Menu

Israel-Hamas War: నిలువెల్లా విషం నిండిన తేలు ‘ఇజ్రాయెల్‌..’ మరోసారి బరితెగించిన బెంజమిన్ బలగాలు!

Tri Ten B
40,000 Palestinians have been killed in Gaza

ఇజ్రాయెల్‌ది కండకావరం.. అమెరికా అండదండలు చూసుకోని విర్రవీగే అహంకారం. హమాస్‌పై ప్రతీకార దాడుల సాకుతో పాలస్తీనా గడ్డపై ఇజ్రాయెల్‌ సృష్టిస్తున్న నరమేధానికి అంతేలేకుండా పోతోంది. నిత్యం ఏదో ఒక చోట బాంబులు విసరడం, అమాయకుల ప్రాణాల్ని బలిగొనడం ఇజ్రాయెల్‌కే చెల్లుతుంది. మరోసారి అదే నిజమని తేలింది. తాజాగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌కు సమీపంలోని గుడారంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 40 మంది ప్రాణాలు విడిచారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సురక్షిత ప్రాంతాలేవి లేవక్కడ

గాజా జనాభాలో దాదాపు సగం మంది ఇప్పుడు అల్-మవాసి ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇది సేఫ్ జోన్ అని భావించి ప్రజలు ఎక్కువగా గుడారాల్లో ఉంటున్నారు. అయితే ఇజ్రాయెల్‌ వారిపై బాంబుల దాడి చేసింది. ఐదు భారీ వైమానిక బాంబులు విసిరింది. ఈ దాడులు అక్కడ అనేక కుటుంబాలను ఛిద్రం చేశాయి. గాజాలోకి ఇజ్రాయెల్ కనీస వైద్య అవసరాలను అనుమతించడం లేదు. దీంతో తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సేఫ్ జోన్‌గా పిలిచే ఈ ప్రాంతం ప్రస్తుతం గాజాలో చాలా ప్రమాదకరమైన ప్రదేశంగా మారింది.

ఇజ్రాయెల్ నెత్తుటి దాహం

ఈ దాడులను ఇజ్రాయెల్‌ ఎప్పటిలాగే సమర్థించుకునే ప్రయత్నం చేసింది. హమాస్ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతుండగా.. పాలస్తీనా వర్గాలు మాత్రం ఈ వాదనను పచ్చి అబద్ధంగా అభివర్ణిస్తున్నాయి. ఇక గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో 2023 అక్టోబర్‌ 7 నుంచి 2024 సెప్టెంబర్‌ 9 వరకు 40,988 మంది మరణించారు. 94,825 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7, 2023లో హమాస్‌ దాడులు చేసింది. ఈ ఘటనల్లో 1200 మంది చనిపోయారు. ఈ దాడులకు ప్రతీకారం పేరుతోనే 11 నెలలగా గాజా గడ్డపై ఇజ్రాయెల్‌ మారణహోమం సృష్టిస్తోంది.

మానవహక్కుల ఉల్లంఘనే

అక్టోబర్ 7, 2023న హమాస్‌ తమపై జరిగిన అకస్మిక దాడికి ప్రతీకారంగా గాజా నివాసాలపై ఇజ్రాయెల్‌ నిప్పుల వర్షం కురిపిస్తోంది. దీంతో పాలస్తీనాలో హాహాకారాలు మిన్నుముట్టుతున్నాయి. ఒకవైపు ప్రజలపై వారి నివాసించే ఇళ్లపై బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరోవైపు పాలస్తీనా ప్రజలకు నీరు, ఆహారం, కరెంట్ అందకుండా చేస్తోంది. అమెరికా అండతో పాలస్తీనాకు చెందిన వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసెలంలో పాలస్తీనీయన్లను గెంటివేసిన ఇజ్రాయెల్‌ ఇప్పుడు మిగిలిన భూభాగాలపై దృష్టి పెట్టింది.

మరోవైపు ప్రపంచదేశాలు ఇజ్రాయెల్‌ తమ దాడులను ఆపాలని కోరుతోంది. పాలస్తీనాకు మద్దతుగా నిరసనల బాట పడుతోంది. అటు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు-ICC సైతం ఇజ్రాయెల్‌ చర్యలను తీవ్రంగా తప్పపడుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని, రక్షణ మంత్రికి గతంలోనే అరెస్టు వారెంట్లు జారి చేసింది కూడా. అయినా ఇజ్రాయెల్‌ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.


ఎక్కడ చూసినా ఇదే విధ్వంసం

ఇటు కేవలం పాలస్తీనా గడ్డపైనే కాదు.. అటు సిరియాలోనూ ఇజ్రాయెల్‌ సైనికులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఇక సెప్టెంబర్ 9న సిరియాలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిపై ఇరాన్ స్పందించింది. ఇజ్రాయెల్ నేరపూరిత దాడికి పాల్పడిందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరోపించారు. ఇరాన్ మంత్రిత్వ శాఖ కూడా ఇజ్రాయెల్ మద్దతుదారులపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో సిరియాలో 18 మంది చనిపోగా.. 43మంది గాయపడ్డారు. ఇలా ఇజ్రాయెల్‌ పేద, ముస్లిం దేశాలపై బాంబులతో విరుచుకుపడడం కొత్త విషయమేమీ కాకపోయినా ఇటివలీ కాలంలో దాడులను మరింత తీవ్రతరం చేయడం ఆందోళన కలిగించే అంశం.

ఇది కూడా చదవండి: చెవిటిదైన ప్రపంచంలో పసిజీవుల ఆర్తనాదాలు..! నెత్తుటి సముద్రం కళ్ళ చూస్తున్న రణం

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *