‘మా దేశం అమ్మకానికి లేదు.. ఇప్పుడూ లేదు.. ఎప్పుడూ ఉండదు.. మా దేశాన్ని రక్షించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం.. అయినా.. మీరు అడుగు ముందుకేస్తే ఖబర్దార్..’ ఇది కెనడా న్యూ డెమోక్రటిక్ పార్టీ-NDP నాయకుడు జగ్మీత్ సింగ్ చేసిన కామెంట్స్! ట్రంప్(Donald Trump) టార్గెట్‌గా జగ్మీత్ సింగ్(Jagmeet Singh) చేసిన వ్యాఖ్యలు అమెరికా-కెనడా మధ్య మరోసారి ఉద్రిక్తలకు కారణమయ్యాయి. ట్రంప్ ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోబోమని ఘాటుగా రియాక్ట్ అయ్యారు జగ్మీత్. అటు జగ్మీత్ రియాక్షన్‌కు కెనడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ భేదాలు పక్కనపెట్టి కెనడీయన్లంతా ఒక్క తాటిపైకి వచ్చిన సందర్భం ఇది. ఇంతకీ ట్రంప్ ఏం అన్నారు? ట్రంప్ విషయంలో కెనడా ఎందుకు తీవ్ర అసంతృప్తిగా ఉంది? కెనడీయన్లంతా ట్రంప్‌పై ఎందుకు భగ్గుమంటున్నారు?
I have a message for Donald Trump.
We’re good neighbours.
But, if you pick a fight with Canada – there will be a price to pay. pic.twitter.com/o60c4qIyza
— Jagmeet Singh (@theJagmeetSingh) January 12, 2025
నాటి యుద్ధం మళ్లీ రిపీట్ అవుతుందా?
కెనడా(Canada)ను 51వ రాష్ట్రంగా కలిపే ఆలోచనను ట్రంప్ ఇటివలే ప్రస్తావించారు. చాలా మంది కెనడీయన్లు తమ దేశం అమెరికా 51వ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అమెరికా-కెనడా మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఓ ఆర్టిఫీషియల్ లైన్ మాత్రమేనని ట్రంప్ చెబుతున్నారు. కెనడాలోని సహజ వనరులు, ఆర్థిక వ్యవస్థ అమెరికాకు ఉపయోగపడతాయని భావిస్తున్న ట్రంప్ మరోవైపు పనామా కెనాల్, గ్రీన్‌ల్యాండ్‌పైనా కన్నేశారు. ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని గట్టిగా పాటించే ట్రంప్ అధికారంలో ఉండే నాలుగేళ్లలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. కెనడాపై నేరుగా యుద్ధానికి దిగుతారానన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి అమెరికా-కెనడా మధ్య ఓ సారి యుద్ధం జరిగింది. 1812 యుద్ధంలో అమెరికా కెనడాపై దాడి చేసింది. ఈ యుద్ధం 1812 నుంచి 1815 వరకు కొనసాగింది. ఈ వార్‌లో దాదాపు 15,000 మంది మరణించారు. ఈ యుద్ధంలో స్పష్టమైన విజయం ఎవరికీ లభించలేదు. అయితే, కెనడా భూభాగం బ్రిటన్ నియంత్రణలోనే కొనసాగింది. అది 1981 వరకు అలానే ఉంది. అయితే అప్పటినుంచి కెనడా-అమెరికా మధ్య మంచి ఫ్రెండ్‌షిపే ఉంది. కానీ 2016-2020 మధ్య ట్రంప్ పాలనలో ఈ రెండు దేశాల మధ్య వివాదాలు చెలరేగాయి. 2018లో, ట్రంప్ ప్రభుత్వం కెనడా నుంచి దిగుమతిచేసే స్టీల్, అల్యూమినియంపై 25శాతం టారిఫ్‌లు విధించింది. ఇది నాడు కెనడా ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. ట్రంప్ టారిఫ్‌లకు కౌంటర్‌గా కెనడా కూడా అమెరికాపై ప్రతీకార టారిఫ్‌లు విధించింది. అమెరికా నుంచి దిగుమతిచేసే అనేక వస్తువులపై టారిఫ్‌లు పెంచింది. ముఖ్యంగా బర్బన్ విస్కీ, హార్లే డేవిడ్‌సన్ బైకులతో పాటు ఇతర దిగుమతులపై ఈ సుంకాలు విధించింది.
కెనడా అంటే ట్రంప్‌కు ఎందుకంత మంట?
మరోవైపు ఈసారి కూడా ట్రంప్ కెనడాపై టారిఫ్‌లు విధించేందుకు సిద్ధంగా ఉన్నారు. కెనడా సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమవలసలు వస్తున్నాయని చెబుతున్న ట్రంప్.. కెనడా వస్తువులపై 25శాతం సుంకం విధిస్తానని ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే కెనడా కూడా మరోసారి అమెరికా దిగుమతులపై భారీ టారిఫ్‌లను విధించవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే కెనడా విధానం tit for tat అన్నట్టు ఉంటుంది. ఎవరైనా అదే పనిగా కవ్విస్తే కెనడా ఊరుకోదు. అందుకే ట్రంప్ వ్యాఖ్యలపై కెనడాలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతిస్పందన వచ్చింది. అటు కెనడా ప్రజలు సైతం ట్రంప్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఎందుకో ఏమో కానీ కెనడా విషయంలో ట్రంప్ మొదటి నుంచి ఇదే వైఖరి కలిగి ఉన్నారు. కెనడాను తక్కువ చేసి మాట్లాడడం, కెనడా ప్రధానులను వ్యక్తిగతంగా దూషించడం లాంటి పనులు చేశారు ట్రంప్. 2018 G7 సదస్సు తర్వాత ట్రంప్, ట్రూడోపై పర్శనల్ అటాక్‌కు దిగారు. ట్రూడో ఓ ‘వంచకుడు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది అప్పట్లో పెను దుమారానికి కారణమైంది. మరోసారి అదే రిపీట్ అవుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా, కెనడా మధ్య సైనిక యుద్ధం జరగే అవకాశం లేదనే చెప్పాలి. ఈ వివాదాలు వాణిజ్యానికే పరిమితమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ ట్రంప్ అదేపనిగా కవ్విస్తే మాత్రం ఏ క్షణం ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ దేశమూ కూడా తమ సార్వభౌమాధికారాన్ని వదులుకోలేదు. భూభాగాల జోలికి వస్తే ఊరుకోదు..అలాంటిది మొత్తం దేశమే నాది అంటున్నారు ట్రంప్..!
ఇది కూడా చదవండి: మంటల్లో తగలబడుతోన్న కాలిఫోర్నియా? ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?