రాత్రి చీకటి కమ్ముకున్నప్పటికీ.. ఓవల్ హౌస్ వెలుగులు దావానలంలా ప్రకాశిస్తున్నాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్లో పొలిటికల్ తుపాను ముంచుకొస్తోందని ప్రపంచానికి అప్పటివరకు తెలియదు. ఓవైపు రష్యా-యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా(Russia) సైనిక దళాలు యుక్రెయిన్(Ukraine) గుండెల్లో కత్తిని దించుతూనే ఉన్నాయి. ఆ నడిరాత్రి నిద్రలేని దేశానికి నిద్రలేని నాయుకుడైన జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి వైట్‌హౌస్‌కి వచ్చారు. డొనాల్డ్ ట్రంప్ తన చైర్లో వెనక్కి వాలిపోయి, ఎదురుగా కూర్చున్న జెలెన్స్కీని చూస్తూ మాట్లాడడం మొదలు పెట్టాడు. పక్కనే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా ఉన్నాడు. ముందుగా ట్రంప్ మాట్లాడగా.. తర్వాత జెలెన్స్కీ మొదలుపెట్టారు. యుద్ధంలో తమకు అమెరికా మద్దతు కీలకమని జెలెన్స్కీ చెప్పగానే ట్రంప్ ముఖం మాడిపోయింది. అమెరికా ఇప్పటికే బిలియన్ డాలర్లు యుక్రెయిన్‌కు ఇచ్చిందని, ఇంకా ఎంత కావాలని ట్రంప్ ప్రశ్నించారు. దీంతో వివాదం మరింత వేడెక్కింది. జెలెన్స్కీకి కూడా కోపం వచ్చింది. జెలెన్స్కీ ఏదో చెప్పేలోపే ట్రంప్ అయన్ను ఆపేశారు. ప్రపంచ యుద్ధానికి కారణం కావొద్దని జెలెన్స్కీకి ట్రంప్ హితబోధ చేసే ప్రయత్నం చేశారు. దీంతో సమావేశం మరింత ఉద్రిక్తంగా మారింది. వాదోపవాదాలు, మాటల తూటాలు విసురుకోవడం మొదలైంది. ట్రంప్‌లో అసహనం పీక్ స్టేజీకి వెళ్లింది. యుక్రెయిన్ తన స్థితిని అర్థం చేసుకోవాలని, అమెరికా సహాయం లేకుండా మీ దేశం ఏమీ చేయలేదని వాదించాడు. అటు జెలెన్స్కీ తమ దేశం లొంగదని కుండబద్దలు కొట్టాడు. అంతే… ఒక్క క్షణం గది నిశ్శబ్దంగా మారింది. ట్రంప్ ఆ మౌనాన్ని ఛేదిస్తూ జెలెన్స్కీ వైఖరిని అవమానంగా భావిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా సహాయం పొందిన వ్యక్తిగా, జెలెన్స్కీ కృతజ్ఞత చూపించలేదని.. తన దేశాన్ని శాంతి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయడంలేదని మండిపడ్డారు. అంతటితో ఆగి ఉంటే సరిపోయేది కానీ.. ట్రంప్ జెలెన్స్కీని బయటకు వెళ్లమని చెప్పడం సంచలనంగా మారింది. జెలెన్స్కీ ఆవేశంగా వైట్‌హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. జెలెన్స్కీ మాట తీరు బాగోలేదని అమెరికాలో ట్రంప్‌ను సపోర్ట్ చేసే మీడియా రాసుకొచ్చింది. ముందుగా క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన జెలెన్స్కీ తర్వాత ఫాక్స్ న్యూస్ వేదికగా అమెరికాకు సారీ చెప్పారు. కానీ ఆ క్షమాపణ వెనుక ఉద్దేశ్యం జెలెన్స్కీ తప్పు చేసినట్టు, తప్పు మాట్లాడినట్టు కాదని యుక్రెయిన్ చెబుతోంది. కొత్తగా ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదనే ఆలోచనతోనే జెలెన్స్కీ క్షమాపణ కోరినట్టు సమాచారం. నిజానికి ట్రంప్, జెలెన్స్కీ మధ్య వైరం ఈనాటిది కాదు.. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రోజులు గతం నుంచే ఉన్నాయి.
