పేరుకు అదో నేషనల్ మీడియా హౌస్.. కానీ లోపలంతా ఒక కులం మనుషులే..జీతాలు కూడా వారికే పెరుగుతాయ్.. నీ రెజ్యూమ్ పంపగానే నీ కులమేంటో తెలుసుకుంటారు. నువ్వు సాంఘి కులమైతే.. నువ్వు ఎంత బెవార్స్ గాడివి అయినా పర్వాలేదు.. నీకు రాయడం రాకున్నా ఏం కాదు.. నీకు రిపోర్టింగ్ తెలియకున్నా డొంట్ వర్రీ.. జాబ్ వచ్చేసినట్టే..! జాబ్ జాయిన్ అయిన తర్వాత నువ్వు చేయాల్సింది ఒక్కటే.. అదే భజన..! దేవుళ్లకు అంధ భక్తులు చేస్తారు చూడు అలాంటి భజన.. పొద్దుపొద్దునే, ఇంకా రోజుకు 5సార్లు మైకుల్లో అరిచి గోల పెడతారు చూడు అలాంటి భజన.. ఆదివారం లౌడ్ స్పీకర్లతో, లౌడ్ నాయిస్‌తో ఏడుపులు, పెడబొబ్బులతో హింస పెడుతూ భజన చేస్తారు చూడు.. సరిగ్గా అలాంటి భజన..! ఈ భజన ఎంతలా చేస్తే అంత జీతం పెరుగుతుంది. పని చేయడానికి, కంపెనీని ఉద్దరించడానికి వేరే వర్గాలుంటాయ్.. అవి శ్రామిక వర్గాలు, కూలీనాలి చేసుకునే కులాలు.. వారు ఎంత గొడ్డు చాకిరి చేసినా జీతం పెరిగేది పావాలనే..! నీకు మాత్రం కులం-భజన రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇదంతా ఏ ఒక్క మీడియా సంస్థకో వర్తించిన వ్యవహారం కాదు..! చాలా మీడియా సంస్థలు ఇలాంటి కులం కంపులోనే బతుకుతుంటాయ్.
బూతు బతుకులు:
నీ కులమేంటని ఇంటర్వ్యూలో అడిగే ఓ బ్రోతల్ గాడున్నాడు. వాడు పవన్‌కు కాపు కాసే ఉన్మాది. వాడు సీఈవో అంట. యాంకర్ బైట్కి, యాంకర్ పార్ట్‌కి తేడా తెలియని వాళ్లు ఓ మీడియా సంస్థ పెద్దగా ఎలా మారుతారు? కులం ఒక్కటుంటే చాలా? ఆకుకు, కరివేపాకుకు తేడా తెలియాల్సిన అవసరం లేదా? అందులోనూ సార్ గారు బూతులు తిడతారట.. అది కూడా LK బూతులు. తిట్టేవాడికి లేకుంటే పడేవాడికైనా ఉండాలి కదా..! మా కులం వాడేగా తిట్టిందని.. ఉమ్మిని తుడుచుకుని పోయే మనుషులు గురించి మాట్లాడుకోని అనవసరం. అప్పట్లో డ్రామోజీగారు ఇలానే తన కిందవారిని బూతులు తిట్టేవారట..! ఇంకో Numబర్-1 పెద్ద మనిషి రామన్న చౌదరి లెవల్లో రెచ్చిపోతాడట..! వీళ్లందరికి పనిచేసేవాళ్లు బానిసలు కింద లెక్క కావొచ్చు..! కానీ ఇప్పుడా రోజులు పోతున్నాయ్. ఆత్మాభిమానాన్ని చంపుకోని పని చేసే ఉద్యోగులు తగ్గిపోతున్నారు. మీడియా అయినా బయట అయినా సెల్ఫ్ రెస్పాక్ట్కి ఉన్న ప్రాధాన్యత ఇంకోదానికి లేదు. ఇది తెలుసుకుంటే మీడియా పెద్దలు బాగుపడతారు.. నోటికి వచ్చింది వాగితే తిరిగి అదే స్థాయిలో సమాధానం వచ్చే రోజులొచ్చి చాలా కాలమే అయ్యింది. అందుకే మీ కుల బలుపుని మడిచి ఎక్కడైనా పెట్టుకోవచ్చు..! ఎక్కడా పెట్టుకోనే ప్లేస్ లేకపోతే తలని గోడకేసి కొట్టుకోండి.. దేశానికొచ్చే నష్టమేమీ లేదు!
ఇదో గ్రహాంతార జాతి
తెలుగులో చాలా సంస్థలు ఒకే కులం ఆధీనంలో ఉన్నాయ్. వారి బ్లడ్డు, బ్రీడూ కాస్త డిఫరెంట్‌గా ఉంటుందని వాళ్లు ఫీలవుతారు. ఏదో గ్రహాంతరవాసులు, హిట్లర్ నాజీ మనుషులకున్న పవర్లేవో తమకీ ఉన్నాయని వారి ఫీలింగ్. వీళ్లంతా తమ కులస్తులకే పెద్ద పెద్ద పదవులు వచ్చేలా చేసుకుంటారు. సంస్థలోని ప్రధాన పొజిషన్స్ అన్నీ వారివే.! అక్కడో ఎక్కడో పని చేసేవాడికి కాస్త ఇంపార్టెన్స్ ఇస్తారు. అది కూడా అవసరం కోసం..! అదే అవసరం వాడి కులానికి చెందిన మనిషితో భర్తీ అవుతుందనే తెలిస్తే కథ అక్కడితో సమాప్తమవుతుంది. పైగా వీరికి ఈగోలు కూడా ఎక్కువే. వారికి ఎదురుమాట్లాడకూడదు. ఎంత దిక్కుమాలిన ప్లాన్ చెప్పినా నో అనకూడదు. ఆహో, ఓహో అనాలి.. అప్పుడే వారి ఈగో శాటిస్ఫై అవుతుంది. అలా ఆహో, ఓహో అంటేనే నీకు గౌరవం, మర్యాద, ఇంక్రిమెంట్లు, బోనస్‌లు, ప్రెస్ క్లబ్బులో మందులు-చిందులు! లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా వేధింపులే.. చివరకు చేతికి మిగిలేది బొచ్చే!
ఎవడూ తక్కువ కాదులే:
ఇదంతా చూస్తే మీడియాలో కేవలం అగ్రకులాల పెత్తనముందనే అనుకోవద్దు.. కొన్ని బీసీ కులాల వారు కూడా ఇంతే చేస్తారు. వారి కులం మనిషికి అక్షరం ముక్క రాకున్నా క్యాస్ట్ కోటాలో రిఫరెన్స్‌లు ఇచ్చుకుంటారు. చుట్టూ వారి మనుషులే ఉండాలన్నది వారి ఉన్మాదం. ఇటు కుల్మోనాదానికి ఎస్సీ కులాలు కూడా అర్హత సాధించి ఏళ్లు గడుస్తున్నాయ్.. వీళ్లు కూడా మినహాయింపేమీ కాదు..! ఇలా మీడియా మొత్తం కులకంపులో మునిగితేలుతోంది. పైకి నీతి కబుర్లు చెప్పే జర్నలిస్టుల్లో కుల పిచ్చిలేనివారిని వెతకడం చాలా కష్టమే. నీ ఇంటి పేరు తెలిస్తే చాలు.. పెద్ద CBI లెవల్లో నీ క్యాస్ట్ ఏంటో తెలుసుకుంటారు! తెలుసుకోని ఏం చేస్తారో తెలియదు.. అదో శాడిజం.. అదో సైకోతనం.. అదో కుల్మోనాదం.. అదో కమ్మొన్మాదం.. అదో కాపోన్మాదం.. అదో బేపోన్మాదం.. అదో రెడ్డోన్మాదం! ఇలా పిచ్చి పది రకాలున్నట్టు.. ఉన్మాదం వెయ్యి రకాలు..ఎన్ని కులాలుంటే అన్ని రకాలు..! ఇది తెలుగు మీడియా దౌర్భాగ్యం!
ALSO READ: టెర్రరిజం స్థాయికి చేరిన జర్నలిజం..! ఏకంగా ఉగ్రవాదులకే సవాల్ విసురుతున్నారుగా!
ALSO READ: టార్గెట్ల ముసుగులో జర్నలిజం ఏనాడో చ*చ్చిపోయింది.. కాదు కాదు యాజమాన్యాలు చం*పేశాయి!

Asia Climate Change: 2 కారణాలు.. గాల్లో లక్షల ప్రాణాలు..సైంటిస్టుల షాకింగ్ స్టడీ!
Railway Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. లక్షకు పైగా రైల్వే ఉద్యోగల భర్తీపై కీలక అప్డేట్!
Indonesia: మృత్యు ఒడిలోకి 313మంది..! ఆ దేశంలోనే వరదలు, భూకంపాలు ఎందుకు?
New Year Plans: తెలంగాణ టూరిజం గోవా టూర్ ప్యాకేజ్.. న్యూఇయర్‌కి భలే ఆఫర్ బాస్.. పూర్తి వివరాలివే!
Aadhar Update: కాలు బయటకు పెట్టాల్సిన అవసరమే లేదు.. ఇంటి నుంచే మీ మొబైల్ నంబర్‌తో పాటు ఆధార్ అడ్రెస్‌ను ఇలా ఇలా అప్డేట్ చేసుకోండి!
Mock Assembly: లోకేశ్ గారూ.. ఓ సారి నిజాలు మాట్లాడుకుందాం రండి! మీ తాత ఏం చేశారో ఒక్కసారి తెలుసుకోండి!