అతని పేరు సునీల్.. వయసు 28.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు.. ప్రొఫెషనల్‌గా వెల్ సెటిల్డ్.. అయినా ఒక్కటే బాధ..! తనకు లవర్ లేదన్న ఆందోళన.. అసలు అమ్మాయితో ఎలా మాట్లాడాలో అర్థంకావడం లేదన్న దిగులు.. తన ఫ్రెండ్స్‌లో కొంతమందికి పెళ్ళిళ్లు అయిపోయాయి.. మరికొంతమందికి పెళ్ళి కాలేదు కానీ పార్ట్‌నర్ ఉంది. కానీ తనకు మాత్రం ఏదీ లేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న సునీల్‌కు ఒక రోజు ఇంటర్నెట్‌లో ‘డేటింగ్ కోచ్’ అని ఒక బ్లాగ్ కనిపించింది. వెంటనే క్లిక్ చేసి చూశాడు. నంబర్ చూసి కాల్ చేశాడు. చివరకు డేటింగ్ కోచింగ్ సర్వీస్ పొందాలని నిర్ణయించుకున్నాడు. ఏంటి షాక్ అయ్యారా? డేటింగ్ కోచ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే చెప్పేది క్లియర్‌గా వినండి.. ఈ డేటింగ్ కోచ్‌ల ఫీజ్ కూడా లక్షల్లో ఉంటుంది. ఇప్పుడు చాలా మంది పురుషులు లక్షలు ఖర్చు పెట్టి మరీ అమ్మాయిలతో ఎలా డేటింగ్ చేయాలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
డేటింగ్ టిప్స్
ఇండియాలో పురుషుల కోసం డేటింగ్ సలహాదారులు అందుబాటులో ఉన్నారు. వీరు పురుషులకు మహిళలతో సంబంధాలను ఏర్పరచుకోవడంలో సహాయపడతారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో డేటింగ్ కోచింగ్ సేవలు ఇప్పటికే విస్తరించాయి. ఇటు డేటింగ్ కోచ్ మాస్టర్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. డేటింగ్ యాప్‌లు పెరగడం, ఓవైపు Aloneగా ఉంటున్నామనే భావన వేధిస్తుండడంతో పురుషులు ఈ డేటింగ్ కోచింగ్ సేవలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఈ సేవల కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టడానికికైనా వెనకాడడం లేదు. ఇటివలీ ఓ వ్యక్తి తన డేటింగ్ కోచ్‌కు ఏకంగా నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇంతకీ డేటింగ్ కోచ్‌లు ఏం చేస్తారని థింక్ చేస్తున్నారా? చాలా చేస్తారండోయ్..! నిజానికి చెయ్యరు.. చెబుతారు.. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో వివరిస్తారు. మాస్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే.. అదే మన భాషలో చెప్పాలంటే అమ్మాయిలతో పులీహారా ఎలా కలపాలో చెబుతారు. టెక్ట్సింగ్ నుంచి సెక్ట్సింగ్ వరకు ప్రతీది పూసగుచ్చినట్టు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇదంతా ఏదో వారి Experienceతోనో లేదా నోటికి వచ్చిన సలహాలు ఇవ్వడంతోనో చెయ్యరు..! డేటింగ్ కోచ్ మాస్టర్లు ఎక్కువగా ‘విమెన్ సైకాలజీ’ చదివి ఉంటారట!
భలే గిరాకీ
ఈ కోచింగ్‌లో పురుషులకు మహిళలతో ఎలా మాట్లాడాలి, వారిని ఎలా ఆకర్షించాలి అనే విషయాలను నేర్పిస్తారు. వారికి వాట్సాప్ లేదా ఇతర సోషల్‌మీడియా అకౌంట్స్‌లో ఎలా ఛాటింగ్ చేయాలో కూడా చెబుతారు. ఒక వేళ అమ్మాయి అతని ప్రపొజల్‌ను అంగీకరిస్తే డేటింగ్ సమయంలో ఎలా ప్రవర్తించాలో కూడా గైడ్ చేస్తారట. ఎప్పుడైనా గొడవలు జరిగితే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో కూడా సలహాలు ఇస్తారు. నిజానికి ఈ డేటింగ్ కోచింగ్ మూలాలు ఇండియాలో స్టార్ట్ కాలేదు. ఇవి మొదట అమెరికా, యూరప్‌లలో కనిపించింది. 1990లలో పిక్-అప్ ఆర్టిస్ట్-.. అంటే P..U..A అనే ధోరణి పాపులర్ అయింది. ఇది ముఖ్యంగా పురుషులకు మహిళలను ఎలా ఆకర్షించాలో నేర్పించేది. తర్వాతి కాలంలో ఈ కాన్సెప్ట్‌కి సైకాలజీ తోడైంది. ఇటు ఇండియాలో 2010 తర్వాత.. Western Culture ప్రభావంతో పాటు డేటింగ్ యాప్‌ల వినియోగం పెరగడం కారణంగా ఇది ఒక పెద్ద మార్కెట్‌గా మారింది. మొదట వ్యక్తిగత సలహాదారులుగా ప్రారంభమైన ఈ డేటింగ్ కోచింగ్ సర్వీసులు ఇప్పుడు సంస్థల స్థాయికి ఎదిగాయి. కొన్ని గ్లోబల్ కోచింగ్ సంస్థలు ఇండియాలో కూడా సేవలను ప్రారంభించాయి. డేటింగ్ కోచింగ్ మాస్టర్లకు ప్రత్యేకమైన విద్యార్హతలు అవసరం లేదు. అయితే వీరంతా ఎక్కువగా ఇందాక చెప్పుకున్నట్టు ‘విమెన్ సైకాలజీ’ చదివి ఉంటారు. మరికొందరు బిహేవియరల్ సైకాలజీ నేర్చుకోని ఉంటారు. ఇంకొందరు NLP.. అంటే Neuro-Linguistic Programmingలో ట్రైనింగ్ తీసుకోని ఉంటారు. ఇక వీళ్లకి వ్యక్తిగత అనుభవాలు కూడా ఎలాగో ఉంటాయి. అటు సమర్థవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటే బాగానే సంపాదించవచ్చు. డేటింగ్ కోచ్ మాస్టర్లు నెలకు యావరేజ్‌గా 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నారని అంచనా. అటు అనుభవం పెరిగే కొద్దీ వీరికి డిమాండ్ కూడా పెరుగుతోంది. అలా డిమాండ్ పెరిగిన డేటింగ్ కోచింగ్ మాస్టర్లు లక్షల్లో పోగేసుకుంటున్నారట. ఇలా కొంతమంది పురుషులకు మహిళలతో ఎలా మాట్లాడాలో తెలియకపోవడం ఇండియాలో ఓ ఉపాధికి కారణమవడం విడ్డూరంగానే ఉంది..!
ఇది కూడా చదవండి: మందుబాబులకు సైంటిస్టులు దిమ్మదిరిగే షాక్.. ఓ పెగ్గు మీ జీవితాన్ని చంపేస్తుంది!

Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Relationships: మనల్ని మనమే మరిచిపోయిన కథ.. బతుకుతున్నామా లేదా నటిస్తున్నామా?
Relationship Tips: మీ లైఫ్ పార్ట్నర్తో చెప్పకూడని నాలుగు విషయాలు.. ఇది సిక్రెసీ కాదు ప్రైవసీ!
Pulse Polio: రెండే రెండు చుక్కలు.. మిస్ చేసుకోవద్దు..! చిన్న తప్పు… పెద్ద నష్టం..! ఇది కేవలం వార్త కాదు.. హెచ్చరిక..!