ పూర్తికాలేదు. అందుకే అమెరికా అండతో ఇజ్రాయెల్ పాలస్తినాను నాశనం చేసేపనిలో ఉంది. ఇటు ఇరాక్‌పైనే ఇదే ప్లాన్. అణు ఆయుధాల మాట పచ్చిబూటకమే. ఇది ఇరాన్‌పై జరుగుతున్న బలవంతపు నియంత్రణ.

ఇంత దుర్మార్గమా?

ఇక ఇరాన్‌ మతపాలనలో అక్కడి మహిళలు నరకం అనుభవిస్తున్నరన్నది నిజమే కావొచ్చు. వారి వెనుక నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో మరో మాట లేకున్నా.. అమెరికా-ఇజ్రాయెల్‌ లక్ష్యం మాత్రం అది కాదు. ఇజ్రాయెల్‌కు భూకాంక్ష ఉంటే.. అమెరికాకు మిడిలిస్ట్‌లోని సంపదపట్ల ఏనలేని మోజు ఉంది. ఇరాన్‌లో చమురు నిల్వలు భారీగా ఉన్నాయి. అమెరికా ఉద్దేశం ఇది మాత్రమే. పూర్తిగా మిడిలిస్ట్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవాలంటే అమెరికాకు అడ్డుగా ఉన్న ఏకైక దేశం ఇరాన్ మాత్రమే. ఇరాన్‌ ఓ దేశంగా స్వయంగా ఎదడగం అమెరికాకు ఏ మాత్రం ఇష్టంలేదు. ఇటు తన లక్ష్యాలను సాధించాలనే ఉన్మాదంలో అమెరికా ఎన్నో దేశాల కలలు తుడిచిపారేసింది. లక్షల కుటుంబాల జీవితాలను నాశనం చేసింది. పసిబిడ్డలు రక్తపు బురదలో శ్వాస తీసుకునే పరిస్థితి వచ్చింది. మిడిలిస్ట్‌లోని అనేక దేశాల్లో తల్లుల శవాలను పిల్లలు మోస్తున్నా… వాళ్ల బాధను పట్టించుకునేవారే లేకుండా పోయారు. బాంబులు పడిన భూముల్లో భవిష్యత్తు అనే మాటే లేదు. ఇది 21వ శతాబ్దంలో యుద్ధం మాటున జరుగుతున్న ఒక పురాతన దుర్మార్గం. ఎవరో కొందరికి ఆధిపత్యం కావాలనే కోరిక కోసం, లక్షల మంది తమ జీవితాల్ని కోల్పోతున్నారు. ఇంతకీ నిజమైన శత్రువు ఎవరు? అణు ఆయుధమా? లేదా ఈ అణు భయాన్ని మాయగా వాడుకుంటూ, శాంతి పేరుతో నరమేధం చేస్తోన్న ఈ రెండు దేశాలా? ఒక మనిషి కన్నీటికి విలువే లేదా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రతి మనిషి మనసులో గట్టిగా దూసుకెళ్లాలి. సమాధానాల కోసం కాదు… నిజాన్ని అంగీకరించడం కోసం…! ఎందుకంటే ఇదే సత్యం!

ALSO READ: ఇది అభిమానం కాదు.. ఉన్మాదం..ఉగ్రవాదం.. బానిసత్వం..బుద్ధి లేని బతుకులు!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *