కోట్లాది మంది భక్తులు.. సెలబ్రిటీలు.. సాధువులు.. రాజకీయం నేతలు… అందరూ ఒకే చోటకి వస్తున్నారు. మహాకుంభమేళ(Maha Kumbhmela)లో పుణ్యస్నానాలు చేస్తున్నారు. గంగమ్మ పుణ్యం తాకడానికి, పాపాలు పోగొట్టుకోవడానికి వేల ఏళ్లుగా సాగుతున్న సంప్రదాయ వేడుక ఇది. కానీ భక్తులు స్నానం చేస్తున్న నీటిలో ముప్పు పొంచి ఉందని సాక్ష్యాత్తు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు-CPCB నివేదిక చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. నీరు శుద్ధి చేయకపోవడం వల్ల ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు.. అంటే ప్యాథోజెన్స్ నీటిలో పెరిగిపోయాయి. దీని కారణంగా టైఫాయిడ్, కొలెరా, డయేరియా, హెపటైటిస్, స్కిన్ ఇన్ఫెక్షన్లు లాంటి ఎన్నో రోగాలకు భక్తులు బలయ్యే ప్రమాదం ఉంది.
నేరుగా సెప్టిక్ ట్యాంక్‌లో మునిగినట్టేనా?
CPCB నివేదిక ప్రకారం శాస్త్రి బ్రిడ్జ్ దగ్గర గంగా జలంలో 11,000 MPN/100ml ఫీకల్ కాలిఫారం ఉంది. ఇది చాలా ప్రమాదకరం. MPN అంటే Most Probable Number.. అంటే 100 మిల్లీలీటర్ల నీటిలో ఉండే బ్యాక్టీరియా కణాల అంచనా సంఖ్య. ఇది 2500 కంటే మించకూడదు. కాని శాస్త్రి బ్రిడ్జ్ దగ్గర ఆ సంఖ్య నాలుగు రెట్టు కంటే ఎక్కువగా ఉంది. అంటే నేరుగా మురుగునీటి డ్రెయిన్ నుంచి వచ్చిన నీళ్లలో మునిగినట్టే లెక్కా. అటు యమునా-గంగా సంగమ నీటి దగ్గర కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉందని CPCB నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక ఇంతకి ఫీకల్ కాలిఫారం అని ఇందాక చెప్పుకున్నాం కదా..! ఫీకల్ కాలిఫారం అంటే ఏంటో తెలుసా?
పుణ్యం తెలియదు.. రోగం మాత్రం గ్యారెంటీ
ఫీకల్ కాలిఫారం అంటే మనిషి లేదా జంతువుల మల విసర్జన ద్వారా నీటిలో చేరే బ్యాక్టీరియా. సాధారణంగా సెప్టిక్ ట్యాంకులు, మురుగునీటి ప్రవాహాల్లో ఫీకల్ కాలిఫారం ఉంటుంది. ఇప్పుడు అదే బ్యాక్టీరియా మహాకుంభమేళలో స్నానం ఆచరించే అనేక ఘాట్స్‌లో ఉంది. ఇది చాలా ప్రమాదకరం. ప్రతి 100 మందిలో 90మందికి వ్యాధులను తెచ్చే బ్యాక్టీరియా ఇది. ఈ ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు కేవలం నీరు తాగినప్పుడు మాత్రమే కాదు..స్నానం చేసినా కూడా శరీరంలోకి చేరతాయి. ముక్కు, కళ్లు, చెవులు ద్వారా బ్యాక్టీరియా లోపలకి ప్రవేశిస్తుంది. ఆ బ్యాక్టీరియా ఉన్న నీటిలో స్నానం చేసిన తర్వాత పొరపాటున చేతులను నోటికి అంటిస్తే అది పొట్టలోకి పోతుంది. ఒక వేళ మీ శరీరానికి ఏదైనా గాయాలున్నా బ్యాక్టీరియా తక్షణమే లోపలకి వెళ్లిపోతుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి చేరితే జ్వరం, విపరీతమైన అలసట, ఆహారం తినలేకపోవడం, నీరసం, చివరకు టైఫాయిడ్‌కు దారి తీయ్యవచ్చు. నీటిలో ఫీకల్ కాలిఫారం ఎక్కువగా ఉంటే చర్మానికి గాయాలు, దద్దుర్లతో పాటు కళ్లలో మంట పుడుతుంది.
వేల కోట్లు గంగార్పణం
ఇక ఇంత ఫీకల్ కాలిఫారంలో భక్తులు స్నానం చేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు. Sewage Treatment Plants పనిచేయడం లేదా అని నిలదీస్తున్నాయి. ఎన్నో నిధులు ఖర్చు చేసినా గంగా నది శుద్ధి ఎందుకు జరగలేదని ప్రతిపక్ష నేతలు అడుగుతున్నారు. 2014లో ప్రారంభమైన నమామి గంగా ప్రోగ్రాం గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా గంగానది, దాని ఉపనదుల పునరుద్ధరణ కోసం 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది కేంద్రం. ఈ ప్రాజెక్ట్ కింద మురుగు నీటి శుద్ధి, ఘాట్ల అభివృద్ధి, నదీ ఉపరితల శుభ్రత లాంటి కార్యక్రమాలు చేపట్టారు. డిసెంబర్ 31, 2023 వరకు కేంద్ర ప్రభుత్వం 16,461 కోట్ల రూపాయలను ఈ మిషన్ కోసం ఖర్చు చేసింది. అంటే 80శాతం వరకు నిధులను ఉపయోగించినట్టే లెక్కా. ఇంత ఖర్చు చేసినా గంగానది శుభ్రతలో పెద్ద మార్పు కనిపించలేదన్నది పర్యావరణ నిపుణుల మాట. అటు అనేక ప్రాజెక్ట్‌లు సమయానికి పూర్తి కాకపోవడం వల్ల, నదిలో మురుగు నీటి ప్రవాహం ఇంకా కొనసాగుతోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. 2025లో మహాకుంభమేళ జరుగుతుందని కేంద్రానికి తెలిసినా భక్తులు స్నానం ఆచరించే నదిలోనూ ఈ స్థాయిలో మలవిసర్జన బ్యాక్టీరియా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో పడగవిప్పిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్.. పిల్లలూ.. బీ అలెర్ట్!

Asia Climate Change: 2 కారణాలు.. గాల్లో లక్షల ప్రాణాలు..సైంటిస్టుల షాకింగ్ స్టడీ!
Railway Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. లక్షకు పైగా రైల్వే ఉద్యోగల భర్తీపై కీలక అప్డేట్!
Indonesia: మృత్యు ఒడిలోకి 313మంది..! ఆ దేశంలోనే వరదలు, భూకంపాలు ఎందుకు?
New Year Plans: తెలంగాణ టూరిజం గోవా టూర్ ప్యాకేజ్.. న్యూఇయర్‌కి భలే ఆఫర్ బాస్.. పూర్తి వివరాలివే!
Aadhar Update: కాలు బయటకు పెట్టాల్సిన అవసరమే లేదు.. ఇంటి నుంచే మీ మొబైల్ నంబర్‌తో పాటు ఆధార్ అడ్రెస్‌ను ఇలా ఇలా అప్డేట్ చేసుకోండి!
Mock Assembly: లోకేశ్ గారూ.. ఓ సారి నిజాలు మాట్లాడుకుందాం రండి! మీ తాత ఏం చేశారో ఒక్కసారి తెలుసుకోండి!