గుండె కొట్టుకుంటోంది… ఊపిరి పీల్చుకుంటున్నాం.. కానీ మనం బతికే ఉన్నామా..? రాత్రి పడుకుంటాం.. ఉదయం లేస్తాం.. కానీ ఆ నిద్ర నిజంగా విశ్రాంతిని ఇస్తుందా? కంటి ముందు డబ్బులు, ప్రమోషన్లు, కంపెనీ టార్గెట్లు.. కానీ మనకోసం మనం జీవిస్తున్నామా? రాత్రి పగలు తేడా లేకుండా స్క్రీన్ ముందు కూర్చుని, మెయిల్స్ చూస్తూ.. ప్రాజెక్ట్‌లు కంప్లీట్ చేస్తూ.. వర్క్ టైమ్(Work Time) ముగిసిన తరువాత కూడా పని చేస్తూ.. ఓ రోబోలా ఇంటికి వచ్చి ఏది దొరికితే అది తినేసి పడుకోవడం.. ఇదేం జీవితమని అనిపించడంలేదా? అసలు అలా ఆలోచించేంత సమయం కూడా ఉండడంలేదా? 2024 టైమ్ యూజ్ సర్వే సంచలన నిజాలు బయటపెట్టింది. రోజు మొత్తంలో భారతీయులు ఎక్కువగా పనిలో నిమగ్నమై ఉంటున్నారని.. తమ ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోవడంలేదని సర్వే చెప్పింది. స్వీయ సంరక్షణకు తక్కువ సమయం కేటాయిస్తున్న భారతీయుల సంఖ్య అంతకంతూ పెరుగుతోందని టైమ్ యూజ్ సర్వే లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో మహిళా ఉద్యోగుల బాధల గురించి కూడా వివరించాయి.
ఈ అదనపు భారం ఇంకెన్నాళ్లు?
రోజుకు 440 నిమిషాలు.. అంటే ఏడున్నర గంటలు భారతీయులు ఉద్యోగంలో తీరిక లేకుండా గడుపుతున్నారు. పనిలో పడి శరీరాన్ని పట్టించుకోవడం మరిచిపోతున్నారు. సామాజిక జీవితం, కుటుంబ సమయం, మన కోసం మనం గడిపే సమయం అన్నీ ఆఫీస్ వర్క్‌లోనే తుడిచిపెట్టుకుపోతున్నాయి. అటు మహిళలు పడే వేదన మరింత ఎక్కువగా ఉంది. ఉద్యోగం చేసే మహిళలు ఇంట్లోనూ పని చేస్తున్నారు. 15 నుంచి 59 ఏళ్ల మహిళల్లో ఉపాధిలో ఉన్నవారు కేవలం 25శాతం మాత్రమేనట. అయితే వీరంతా ఇంటి పనిని కూడా చూసుకుంటున్నారు. మహిళలు రోజుకు 289 నిమిషాలు.. అంటే సుమారు 4.8 గంటలు ఇంటి పనుల్లో గడుపుతున్నారు. అటు పురుషులు కేవలం 88 నిమిషాలే ఇంటి పనులకు కేటాయిస్తున్నారు. కుటుంబ సంరక్షణకు మహిళలు 137 నిమిషాలు సమయం కేటాయిస్తుండగా.. పురుషులు 75 నిమిషాలే కుటుంబం కోసం గడుపుతున్నారు. నిజానికి ఇంటిపనికి గుర్తింపు లేదు. చెల్లింపు అసలే లేదు. అలసట మాత్రమే ఉంటుంది. ఆఫీస్‌లో పని చేసే పురుషులు ఇంటికి వచ్చిన తర్వాత ఓపిక లేనట్టుగా అయిపోతారు. అదే సమయంలో మహిళా ఉద్యోగాలకు మాత్రం ఇంట్లో కూడా తప్పక పని చేయాల్సిన పరిస్తితులు ఉంటున్నాయి. ఇది చాలా అన్యాయమైన విషయం. ఒక్కమాటలో చెప్పాలంటే మహిళలు రెండు జీవితాలపై ప్రయాణిస్తున్నారు. ఒకటి ఆఫీసులో.. రెండోది ఇంట్లో. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి రాత్రి 10 గంటల వరకూ వంట గదిలోనే ఉంటూ.. మధ్యలో పిల్లలకు చదువు చెప్పి, మర్నాడు మళ్లీ ఉద్యోగానికి వెళ్తున్నారు. ఇలా పురుషులతో పోల్చితే మహిళల జీవితం మరింత నరకప్రాయంగా మారిందనే చెప్పాలి. నిజానికి పని విషయంలో పురుషులు, స్త్రీలు దాదాపు సమానమైన ఒత్తిడిని భరిస్తున్నారు. అయితే మహిళలకు అదనంగా ఇంటి పనులు ఉంటున్నాయి. ఇలా పని తప్ప సమాజంలో చాలా మందికి విశ్రాంతి తీసుకునే సమయమే దొరకడంలేదు.
ఇదేం జీవితం?
ఇప్పటికే పని ఒత్తిడితో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 7,50,000 మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఇండియాలో ప్రతి రోజు అనేక మంది అధిక పని ఒత్తిడి కారణంగా గుండెపోటుతో చనిపోతున్నారు. ఒక ఉద్యోగి రోజుకు 16 గంటలు పని చేసి ఆఫీస్‌లోనే కుప్పకూలిపోయిన ఘటనలు సర్వసాధారణమైపోయాయి. ఇదే జీవితమా? కంపెనీలకు మన బతుకు విలువ తెలియదు.. మానవీయత ఉండదు. పనిలోనే కాలమంతా గడిపి.. ఆరోగ్యం పోగొట్టుకొని, చివరికి ఆ డబ్బుతో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. అందమైన జీవితాన్ని పనిలో ముంచేస్తున్నాం. అమూల్యమైన ఆరోగాన్ని కంపెనీల కోసం వదిలేస్తున్నాం. పని జీవితానికి దారి ఇవ్వాలే కానీ మనిషి జీవితాన్ని తినేయకూడదు. ఇది అందరికి కనిపిస్తున్న వాస్తవం.. కానీ ఎవరికి వినపడని బాధ.. ఎందుకంటే ఇది ఒక నిశ్శబ్ద తుపాను.. అందరూ ఒక్కటి మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పని మన జీవితంలో ఒక భాగం మాత్రమే.. పనే జీవితం కాదు..! మన జీవితం అర్థం లేని ప్రయాణంగా మారకూడదు!
ALSO READ: కార్పొరేట్ల రక్తదాహం.. ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్న కంపెనీలు

Asia Climate Change: 2 కారణాలు.. గాల్లో లక్షల ప్రాణాలు..సైంటిస్టుల షాకింగ్ స్టడీ!
Railway Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. లక్షకు పైగా రైల్వే ఉద్యోగల భర్తీపై కీలక అప్డేట్!
New Labour Codes: ఉద్యోగం మానేసిన రెండు రోజుల్లోనే కంపెనీలు చివరి జీతం ఇవ్వాల్సిందేనా? కొత్త కార్మిక చట్టం ఏం చెబుతోంది?
Office Work Culture: ఆఫీస్ ఫ్రెండ్షిప్ మీ జాబ్ శాటిస్ఫాక్షన్ను ఎలా పెంచుతుంది? నివేదికలు ఏం చెబుతున్నాయ్?
Indonesia: మృత్యు ఒడిలోకి 313మంది..! ఆ దేశంలోనే వరదలు, భూకంపాలు ఎందుకు?
New Year Plans: తెలంగాణ టూరిజం గోవా టూర్ ప్యాకేజ్.. న్యూఇయర్‌కి భలే ఆఫర్ బాస్.. పూర్తి వివరాలివే!