ఆర్సీబీని గెలవకుండా ఆపి.. మానవత్వాన్ని దేవుడే కాపాడాలి…’ ఇది IPL చూడనివారికి పెద్దగా తెలియని పదాలే అయినా ఈ లీగ్‌ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్లు జీవితంలో ఒక్కసారైనా ఈ లైన్‌ని వినే ఉంటారు. ఆర్సీబీ కప్ గెలిస్తే యావత్ మానవాళికే ముప్పు అని చాలా మంది లబోదిబోమన్న సందర్భాలు చాలానే ఉన్నాయ్. కానీ ఆర్సీబీ అదృష్టమో లేదా క్రికెట్ ఫ్యాన్స్ దురదృష్టమో కానీ 2025సీజన్లో ఆర్సీబీ తొలిసారిగా కప్ కొట్టింది. ఇక్కడవరకు బాగానే ఉన్నా.. గెలిచిన తర్వాత ఆ జట్టు అభిమానులు చేసిన అతి దేశవ్యాప్తంగా కంపరం పుట్టించింది. ఇక ఊహించినట్టే విక్టరీ ర్యాలీలకు ఆర్సీబీ ఫ్రాంచైజీ ప్లాన్ చేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కనీసం ప్లాన్ లేకుండా జరిగిన ఈ ఎపిసోడ్ కారణంగా 11మంది అభిమానులు తొక్కిసలాటలో చనిపోయారు. ఇది ఎవరి తప్పు కారణంగా జరిగిందో అటు ఉంచితే.. ఇండియాలో తొక్కిసలాటలకు ప్రాణాలు పోవడం.. ఘటన తర్వాత సంబంధిత అధికారులు, ప్రభుత్వాలు చేతులు దులుపుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. అసలు ఇండియాలో మనుషుల ప్రాణాలంటే పెద్ద జోక్..! ఎవడు చస్తే నాకేంటనే నైజం కనిపిస్తోంది. నువ్వు తొక్కిసలాటలో పోతే నీ ఖర్మ అని చెప్పేవారు ఎక్కువయ్యారు. ఇదంతా కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యమే కాదు.. అభిమానుల భక్తోన్మాదం కూడా ఈ మరణాలకు అతి పెద్ద కారణం..! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? ఇండియాలో తొక్కిసలాటలు ఆగాలంటే ఏం జరగాలి?
జనాలకు ఇప్పటికైనా బుద్ధి రావాలి, పుష్ప 2 సినిమా అప్పుడు సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన కానివ్వండి, మహా కుంభమేళాలో, ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఇప్పుడు బెంగళూరు లో జరిగిన ఘటనల నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? ప్రభుత్వాలు జనాల గుంపును కంట్రోల్ చేయడంలో విఫలం అవ్వడం నిజమే అయినా, ఇక్కడ జనాల మనస్తత్వం ఏంటి? పిచ్చి పట్టినట్టు వ్యక్తి కోసం, వినోదాన్ని పంచే ఒక గుంపు కోసం ఒక సెలబ్రిటీ పూజ చేయటం దానికోసం ఎంత దూరమైనా వెళ్ళటం.. రూల్స్ ని పాటించాలి ప్రమాదానికి కారణం అవ్వకుండా ఉండాలి అనే ఆలోచనను మన బుర్రలోనూ ఉండాలి.
ఇంగ్లీషులో ఒక ఒక పదం ఉంది FOMO ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని.. దీన్ని అభిమానం ఇష్టం క్రేజ్ ఇలా రకరకాల పేర్లు పెట్టి జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు.
నిజానికి భారత్‌లో ప్రతీది రాజకీయమే..! ఐపీఎల్ ప్రతీ ఏడాది జరుగుతుంది.. ప్రతీ ఏడాది ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారు. ఇదేదో గొప్పఘనకార్యం కాదు. అయితే కోహ్లీకి ఉన్న PR బలమో ఏమో కానీ ఆర్సీబీ కప్ గెలవడాన్ని సోషల్‌మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ఏదో గొప్ప విషయంగా చూపించాయి. అభిమానుల్లో అనవసరమైన హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇటు కర్ణాటక ప్రభుత్వం నడుచుకున్న తీరు బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అన్నిటికంటే తీవ్ర దుమారాన్ని రేపింది. ఏకండా సీఎం, డిప్యూటీ సీఎంలు పనిమానుకోని, పనిగట్టుకోని ఆర్సీబీ జట్టుకు ఘనస్వాగతాలు పలకడమేంటి? గతంలో ముంబై, చెన్నై ఐదేసీ సార్లు ట్రోఫీలు గెలిచినా ఏ ప్రభుత్వామూ కూడా ఇంతలా రియాక్ట్ కాలేదు కదా. ఇటు ఇండియా అంతా ఆర్సీబీ వేవ్ నడుస్తుండడాన్ని క్యాష్ చేసుకోవాలని అనుకున్నారో ఏమో కానీ.. కర్ణాటక ప్రభుత్వం కూడా అతిగా ఇన్వాల్వ్ అయ్యింది. క్రౌడ్ కంట్రోల్ విషయంలో ఆర్సీబీ మ్యానేజ్మెంట్తో పాటు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అంతా జరిగిపోయిన తర్వాత క్షమాపణలు చెప్పి కామ్ అయిపోయారు. మనుషులు చనిపోయిన తర్వాత సారీ చెబితే సరిపోతుందా? నిన్ను చెంపమీద లాగిపెట్టి కొట్టి, రక్తం కారేలా తలపై బాదేసి.. తర్వాత సారీ అంటే ఊరుకుంటావా? మీ క్షమాపణలు, సంతాపాలు కపట నాటకాలు కావా? మీరు ఎంత ఎక్స్‌గ్రేషియా ఇచ్చినా చనిపోయిన వారు తిరిగి రారు కదా..! ప్రాణం విలువ తెలియని ప్రభుత్వ అధికారులు, మనుషులు, కంపెనీల యాజమాన్యాలు ఇండియాలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం పడే బాధ వర్ణించలేనిదిగా ఉంటుంది. ఆ బాధను డబ్బుతో కోల్చి చేతులు దులుపుకోవడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. చనిపోతే ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాంగా అనే స్థాయిలో అలసత్వం కనిపిస్తోంది. బాధ పడినట్టు నటించడం వేరు.. బాధ పడడం వేరు..! నిజంగా ప్రాణం విలువ తెలిసినవాడు నిర్లక్ష్యానికి అవకాశమే ఇవ్వడు.
సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలి, ఫలానా దేవుడు- ఆధ్యాత్మిక బోధన ను చూస్తూ విని తీరాలి. ఫలానా రాజకీయ నాయకులు, నటులు, ఆటగాళ్ళు వస్తున్నారు కాబట్టి మన పనులను పక్కనబెట్టి వాళ్ళకు జేజేలు జిందాబాద్ లు కొట్టి మురిసిపోవాలి అనే ఈ సంస్కృతి ఎవరికి లాభం చేకూరుతుంది? దీన్ని ఎందుకోసం పెంచి పోషిస్తున్నారు?
ఇక కేవలం తప్పంతా అధికారులు, యాజమాన్యాలదే కాదు..! వీళ్లకంటే ఎక్కువగా తప్పును అంగీకరించాల్సింది అభిమానులే! తమ అభిమాన సినీహీరోని చూడడానికి లేదా క్రికెటర్‌తో మాట్లాడడానికి ప్రాణాలకు తెగించి రిస్క్ చేయడం ఎంత బానిసత్వమో వారికే అర్థంకావాలి. అభిమానం వేరు, బానిసత్వం వేరు, వెకిలితనం-వెర్రితనం వేరు. ఇది కేవలం సినీ అభిమానులకి, క్రికెట్ ఫ్యాన్స్‌కి మాత్రమే వర్తించదు. అటు దేవుళ్ల కోసం గంటల పాటు క్యూలో నిలబడి, భగవంతుని దర్శన టికెట్ల కోసం ఎగబడేవారికీ ఇది వర్తిస్తుంది. నాటి 2011 శబరిమల ఘటన అయినా, ఈ ఏడాది జనవరిలో జరిగిన మహాకుంభమేళ తొక్కిసలాట ఇన్సిడెంట్ అయినా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. భక్తికి అయినా అభిమానానికి అయినా హద్దులు ఉండాల్సిందే. చిన్నచిన్నపిల్లలను మీ పిచ్చికి బలిచేయకండి. చిన్నతనం నుంచే అభిమానాన్ని, భక్తిని నూరిపోసే తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ప్రపంచంలో పోతే తిరిగిరానిది ప్రాణమొక్కటే.. ఆ ప్రాణానికే విలువ ఇవ్వకపోతే మీకు నైతికత, మానవత్వం లేనట్టే!
ALSO READ: టెర్రరిజం స్థాయికి చేరిన జర్నలిజం..! ఏకంగా ఉగ్రవాదులకే సవాల్ విసురుతున్నారుగా!

Rohit – kohli in ODIs : వన్డే క్రికెట్ కే ఈ తరం టార్చ్ బేరర్స్! ఈ ఫార్మాట్ లో రారాజులు కోహ్లీ, రోహిత్!!
Indian Coach Gautam Gambhir: ఇల్లు అలకగానే పండగ కాదు.. కోచ్ అవ్వగానే విజయాలు రావు! సొంతగడ్డపైనే చెత్త పర్ఫామెన్స్!!
CT Final 2025: టీమిండియా గెలుపుకు 5 ప్రధాన కారణాలు.. లాస్ట్‌లో ట్విస్ట్!
MahaKumbh Yogi Adityanath : మలమూత్రాల నీటిలోనే మహా కుంభమేళ.. ప్రభుత్వ సంస్థనే తప్పుబడుతున్న సైంటిస్ట్ యోగి !!
Maha Kumbhmela Bacteria: HOLY SHIT అంటే ఇదేనేమో.. మలవిసర్జన నీటిలో తేలియాడుతున్న భక్త కోటి సనాతనీలు!
Mahakumbhmela Stampede: హిందువులకు ద్రోహం చేస్తున్న సనాతన పార్టీ.. మహాకుంభమేళ మృతుల సంఖ్యపై న్యూస్‌లాండ్రీ షాకింగ్ రిపోర్టు!