Menu

Heavy Floods in History: ప్రకృతి ప్రకోపం..! చరిత్రలో జీవితాలను ముంచేసిన కన్నీటి వరదలు..!

Tri Ten B

Kerala landslides: ఓ రాకసి అల అమాంతం ఓ పిల్లాడిని మింగేసింది.. అప్పటివరకు ఆడుతూ పాడుతూ తిరిగిన ఓ కుటుంబాన్ని వరదలు ముంచేశాయి. ప్రకృతి ప్రతాపం చూపించిన రోజు మనుషులు శవాలుగా మారుతారు. స్మశానవాటికలన్నీ నిండిపోతాయి. వాన, వరద, ఉప్పెన, ప్రళయం.. ఇలా పేరు ఏదైనా వరుణుడు సృష్టించే బీభత్సాన్ని తట్టుకోవడం చాలా కష్టం. కేరళలో వరదలకు కొండచరియలు విరిగిపడడం.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కేరళలో ప్రతీ ఏడాది ఇలాంటి వరదలు సంభవిస్తుండడం సాధారణంగా మారిపోయింది. అయితే కేరళతో పాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వరద విధ్వంస ఘటనలు చాలానే ఉన్నాయి.

చైనాను రెండు సార్లు:
1931 చైనా వరదలును సెంట్రల్ చైనా వరదలు అని కూడా పిలుస్తారు. చైనాలోని యాంగ్జీ నదీ పరీవాహక ప్రాంతాన్ని వరదలు ముంచేశాయి. ఈ విపత్తు ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన వాటిల్లో ఒకటిగా చరిత్రకారులు పరిగణిస్తారు. ఈ వరదల కారణంగా 40 లక్షల మందికి పైగా మరణించారు. అపారమైన ప్రాణ నష్టంతో పాటు, వరదల కారణంగా లక్షల్లో ఇళ్లు నీటమునిగాయి. పొలాలు నాశనం అయ్యాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఈ వరదలతో చైనా ఆర్థిక వ్యవస్థ కూడా అస్తవ్యస్థమైంది.

అటు చైనాను 1897లోనూ వరదలు ముంచేశాయి. 1887 వేసవిలో రుతుపవన వర్షాలు విస్తారంగా కురిశాయి. దీని కారణంగా ఎల్లో రివర్‌ పొంగిపొర్లింది. ఆ తర్వాత ఎల్లో రివర్ ప్రవహించే ప్రాంతాలు నీటమునిగాయి. ఈ వరదల కారణంగా 20లక్షల మంది మరణించారని అంచనా. భారీ ప్రాణనష్టంతో పాటు లక్షలాది ఇళ్లు, పొలాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ వరదలతో చైనా తన పొరపాట్లను తెలుసుకుంది. వరద నియంత్రణ, నదుల నిర్వహణను మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఈ విపత్తు ఎత్తి చూపింది.

బెంగాల్‌ను ముంచేసిన టైఫూన్:
1900 హైఫాంగ్ టైఫూన్‌ను గ్రేట్ టైఫూన్ అని పిలుస్తారు. ఇది గంగా డెల్టా ప్రాంతాలను అతలాకుతలం చేసింది. అత్యంత విధ్వంసకర ఉష్ణమండల తుఫాను ఇది. ప్రస్తుత బంగ్లాదేశ్‌తో పాటు భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌ను ఈ వరదలు నాశనం చేశాయి. ఈ టైఫూన్ దక్షిణ చైనా సముద్రంలో ఉద్భవించింది. ప్రభావిత ప్రాంతంలో కలకత్తా నగరం సహా బెంగాల్‌లోని జనసాంద్రత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 అడుగుల వరకు వరద నీరు చేరడంతో మొత్తం గ్రామాలు, పట్టణాలు మునిగిపోయాయి. ఈ వరదల కారణంగా 3లక్షల మంది చనిపోయారు.

బంగ్లాదేశ్‌లో లక్షల మందిని పొట్టనబెట్టుకున్న వరదలు:
1998 బంగ్లాదేశ్ వరదల్లో దాదాపు 3 లక్షల మంది చనిపోయారు. రుతుపవనాల వర్షాల కారణంగా గంగా, బ్రహ్మపుత్ర, మేఘన లాంటి ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహించాయి. హిమాలయాల ఎగువన ఉన్న హిమానీనదాలు ఏకకాలంలో కరిగిపోవడంతో వరద తీవ్రమైంది. వరద నియంత్రణ మౌలిక సదుపాయాలు సరిపోకపోవడం, నీటి పారుదల సరిగా లేకపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. వరదలు దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల మేర భూమిని ముంచెత్తాయి. ఇది బంగ్లాదేశ్‌లో మూడింట రెండు వంతులను ప్రభావితం చేసింది. కొన్ని ప్రాంతాల్లో 39 అడుగులు ఎత్తుకు వరదనీరు చేరుకోవడంతో మొత్తం పట్టణాలు, గ్రామాలు మునిగిపోయాయి.

Also Read: నెత్తుటి యుద్ధం వెనుక, అక్కరకు వచ్చే ఆవిష్కరణలు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *