Menu

Israel Atrocities: ఇజ్రాయెల్‌ మారణహోమం.. చిన్నారులను కూడా వదలని కర్కశత్వం!

Tri Ten B
iran vs israel

10 నెలలు.. 17,000 దాడులు.. 5 దేశాల్లో రక్తపాతం.. 41 వేల మరణాలు..! ఇది ఇజ్రాయెల్‌ సృష్టించిన నరమేధపు లెక్కలు..! 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ దళాలపై హమాస్‌ దాడి చేసింది. ఈ అటాక్‌లో 1200 మంది చనిపోయారు. ఇందులో ఇజ్రాయెల్‌ సైనికులతో పాటు సామాన్య పౌరులూ ఉన్నారు. ఈ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ ఈ 10 నెలల కాలంలో బీభత్సాన్ని సృష్టించింది. అమాయక పాలస్తీనా మహిళలు, చిన్నారులపై బాంబులతో విరుచుకుపడింది. దాదాపు 40 వేల మంది సామాన్యులను పొట్టనబెట్టుకుంది. అటు కేవలం పాలస్తీనా-గాజా గడ్డపైనా కాదు.. ఇతర దేశాల్లోనూ ఇజ్రాయెల్‌ దళాలు మానవ హక్కులను కాలరాశాయి.

ఐదు దేశాలపై దాడులు:
పాలస్తీనా, లెబనాన్, సిరియా, యెమెన్‌లతో సహా ఐదు దేశాలలో 17,000 కంటే ఎక్కువ దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్‌. ఇందులో ఒక పాలస్తీనా గడ్డపైనే 10,389 సార్లు విరుచుకుపడింది. ఈ దాడుల్లో 40 వేల 39 మంది ప్రాణాలు విడిచారు. అటు లెబనాన్‌పైన 6 వేల 544 సార్లు దాడులు చేయగా.. 590 మంది చనిపోయారు. అటు సిరియా ప్రజలపైనా ఇజ్రాయెల్‌ దళాలు కనికరం చూపలేదు. ఈ 10 నెలల్లో అక్కడ 260మంది పౌరుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అటు యెమెన్‌, ఇరాన్‌ గడ్డపైనా రెండు సార్లు అటాక్ చేసింది ఇజ్రాయెల్.


ఇస్లామిక్‌ దేశాలే టార్గెట్:
ఇక ఈ 10 నెలల కాలంలో హమాస్‌ కీలక నేతలతో పాటు లెబనాన్‌లోని హిజ్బుల్లా లీడర్లను చంపింది ఇజ్రాయెల్‌. హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిన్‌ను ఇరాన్‌ గడ్డపైన మట్టుబెట్టింది. ఇది ఇరాన్‌ ఆగ్రహానికి కారణమైంది. నిజానికి 2024 ఏప్రిల్‌లోనే ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య మినీ వార్‌ నడిచింది. ముందుగా ఇజ్రాయెల్‌పై మిస్సైళ్లతో విరుచుకుపడిన ఇరాన్‌ ఆ తర్వాత సైలెంట్‌ అయ్యింది. హమాస్‌కు గట్టి మద్దతుగా ఇరాన్‌ నిలపడుతుంది. అటు చరిత్రపరంగానూ ఇజ్రాయెల్‌తో ఇరాన్‌కు దశబ్దాల వైరం ఉంది. అందుకే ఇరాన్‌, హమాస్‌, హిజ్బుల్లా.. ఇలా చాలా ఇస్లామిక్‌ సంస్థలు ఇజ్రాయెల్‌ను టార్గెట్‌ చేసుకున్నాయి. మరోవైపు అమెరికా అండతో ఇజ్రాయెల్‌ రెచ్చిపోతోంది.. ఇలా ఇరువైపుల దళాలు ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు.

ఇజ్రాయెల్‌ను వదలనంటున్న ఇరాన్:
అటు ఇస్మాయల్‌ హత్య తర్వాత ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇజ్రాయెల్‌ను వదిలిపెట్టే ప్రశక్తే లేదని బహిరంగంగా ప్రకటించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అమాంతం పెరిగాయి. మరోవైపు హిజ్బుల్లా టార్గెట్‌గా లెబనాన్‌పైనా ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. ఇక ఎప్పటిలానే గాజా గడ్డపైనా బాంబులు విసురుతోంది. గాజా నగరంలోని మరో రెండు స్కూల్స్‌పై ఇజ్రాయెల్ దళాలు బాంబు దాడి చేశాయి. ఈ అటాక్‌లో 30 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో 20 మందికి పైగా పిల్లలే ఉన్నారు. ఇటు దక్షిణ లెబనాన్‌లోని జబల్‌ ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు చనిపోయారు.

అమాయక చిన్నారులపై దాడులు:
అటు గాజాతో పాటు సిరియా, లెబనాన్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ దాడులు చేయడాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు పూర్తిగా తప్పపడుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్‌ దాడుల్లో ఎక్కువగా చనిపోతుంది సామాన్యులేనని నివేదికలు చెబుతున్నాయి. యూనిసేఫ్‌ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 2024 మార్చి 17నాటికి యుద్ధం కారణంగా పాలస్తీనా చిన్నారులు ఎంతమంది చనిపోయారో యూనిసేఫ్‌ లెక్కలు రిలీజ్ చేసిది. దీని ప్రకారం దాదాపు 13 వేల మంది చిన్నారులు ఇజ్రాయెల్‌ దాడుల్లో చనిపోయారు. వేల సంఖ్యలో చిన్నారులు అనాధలగా మారారు. అటు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు చట్టాలు కూడా ఇజ్రాయెల్‌ ప్రధానిని ఓ యుద్ధాన్మోదిగా ఎప్పుడో ప్రకటించాయి.

కవ్వింపు చర్యలే కారణం:
యుద్ధ నేరాలకు పాల్పడిన ఇజ్రాయెల్‌ ఇప్పటివరకు శిక్షకు గురికాలేదు. అమెరికా అండతో పేద ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ దేశాలకు ఇరాన్‌ అండగా నిలుస్తూ వస్తోంది. ఇదంతా ఈ 10 నెలల నుంచే జరుగుతున్న విషయం కాదు.. దశబ్దాలుగా జరుగుతున్న నరమేధం. గత 75 ఏళ్లలో అత్యధిక సార్లు యుద్ధదాడులకు గురైన ప్రాంతం పాలస్తీనా. అత్యధిక సార్లు ఇతర దేశాలపై విరుచుకుపడిన దేశం ఇజ్రాయెల్‌. అయినా ఇజ్రాయెల్‌ ఆడిందే ఆటగా సాగడానికి అమెరికా అండ ఉండడమే కారణమన్న విమర్శలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడంతోనే ప్రస్తుతం ప్రపంచం మరో యుద్ధం అంచున నిలబడిందని అమెరికా వ్యతిరేక మీడియా సంస్థలు చెబుతున్నాయి.

Also Read: మనుషులు చేసిన దేవుళ్ల కోసం మూర్ఖపు చేష్టలు.. ఈ చావులకు బాధ్యులు ఎవరు?

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *