Menu

Siraj-Nikhat Zareen: ప్రతిభకు తగిన గుర్తింపు.. సిరాజ్‌-నిఖత్‌కు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఇవే..!

Praja Dhwani Desk
muhammad siraj nikhat zareen group 1

బౌలింగ్‌లో రన్‌ మెషీన్‌ అంటూ ట్రోల్‌ చేసేవారు.. మరికొందరు పనిగట్టుకోని ఎగతాళి చేసేవారు.. అయితే రోజులెప్పుడు ఒకేలాగా ఉండవు కదా.. టీమిండియా స్పీడ్ స్టార్‌ సిరాజ్‌ టాలెంట్‌ ఏంటో ఫ్యాన్స్‌కి కాస్త లేట్‌గా అర్థమైంది.. ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా సిరాజ్‌ స్కిల్‌కు తగిన గుర్తింపు ఇవ్వాలని భావించింది. మహ్మద్ సిరాజ్‌కు గ్రూప్‌-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. అటు బాక్సర్ నిఖత్ జరీన్‌కు ఇదే జాబ్‌ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. గ్రూప్-1 క్యాడర్‌లో ఈ ఇద్దరికి డీఎస్పీ ఉద్యోగాలను దక్కనున్నాయి. ఇది క్రీడాభిమానుల ఆనందానికి కారణమైంది.

ప్రపంచవేదికలపై ఇరగదీసిన నిఖత్‌ :
బక్క పలచటి మొహం. చురకత్తి లాంటి చూపు. పులిపంజా విసిరితే ఎలా ఉంటుందో అచ్చంగా అలాంటి పంచ్‌. ఇంకేముందు ప్రత్యర్థి గుండెలదరడానికి అంతకంటే ఇంకేం కావాలి. నిఖత్‌ జరీన్‌లోని స్థైర్యం ఎదుటివారిని ఖంగుతినిపించేలా ఉంటుంది. ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్‌ ఆమె చిరకాల స్వప్నం. పారిస్‌ ఒలింపిక్స్‌లో అది సాకరం కాలేదు. అయినా ఆమెను తక్కువ చేసి మాట్లాడానికి లేదు. ఎందుకంటే ప్రపంచవేదికపై ఇప్పటికే నిఖత్‌ తన సత్తా చూపించిన సందర్భాలు ఎన్నో..! ఇక 2024లో మిస్ అయిన ఒలింపిక్‌ మెడల్‌ 2028 అమెరికా వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో నిఖత్‌ గెలుచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే సమయంలో ఈ తెలంగాణ ముద్దు బిడ్డకు ప్రభుత్వం గుర్తించిన తీరును మెచ్చుకుంటున్నారు!

వరల్డ్ చాంపియన్‌:
నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ హైదరాబాద్‌లో నివాసం ఉంటారు. నిఖత్ తండ్రి మహమ్మద్ జమీల్ తన కుమార్తెను బాక్సింగ్‌లో ప్రోత్సహించి స్వయంగా తనే ఒక ఏడాది పాటూ శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత 2009లో విశాఖపట్నానికి చెందిన ద్రోణాచార్య అవార్డీ ఐవీ రావు దగ్గర ఆమె శిక్షణ పొందింది అప్పటి నుంచీ ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడుతూ వచ్చింది. చిన్నప్పటి నుంచే బాక్సింగ్‌లో సత్తా చాటుతోన్న నిఖత్… 2011లో జూనియర్ కేటగిరీలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు.

తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు:
2018లో బెల్‌గ్రేడ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి… అదే ఏడాది హరియాణాలో జరిగిన మహిళల సీనియర్ జాతీయ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించారు నిఖత్. 2019లో ఇండియా ఓపెన్‌లో బ్రాంజ్‌ మెడల్ సాధించిన నిఖత్‌.. 2019 ఆసియా చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిశారు. 2019 థాయ్‌లాండ్ ఓపెన్‌లో సిల్వర్‌ గెలిచిన నిఖత్.. అదే ఏడాది స్ట్రాండ్‌జా బాక్సింగ్ టోర్నమెంట్‌లో గోల్డ్ గెలిచారు. ఇక 2021 ఇస్తాంబుల్ టోర్నమెంట్‌లో బ్రాంజ్‌ మెడల్ సాధించింది నిఖత్. అటు ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది. సీనియర్ విభాగంలో ఆమె వరల్డ్ చాంపియన్‌గా అవతరించి ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డ్ క్రియేట్ చేసింది.

బుమ్రా తర్వాత…:
అటు మరో హైదరాబాదీ ముద్దుబిడ్డ సిరాజ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. విదేశీ గడ్డలపై సిరాజ్‌ లేని బౌలింగ్‌ డిపార్టమెంట్‌ను ఊహించుకోవడమే కష్టం. వరుస గాయాలతో టీమిండియా స్టార్‌ పేసర్ బుమ్రా జట్టుకు అందుబాటులో లేని సమయంలో సిరాజ్‌ అన్నీతానై టీమ్‌ను ముందుకు నడిపించాడు. ఒకానొక టైమ్‌లో జట్టు బౌలింగ భారాన్ని మొత్తం మోశారు సిరాజ్‌. పడిన చోటే లేచి విమర్శకుల మూతి మూయించిన సిరాజ్‌ ఇటివలీ టీమండియా టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు. భారత్ క్రికెట్‌ జట్టుకు సిరాజ్‌ అందిస్తున్న విజయాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అతనికి డీఎస్పీ ఉద్యోగాన్ని అనౌన్స్ చేసింది.

Also Read: ఎవరీ మనుభాకర్‌..? 22ఏళ్లకే పారిస్‌ ఒలింపిక్స్‌లో మెరిసిన ఈ షూటర్‌ కథ ఇదే!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *