Menu

Mamata Banerjee: ఇంత దిగజారుడు రాజకీయమా? చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేయడంలో మమత తర్వాతే ఎవరైనా..!

Tri Ten B
kolkata rape and murder case mamata benerjee

‘బెంగాల్ ఈ రోజు ఏం ఆలోచిస్తుందో.. రేపు భారతదేశం అదే ఆలోచిస్తుంది..’ బెంగాల్‌ గురించి స్వాతంత్ర్య సమరయోధుడు గోపాల కృష్ణ గోఖలే చెప్పిన మాటలివి..! అయితే ఇదంతా గతం.. ఆ రోజులు పోయి దశబ్దాలు గడిచిపోయాయి. ప్రస్తుతం బెంగాల్‌ విద్వేష రాజకీయాలతో భ్రష్టు పట్టిన రాష్ట్రం. టీఎంసీ, బీజేపీ గూండాల విధ్వంసంలో చిరిగి ఛిద్రమవుతున్న ప్రాంతం..! అత్యాచారాలను కూడా రాజకీయం చేయడం అక్కడి నేతలకే చెల్లుతుంది. కోల్‌కతా RG కర్‌ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన తర్వాత సీఎం మమతాబెనర్జీ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఈ విషయాలన్ని ఇట్టే అర్థమవుతాయి. హిపోక్రసీ అనే పదం వినపడితే చాలామందికి మమతనే గుర్తొస్తుంది..!

మమత డబుల్ స్టాండర్డ్స్‌:


ట్రైనీ డాక్టర్‌ హత్యాచార కేసును ముందు నుంచి కోల్‌కతా పోలీసులే దర్యాప్తు చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో అంతా డొల్లతనమే కనిపించడంతో అక్కడి హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించింది. అప్పటివరకు ఈ కేసు గురించి పెద్దగా పట్టించుకోని మమతా ఉన్నట్టుండి నిరసనరాగం అందుకున్నారు. తన సొంత రాష్ట్రంలో జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా ఆమె రోడ్డుపైకి రావడం ప్రజలను విస్మయానికి గురి చేసింది.

ముందు నుంచి పోలీసులు ఏం చేసినట్టు?

అంతటితో ఆగకుండా సీబీఐకి మమత డెడ్‌లైన్లు పెట్టడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన మరుసటి రోజే మమత చేసిన వ్యాఖ్యలు ఆమెలోని ద్వంద్వ వైఖరికి అద్దం పడుతున్నాయి. ఆదివారం లోపు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని.. ఆ వెంటనే సోమవారం దోషిని ఉరి తియ్యాలంటూ మమత వింతగా మాట్లాడారు. అయితే ఈ చిత్తశుద్ధి కేసు ఆమె పరిధిలోని పోలీసుల అండర్‌లో ఉన్నప్పుడు లేకపోవడం విమర్శలకు కారణమైంది.

ఈ అల్లర్లు టీఎంసీ పనేనా?

ఇక ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన తర్వాత యావత్‌ బెంగాల్‌ యువత రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసనకు దిగింది. అయితే ఆగస్టు 15 అర్థరాత్రి ఓ గుంపు అనూహ్యంగా ఆస్పత్రి వద్దకు వచ్చి విధ్వంసానికి దిగింది. ఇది నిరసనలను పక్కదారి పట్టించడానికి చేసిన దాడిగా తెలుస్తోంది. ఇది ఎవరి కన్నుసన్నుల్లో జరిగిన దాడి అన్నది ఇప్పటివరకు నిర్ధారణ కాకపోయినా మమత వైపే ప్రతిపక్షాలు వేలు చూపిస్తున్నాయి. నిరసనల్లో అల్లర్లు సృష్టించడం వెనుక టీఎంసీ నేతల హస్తం ఉందన్నది బీజేపీ వాదన!

నిజానికి బెంగాల్‌ ఈ రకమైన కొట్లాటలకు కేరాఫ్‌గా మారి ఏళ్లు గడుస్తున్నాయి. ఎన్నికల సమయంలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు ఘోరంగా తన్నుకోవడం, నాటు బాంబులను విసురుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. అక్కడి శాంతి భద్రతలు క్షిణించి ఏళ్లు దాటింది. మమతాబెనర్జీ ఈ విషయంలో పూర్తి ఫెయిల్యూర్‌గా కనిపిస్తున్నాయి. విద్వేష రాజకీయాలకు బెంగాల్‌ సెంట్రీక్‌గా మారడంలో ఆమె పాత్ర ఎక్కువ ఉందన్నది విశ్లేషకుల మాట!

అప్పుడు మహిళా ఎంపీలు మాట్లాడలేదేం?


అటు మమతపార్టీకి చెందిన మహిళా ఎంపీలు సైతం హత్యాచార విషయంలో మొదట మౌనం పాటించారు. కేంద్రంపై నిత్యం విరుచుకుపడే మహిళా ఎంపీ మెయిత్రా సైతం నోరు విప్పలేదు. అయితే కేసు సీబీఐకి బదిలీ అయిన వెంటనే టీఎంసీ మహిళా ఎంపీలంతా రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారు. నిజానికి పార్లమెంట్‌లో టీఎంసీ మహిళా ఎంపీల ప్రాతినిధ్యం ఎక్కువ. టీఎంసీ ఎంపీల్లో 38శాతం మంది మహిళలే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీఎంసీ మొత్తం 29 స్థానాల్లో గెలిస్తే అందులో 11మంది మహిళలే ఉన్నారు. అయితే ఇంత ప్రాతినిధ్యం ఉన్నా బెంగాల్‌ హత్యాచార ఘటనలోఅక్కడి మహిళ ఎంపీల మౌనం అనేక విమర్శలకు కారణమవుతోంది.

Also Read: అత్యాచారాలకు ఉరే సరా? మరణశిక్షతో అఘాయిత్యాలను ఆపగలమా?

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *