సూర్యుడి వెలుతురు కూడా తాకలేని నిశ్శబ్దం.. నక్షత్రాల మధ్య తేలిపోతున్న రెండు జీవాలు..! ఒకరు సునీతా విలియమ్స్.. ఇంకొకరు బుచ్ విల్మోర్..! గగనతలంలోని శూన్యంలో ఆత్మస్థైర్యం కోల్పోకుండా సగర్వంగా నిలిచిన రెండు మానవ శరీరాలు ఇవి! భూమిని వదిలి 9 నెలలు గడిచిపోయాయి.. ఇన్ని నెలల భూమికి దూరంగా ఉంటే మనిషి శరీరం తన అసలు స్వరూపాన్ని మార్చుకోకుండా ఉంటుందా? ఒక్కసారి మీరే ఊహించుకోండి.. ఒక గది లోపల మీరు నడవలేరు, కూర్చోలేరు, పడుకోలేరు..! కేవలం తేలిపోతూ ఉంటారు..! సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అదే పరిస్థితిలో ఉన్నారు. గురుత్వాకర్షణ లేకపోవడంతో వాళ్ల ఎముకలు బలహీనమవుతున్నాయి.. కండరాలు క్షీణించిపోతున్నాయి.. రక్తం పైకి లేచిపోతూ మెదడును మబ్బుగా మార్చేస్తోంది. ప్రతి క్షణం, ప్రతి రోజు, వాళ్లు నెమ్మదిగా భూమిపైన ఉన్న మనుషులకంటే భిన్నంగా మారిపోతున్నారు. అయినా వెనక్కి తగ్గడంలేదు..అదరడం లేదు.. బెదరడం లేదు.. వారిని స్వదేశానికి తిరిగి తీసుకురావాలనే ప్రయత్నాలు అనేకసార్లు వాయిదా పడ్డాయి.. పడుతూనే ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో వారు భూమిపైకి వస్తారని చెబుతున్నారు కానీ వచ్చే వరకు మిస్టరీనే.. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో కూడా మిస్టరీనే! ఎందుకంటే తొమ్మిది నెలల పాటు భూమి పరిస్థితులకు దూరంగా బతికిన సునీతా, బుచ్ విల్మోర్ భూమండలంపై అడుగుపెట్టిన తర్వాత వారి ఆరోగ్యం ఎలా ఉండనుందనే ఆందోళన అందరిలో వ్యక్తమవుతోంది.
అంతటి రేడియేషన్‌ను తట్టుకోవడం సాధ్యమేనా?
నిజానికి భూమిపై కొన్ని విషయాల్లో మనం ఎంతో సురక్షితంగా ఉన్నాం. మనిషిని ఒక అద్భుతమైన అయస్కాంత క్షేత్రం.. అంటే Magnetic Field రక్షిస్తోంది. ఇది సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్‌ను అడ్డుకుంటుంది. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు Magnetic Field కవచం ఉండదు. International space station-ISS భూమి కక్ష్యలో తిరుగుతున్నా.. అది Magneto sphere బయటే ఉంది. అంటే అక్కడ ఉన్న ప్రతి మనిషి ప్రతిరోజూ పెద్ద మొత్తంలో రేడియేషన్‌ను గ్రహించాల్సి వస్తుంది. ప్రతిరోజూ 150 నుంచి 6000 X-rayలు తీయించుకున్నంత రేడియేషన్ పొందుతున్నట్లు ఉంటుంది. ఈ రేడియేషన్ మన శరీరాన్ని నాశనం చేయవచ్చు. అయితే దాని ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు కానీ.. భవిష్యత్‌లో ఎన్నో ప్రమాదాలను తీసుకురావచ్చు. ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపితే.. మన DNA మారిపోవచ్చు.. అంటే జన్యుపరమైన మార్పులు జరగొచ్చు. ఇది భవిష్యత్తులో క్యాన్సర్, నరాల సమస్యలు, మెదడు పనితీరులో మార్పులు, అలాగే కంటిచూపు సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. నిజానికి ISSలో వ్యోమగాములను రక్షించేందుకు కొన్ని రక్షణ కవచాలు ఉంటాయి. కానీ అవి కూడా పూర్తిగా రేడియేషన్‌ను అడ్డుకోలేవు.
సవాళ్లు తప్పవు:
అటు సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్ కంటే ముందు ఈ తరహా అంతరిక్ష కథలు కూడా ఉన్నాయి. 1994లో సోవియట్ వ్యోమగామి వాలెరీ పొల్యాకోవ్ 437 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. మానవుడు నిజంగా అంతరిక్షంలో జీవితాన్ని కొనసాగించగలడా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఇలా చేశాడు. అంతరిక్షంలో బతికిన కాలమంతా తన శరీరాన్ని ఒక ప్రయోగశాలగా మార్చాడు. 437 రోజుల తర్వాత భూమికి వచ్చిన వాలెరీ ఓ వృద్ధుడిలా కనిపించాడు. అమెరికన్ వ్యోమగామి స్కాట్ కెల్లీ, 2015లో 340 రోజులు ISSలో గడిపారు. ఆయన తిరిగి భూమికి వచ్చినప్పుడు.. కెల్లీ DNA మారిపోయింది! ఆయనకు కంటి చూపు సమస్యలు వచ్చాయి. అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాములు తిరిగి భూమికి వచ్చిన తర్వాత మరో కొత్త జీవితం మొదలు పెడతారు. అది అనేక సవాళ్లతో నిండి ఉంటుంది.
ఇది కూడా చదవండి: జ్ఞానానికి, వ్యాపారానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎవరు గెలుస్తారు?

Moon Mining: చందమామకు తూట్లు పొడుస్తున్నారు.. ప్రపంచ దేశాల ఉన్మాద తీరు ఇది!
Breast Milk Uranium: తల్లి పాలల్లోనూ విషం.. సైంటిస్టుల స్టడీలో షాకింగ్ నిజాలు!
Moon Endangered: జాబిల్లికి కష్టాలు..! చంద్రుడు కనిపించకుండా పోతాడా?
Human Brain: కొంతమంది వ్యక్తులకు భయమే తెలియదా? మన మెదడు చెబుతున్న షాకింగ్ ఫ్యాక్ట్ ఇదే!
Volcano Eruption: భయం పుట్టిస్తోన్న అగ్నిపర్వతం.. సముద్ర గర్భంలో పేలనుందా?
Tsunami: సునామీలను ముందుగానే కనిపెట్టే జంతువులు ఉన్నాయా? ఇది తెలిస్తే మీ ప్రాణాలు నిలబడతాయి!