ఒక తల్లి, తన చేతిలో కూతురిని బిగువుగా పట్టుకుని ఆ పొగలోంచి బయటకు పరుగు తీస్తోంది. కళ్లలో భయం, కాళ్లలో వేగం, గుండెల్లో దడ ఆమెను వెనక్కు చూడకుండా ముందుకు పరుగెత్తేలా చేస్తున్నాయి. ఒక మహిళ తన ఇంటి వద్ద నిలబడి ఏడుస్తోంది. ‘ఇది మా కలల ఇళ్లు, ఎంతో కష్టపడి అప్పు చేసి కట్టుకున్నాం.. ఇప్పుడు నేల మీద చెల్లాచెదురైన బూడిద మాత్రమే మిగిలింది.. మా కలలు కూడా ఈ బూడిదలో కలిసిపోయాయి’ అని వెక్కివెక్కి ఏడుస్తోంది. ఇది అమెరికా కార్చిచ్చు(wildfire) విషాధ కథలు. అమెరికా(America) వరుస అగ్నిప్రమాద ఘటనలు అక్కడి ప్రజల జీవితాలను అంధకారంలోకి నేడుతున్నాయి. సామాన్యులు, సెలబ్రిటీల భేదం తెలియని కార్చిచ్చు వేల ఇళ్లను తగలబెడుతోంది. ప్రాణాలను తోడేస్తోంది. వన్యప్రాణులను సజీవంగా దహనం చేస్తోంది. ఇంతకీ కాలిఫోర్నియాలో ఈ కార్చిచ్చు ఎందుకు రిగిలింది? అమెరికాలో తరుచుగా ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?
Another huge water drop from Canadian aerial firefighters battling the wildfires in California. pic.twitter.com/lvkZevZlHj
— Made In Canada (@MadelnCanada) January 9, 2025
ప్యాలిసేడ్స్లో భయానక పరిస్థితి
కాలిఫోర్నియాలో శక్తిమంతమైన శాంటా అనా గాలులు వీస్తుండడం ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఇలాంటి గాలులు వీస్తున్న సమయంలో కార్చిచ్చు రేగడం పరిస్థితిని అదుపు తప్పేలా చేసింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచే ఈ ఈదురుగాలులు.. అడవుల్లో ఎండిపోయిన ఆకులు, చెట్లను తగలబెడుతూ ముందుకెళ్తున్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది ఎంత ప్రయత్నిస్తున్నా మంటలు కంట్రోల్ అవ్వడంలేదు. ఈ వైల్డ్ ఫైర్స్ లాస్ ఏంజిల్స్ చుట్టూ ఉన్నాయి. ఇప్పటికే ఇవి లక్షల జీవితాలను ప్రభావితం చేశాయి. మరోవైపు సెలబ్రిటీలకు అడ్డా అయినా లాస్ ఏంజిల్స్‌లోని పసిఫిక్ ప్యాలిసేడ్స్ భారీ అగ్ని విధ్వంసాన్ని చూస్తోంది. దీంతో సెలబ్రిటీలు పెట్టే బేడా సర్థుకోని తరలి వెళ్లిపోతున్నారు. ఎంతో రిచ్‌గా ఉండే లాస్ ఏంజిల్స్‌లో 10 లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు సప్లై ఆగిపోయింది. ఎందుకంటే కరెంటు వైర్లు తగలబడిపోయాయి. కౌంటీ మొత్తం స్కూళ్లను మూసేశారు.
This guy filming the wildfires from his living room in Los Angeles, there is another person and a dog
I hope they all made it to safety
pic.twitter.com/TKmzBCvbKJ— Science girl (@gunsnrosesgirl3) January 8, 2025
పెరుగుతోన్న మృతుల సంఖ్య
లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ప్యాలిసేడ్స్, ఈటన్, కెన్నెత్(Kenneth) లాంటి ప్రాంతాల్లో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ప్యాలిసేడ్స్ అగ్నిప్రమాదం 20,000 ఎకరాలకుపైగా విస్తరించి, 5,300 కంటే ఎక్కువ నిర్మాణాలను ధ్వంసం చేసింది. ఈటన్ అగ్నిప్రమాదం 13,690 ఎకరాలను దహనం చేసింది. కెన్నెత్ అగ్నిప్రమాదం 959 ఎకరాలకుపైగా విస్తరించింది. ఈ అగ్నిప్రమాదాల కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 1,50,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయిన దారుణ దుస్థితి దాపరించింది.
శాంటా అనా గాలులతోనే మంటలు వ్యాపిస్తున్నాయా?
ఈ అగ్నిప్రమాదాలకు శాంటా అనా గాలులు ప్రధాన కారణమైతే అసలు అడవిలో మంటలు రాజుకోవడానికి విద్యుత్ లైన్లే కారణమన్న వాదన వినిపిస్తోంది. అటు ఎవరైనా సిగరేట్ తాగి అడవిలో పడేసినా, వేరే ఇతర కారణాలతో నిప్పు పెట్టినా కూడా మంటలు ఈజీగా వ్యాపించడానికి శాంటా అనా గాలులు సాయం చేస్తాయి. అంటే ప్రకృతి కారణంగా సంభవించే కార్చిచ్చులు కొన్నైతే.. అటు మానవ తప్పిదాల కారణంగా చెట్లను మాడ్చి మాసి చేసే కార్చిచ్చులు మరికొన్ని.
ప్రమాదాలకు కారణం ఏంటి?
నిజానికి కాలిఫోర్నియాలో ప్రతి సంవత్సరం అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. 2020లో జరిగిన ఆగస్ట్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం 10 లక్షల ఎకరాలకు పైగా విస్తరించి, రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద అగ్నిప్రమాదంగా నిలిచింది. అటు అమెరికా చరిత్రలోనూ అనేక భారీ అగ్నిప్రమాద ఘటనలు సంభవించాయి.1871 లో జరిగిన పెష్టిగో అగ్నిప్రమాదం 1,500 మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. ఇక అగ్నిప్రమాదాల నివారణకు, నియంత్రణకు కొన్ని చర్యలు అవసరమని చెబుతారు నిపుణులు. అందులో ప్రధాపమైనది పొడి చెట్లను తొలగించడం, అటవీ ప్రాంతాలను సక్రమంగా నిర్వహించడం. ఇక పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. వాతావరణ మార్పు అనేది ప్రపంచంలోని అనేక వినాశనాలకు, విషాదాలకు కారణం. ఇక మంటలను తట్టుకునేలా ఇళ్ల నిర్మాణాల్లో పదార్థాలను ఉపయోగించడం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. అంటే fire resistant structues అన్నమాట. Concrete, Clay bricks, Sandstone, Gypsum board లాంటి వాటిని నిర్మాణాల్లో వినియోగించడం అగ్ని ప్రమాద నష్టాన్ని తగ్గిస్తుందట!
ఇది కూడా చదవండి: పుణ్యం కోసం వెళ్తే ప్రాణాలే పోతాయ్.. కుంభమేళ నుంచి తిరుపతి వరకు దేశాన్ని విషాదంలో ముంచేసిన మతపరమైన తొక్కిసలాటలు!