‘ఎవరైతే మన దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారో వారికి ఇదే నా హెచ్చరిక.. మీపై మేం పది రెట్లు ప్రతీకారం తీర్చుకుంటాం.. మీ దేశాన్ని ధ్వంసం చేస్తాం.. మీరు చేసిన పనికి తీవ్రంగా పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది..’ యుక్రెయిన్ టార్గెట్‌గా రష్యా అధ్యక్షుడు కొన్ని రోజుల క్రితం చేసిన కామెంట్స్ ఇవి. అయితే పుతిన్ ఎంత హెచ్చరించినా యుక్రెయిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంపై యుక్రెయిన్ దాడులు చేయడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు యుక్రెయిన్ ఇలా చేయడాన్ని రష్యా ఖండించింది. బైడెన్ యుక్రెయిన్‌కు సాయం చేసినట్టే ట్రంప్ కూడా చేయాలన్నది ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్‌స్కీ ప్లాన్‌గా తెలుస్తోంది. ఇక అమెరికా అండతో రష్యా భూభాగాలపై దాడులు చేస్తూనే ఉన్న యుక్రెయిన్ ముఖ్యంగా డ్రోన్లతో విరుచుకుపడుతోంది.
UABలతో దాడులు:
అమెరికా నుంచి సాంకేతిక, సైనిక సహాయాన్ని పొందుతూ, రష్యా భూభాగంపై యుక్రెయిన్ తన దాడులను ముమ్మరం చేసింది. అమెరికా అందించిన ఆధునిక UAVలు, డ్రోన్లు, యుక్రెయిన్ సైన్యానికి రష్యా సరిహద్దులను దాటే సామర్థ్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ దాడుల ద్వారా యుక్రెయిన్ రష్యా సైనిక స్థావరాలు, ఇంధన నిల్వలు లాంటి కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటోంది. కజాన్, రష్యాలోని తతారస్తాన్ ప్రాంతంలో ఉన్న ఒక నగరం. ఈ సిటీపై యుక్రెయిన్ దాడి చేయడం ద్వారా, రష్యా సైనిక స్థావరాలు, కీలక ఆర్థిక కేంద్రాలను దెబ్బతీయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ దాడి, రష్యా సైన్యానికి ఒక హెచ్చరికగా భావించవచ్చు. ఇక యుక్రెయిన్ ఇటివలి కాలంలో ఎక్కువగా UAV డ్రోన్లను ఉపయోగిస్తోంది. UAV అంటే Unmanned Aerial Vehicles. ఈ డ్రోన్లు సరిహద్దులను దాటేందుకు, శత్రు ప్రాంతాలను నిశితంగా పరిశీలించేందుకు, లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు తయారు చేస్తారు. యుక్రెయిన్ ఉపయోగించే ఆయుధాల్లో TB2 డ్రోన్లు ఉన్నాయి. టర్కీ తయారు చేసిన ఈ డ్రోన్లు 150కిలోమీటర్ల పరిధిని లిగి ఉంటాయి. 27 గంటలు ఎగరగలవు. పేలోడ్ సామర్థ్యం 150 కిలోలు ఉంటుంది. లేజర్-గైడెడ్ మిస్సైళ్లను మోసుకెళ్లగలవు. అటు అమెరికా తయారు చేసిన MQ-9 డ్రోన్లను కూడా యుక్రెయిన్ వినియోగిస్తోంది. 1,850 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ డ్రోన్లు 30 గంటలు ఎగరగలవు. దీని పేలోడ్ సామర్థ్యం 1,700 కిలోలు ఉంటుంది. అటు Punisher డ్రోన్లతో పాటు స్విచ్ బ్లేడ్ డ్రోన్లను యుక్రెయిన్ ఎక్కువగా ఉపయోగిస్తోంది.
డ్రోన్ వార్ స్టార్ట్?
ఇటు యుక్రెయిన్‌కు దీటుగా రష్యా కూడా డ్రోన్లను యుద్ధరంగంలోకి భారీగా దింపుతోంది. షాహెడ్, ఓర్లెన్ డ్రోన్లతో యుక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం రష్యా-యుక్రెయిన్ మధ్య జరుగుతుంది డ్రోన్ వార్. అవును.. ఈ యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంటే అవి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. డ్రోన్ దాడుల వల్ల పట్టణాలు, పౌర ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అందుకే డ్రోన్లే కీలక వెపన్లగా మారాయి. అయితే రీసెంట్‌గా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే యుద్ధంలో రష్యా వెనకబడినట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇటివలే యుక్రెయిన్ దాడుల్లో రష్యా Nuclear, Biological and Chemical ప్రొటెక్షన్ ట్రూప్స్ నాయకుడు ఇగోర్ కిరిల్లోవ్ మరణించడం పుతిన్ దళాలకు గట్టి దెబ్బ! ఇక 2022 ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధంలో రష్యా సైన్యం సుమారు 7,74,100 సైనికులను కోల్పోయింది. అటు యుక్రెయిన్ సైన్యం సుమారు 43,000 సైనికులను కోల్పోయింది. రష్యా-యుక్రెయిన్ మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న రాజకీయ, భౌగోళిక విభేదాలు ఈ యుద్ధానికి దారితీశాయి. యుక్రెయిన్‌లోని డాన్‌బాస్ రీజియన్లను తమ గుప్పిట్లో తెచ్చుకునేందుకు యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టింది.
ప్రతీకారం తప్పదా?
మరోవైపు యుక్రెయిన్ డ్రోన్ దాడులతో పుతిన్ ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ డ్రోన్ దాడుల తర్వాత యుక్రెయిన్‌ను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టాలని పుతిన్ ప్రయత్నించే అవకాశముంది. యుక్రెయిన్‌లోని ఇంధన నిల్వలు, ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడులు చేసే ఛాన్స్ ఉంది. అటు ముఖ్యంగా యుక్రెయిన్ డ్రోన్ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకునే రష్యా దాడులకు దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఐసిస్ పుట్టుకకు అమెరికా ఎలా కారణమైంది? భయానక నిజాలు..!