ఈ CEOలు మళ్ళీ మొదలుపెట్టారు. పాత పాటే పాడి పాడి క్యాసెట్‌ను అరగదీస్తున్నారు. వారానికి 90 గంటలు పనిచేయాలట..! అదేంటి.. మొన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి 70 గంటలే అన్నారు కదా.. మరి ఈ 90 గంటల మాట ఎవరిది అని ఆలోచిస్తున్నారా? L అండ్ T చైర్మన్ SN సుబ్రహ్మణియన్(S. N. Subrahmanyan) ఇచ్చిన ఉచిత సలహా ఇది! దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలంటే ప్రతీ ఒక్కరూ వీకాఫ్‌లు తీసుకోకుండా వారానికి 90 గంటలు పని చేయాలట. అంటే రోజుకు సుమారుగా 13గంటలు.. అది కూడా వీకాఫ్ తీసుకోవద్దు..! ‘రోజంతా భార్యను అలానే చూస్తూ ఇంట్లో ఎలా ఉంటారు? సండే కూడా ఆఫీస్‌కు వచ్చేయండని’ సుబ్రహ్మణియన్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. మీ కంపెనీ మీటింగ్‌ల మధ్యలో భార్యల ఊసేందుకుని బాలీవుడ్ స్టార్ దీపిక పదుకోణ్‌తో పాటు మరికొందరు ఓపెన్‌గానే సుబ్రహ్మణియన్పై కౌంటర్ అటాక్‌కు దిగారు. అయినా కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. తన మాటకు కట్టుబడి ఉన్నానని మరోసారి బలగుద్ది స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతకీ ఈ CEOలు, కంపెనీ ఫౌండర్లు ఇలా ఎక్కువ పని గంటల విధానాన్ని ప్రమోట్ చేస్తున్నారు? వారి లాజిక్ ఎంత వరకు కరెక్ట్?
దేశం కోసం.. ధర్మం కోసం.. కార్పొరేట్ల కోసం
దేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ త్యాగాలు చేయాలంటారు సుబ్రహ్మణియన్. ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలంటే భారతీయులు వారానికి 90 గంటల పని విధానాన్ని పాటించాలంటారు. ఇంట్లో కూర్చుని ఏం చేస్తారని… ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలట. అటు మరోవైపు దేశ ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. అందుకోసం వారానికి 70 గంటలు పని చేయాలని నారాయణమూర్తి(Narayanamurthy) సూచిస్తుంటారు. అటు మ్యాట్రిమోనీ సంస్థ Shaadi వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ వారానికి 80 గంటల పని చేయాలని.. అడిగిన వారికి అడగని వారికి సలహాలు ఇస్తున్నారు. ఇక ఇండియాలోనే కాదు.. టెస్లా సీఈవో ఎలన్ మస్క్(elon musk) సైతం work like hell అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వారానికి 80 నుంచి 100 గంటలు పనిచేయాలన్నది మస్క్ మాట కూడా. ఇక వీళ్లందరిలో కామన్ పాయింట్ long working hours. ఇతర దేశాలతో పోటీ పడాలంటే ఇలా చేయాలట. పోటి పడి ఏం చేయాలో, ఆరోగ్యాన్ని పాడు చేసుకోని ఏం సాధించాలో మాత్రం వీళ్లు చెప్పరు! ఉద్యోగుల సంక్షేమం, హక్కులను పణంగా పెట్టి దేశాన్ని అభివృద్ధి చేయడమేంటని అడిగితే సమాధానం ఉండదు.

PC: INDIA TODAY
ఆ దేశాల సంగతేంటి?
అటు జర్మనీ, నార్వే, స్వీడన్ లాంటి యూరప్ దేశాలు వారానికి 35-40 గంటల పని విధానాలు పాటిస్తున్నాయి. ప్రపంచంలో మంచి జీవన ప్రమాణాలను కలిగిన దేశాల్లో ఇవి ముందువరుసలో ఉన్నాయి. ఇటు ఈ సీఈవోలు చెప్పేది మాత్రం వేరు. ఎక్కువ పని చేస్తే ఎక్కువ ప్రొడక్టవిటీ వస్తుందని వాదించడంలో ఎలాంటి అర్థంలేదని యూరప్ దేశాలు నిరూపిస్తున్నాయి. అటు ఎక్కువ పని ఒత్తిడి కారణంగా ఉద్యోగుల మరణాలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. తక్కువ జీతాలు, అధిక పని సమయం కలిగిన దేశాలలో ఇండియా ఒకటి. ఇది International Labour Organization చెబుతున్న నిజం. అధిక పని ఒత్తిడి వల్ల స్ట్రోక్, డిప్రెషన్, బరువు పెరగడం లాంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అవి అకాల మరణానికి కారణం అవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి సంవత్సరం ఎక్కువ పని సమయాల కారణంగా వరల్డ్ వైడ్‌గా 7 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి.
శ్రమ దోపిడీకి ఓపెన్ ప్రమోషన్
ఇక CEOలు సూచిస్తున్న అధిక పని సమయాలు శ్రమ దోపిడీకి ప్రత్యక్ష ఉదాహరణ అన్నది చాలా మంది ఉద్యోగుల మాట. ఎంత పని చేసినా ఇచ్చేది ఒక్కటే జీతం. మరి ఎక్కువ గంటలు పని చేయించుకోవడమేంటి? శ్రమదోపిడిని ఇంత నేరుగా ప్రమోట్ చేయడమేంటి? ప్రపంచంలోని అన్ని అసమానతలకు, కుల-మత-వర్గ భేదాలకు కారణమైన శ్రమ దోపిడిని దేశ అభివృద్ధితో లింక్ పెట్టడమేంటి? నిజంగా అన్నీ గంటలు పని చేస్తే ఎంతొకొంత లాభం ఉంటుందా అంటే ఆ లాభం కంపెనీకే కానీ ఉద్యోగికి కాదు కదా..? మరి వ్యక్తిగత జీవితాన్ని ఎవరి కోసం త్యాగం చేయాలి? అసలు వ్యక్తిగత జీవితమే లేకపోతే ఈ బతుకెందుకు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను నేరుగా సంధిస్తున్నారు ఉద్యోగులు. ఇంతకీ మీరేం అంటారు? సీఈవోలు కరెక్టా? ఉద్యోగుల వాదన కరెక్టా?
ఇది కూడా చదవండి: ఐసిస్ పుట్టుకకు అమెరికా ఎలా కారణమైంది? భయానక నిజాలు..!

Jeffrey Epstein Files: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్.. కొత్త లీక్‌లో బయటపడిన సంచలన విషయాలు..!
Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Relationships: మనల్ని మనమే మరిచిపోయిన కథ.. బతుకుతున్నామా లేదా నటిస్తున్నామా?
Relationship Tips: మీ లైఫ్ పార్ట్నర్తో చెప్పకూడని నాలుగు విషయాలు.. ఇది సిక్రెసీ కాదు ప్రైవసీ!