HOLY SH*T. This is a MUST WATCH. Zelensky goes Head to Head with Trump and Vance on mainstream media. Trump looses it and tells Zelensky to SHUT UP🤫
— Duke Mtambo (@dukemtambo) February 28, 2025
నాటి ఫోన్ కాల్‌తో మొదలైన వైరం
ట్రంప్, జెలెన్స్కీ మధ్య కనిపించిన ఈ ద్వేషం 2019లోనే మొదలైంది. నాడు ట్రంప్ జెలెన్స్కీతో ఓ ఫోన్ కాల్ మాట్లాడాడు. ఆ కాల్లో జెలెన్స్కీని ట్రంప్ బెదిరించారు. అమెరికా నుంచి యుక్రెయిన్‌కు అందే సాయాన్ని నిలిపివేస్తానని బ్లాక్మెయిల్ చేశారు. ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. జో బైడెన్ కొడుకు హంటర్‌పై దర్యాప్తు ప్రారంభించాలని జెలెన్స్కీపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ట్రంప్ ఇలా చేశారు. హంటర్ బైడెన్ యుక్రెయిన్‌లోని బురిస్మా అనే ఓ ప్రైవేట్ గ్యాస్ కంపెనీ డైరెక్టర్‌గా 2014లో పనిచేశారు. అప్పటికి అతని తండ్రి జో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బురిస్మాపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కానీ దర్యాప్తు మాత్రం జరగలేదు. 2019లో జెలెన్స్కీ యుక్రెయిన్ అధ్యక్షుడిగా గెలిచారు. దీంతో జెలెన్స్కీని అడ్డుపెట్టుకోని హంటర్ బైడెన్ పని పట్టాలని ట్రంప్ భావించారు. అవినీతి కేసులో హంటర్ బైడన్ దోషిగా తేలితే 2020 ఎన్నికల్లో ఆ ప్రభావం జో బైడెన్‌పై పడుతుందన్నది ట్రంప్ ఆలోచన. అటు జెలెన్స్కీ మాత్రం ఆ ఫోన్ కాల్లో దర్యాప్తు గురించి ట్రంప్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదు. కానీ తర్వాతే అసలు కథ నడిచింది.
కక్ష పెంచుకున్న ట్రంప్
ట్రంప్-జెలెన్స్కీ ఫోన్ కాల్ విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. అమెరికా నిఘా విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి ఈ ఫోన్ కాల్ గురించి యూఎస్ కాంగ్రెస్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తన అధికారిక రిపోర్టులో పొందుపరిచింది. ఆ రిపోర్టు బయటకు రాగానే రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 2019 డిసెంబర్లో ట్రంప్‌పై అధికారం దుర్వినియోగం కింద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే 2020లో సెనేట్ మాత్రం ట్రంప్‌ను నిర్దోషిగా ప్రకటించింది. కానీ ఆ తర్వాత ట్రంప్ తన అధికారాన్ని కోల్పోయారు. నాటి ఎన్నికల్లో ఓడిపోయారు. నాలుగేళ్లు గడిచిపోయాయి. మరోసారి ట్రంప్ గెలిచారు. అటు యుక్రెయిన్ పరిస్థితి నాటి పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంది. మూడేళ్ల నుంచి రష్యా దాడులతో యుక్రెయిన్ నగరాలు నాశనమయ్యాయి. అటు అమెరికా మద్దతుతో యుక్రెయిన్ పుతిన్ దళాలపై ఇన్నాళ్లు పోరాడుతూ వచ్చింది. కానీ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే జెలెన్స్కీపై ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టారు. ఓవల్ హౌస్‌కు వచ్చిన మొదటి రోజే యుక్రెయిన్‌కు సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జెలెన్స్కీని పలు సందర్బాల్లో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఫిబ్రవరి 28 భేటీలో జెలెన్స్కీని ఏకంగా వైట్‌హౌస్‌నుంచి బయటకు వెళ్లాలని అరిచారు.
ఈ ఘటన తర్వాత అమెరికా-యుక్రెయిన్ సంబంధాలు మరింత దారుణంగా మారనున్నాయి. ట్రంప్ పాలనలో యుక్రెయిన్‌కు అమెరికా మద్దతు పూర్తిగా నిలిచిపోనుంది. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ పరిస్థితిని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అమెరికా అండ లేక యుక్రెయిన్ ఒంటరైపోతే రష్యా తన దాడులను ఉధృతం చేయవచ్చు. అంటే మరింత నాశనం, మరింత వినాశనం, మరింత విధ్వంసం తప్పకపోవచ్చు! ఇది ట్రంప్ ఆడిస్తున్న ప్రతీకార నాటకం!
ALSO READ: యుక్రెయిన్‌ను దొంగదెబ్బ తీసిన అమెరికా.. ఏకంగా గొంతు కోసేసిందిగా!

Balochistan: బలూచిస్థాన్ రక్తపాతం.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. అసల కథేంటి?
Jeffrey Epstein Files: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్.. కొత్త లీక్‌లో బయటపడిన సంచలన విషయాలు..!
Donald Trump Tariffs: ట్రంప్ తలతిక్క పనులు.. అమెరికాకే ఎసరు..ఈ లెక్కలే సాక్ష్యం!
Social Media Vetting: స్వేచ్ఛకు సంకెళ్లు.. సోషల్‌మీడియా పోస్టులను చెక్ చేస్తున్న ట్రంప్.. నెక్ట్స్ ఏం జరగనుంది?
Asia Climate Change: 2 కారణాలు.. గాల్లో లక్షల ప్రాణాలు..సైంటిస్టుల షాకింగ్ స్టడీ!
Railway Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. లక్షకు పైగా రైల్వే ఉద్యోగల భర్తీపై కీలక అప్డేట్!