Menu

World War 1 Inventions: నెత్తుటి యుద్ధం వెనుక, అక్కరకు వచ్చే ఆవిష్కరణలు!

Tri Ten B

ఈ రోజుల్లో శానిటరీ ప్యాడ్స్‌ లేని జీవితాన్ని ఊహించుకుంటేనే చాలామంది మహిళలకు భయం పడుతుంది. మహిళల శ్రేయస్సు, సాధికారతకు రుతుస్రావ ఆరోగ్యం, పరిశుభ్రత చాలా అవసరం. రుతుస్రావ పరిశుభ్రత కోసం తగిన సౌకర్యాలు లేని ప్రాంతాలు ఈ భూమ్మీద చాలానే ఉన్నాయి. అయితే ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఆర్థికంగా మహిళలు స్వాలంబన సాధించే విషయం శానటరీ ప్యాడ్స్‌ ఎంతగానో తోడ్పడ్డాయి. శానిటరీ ప్యాడ్స్‌ కనిపెట్టిన తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. మహిళలు ఉద్యోగాల్లో చేరటం తమ కాళ్ళ పైన నిలబడటం లో ఇది ఒక విధంగా ఈ ఆవిష్కరణ సహకారం అందించింది అనవచ్చు!

kotex

అయితే ఈ శానటరీ ప్యాడ్స్‌ ఐడియా ఎక్కడ నుంచి పుట్టిందో తెలుసా? కోట్లాది మంది జీవితాలను నాశనం చేసిన మొదటి ప్రపంచయుద్ధ కాలంలో పుట్టిన ఐడియా ఇది!

మొదటి ప్రపంచయుద్ధ సమయంలో బ్యాండేజీలకు వాడిన సెల్యూలోజ్‌ను పీరియడ్స్‌ సమయంలోనూ వాడవచ్చని ఫ్రెంచ్‌ నర్సులు గుర్తించారు.

1914 జులై 28న మొదలైన మొదటి ప్రపంచయుద్ధం నవంబర్ 11, 1918న ముగిసింది. ఈ కాలంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. అప్పటి అవసరాలకు తగ్గట్టుగా కొత్త కొత్త వస్తువులు పుట్టుకొచ్చాయి. అవి ప్రస్తుతం నిత్య జీవితంలో భాగంగా మారాయి. అటు సైన్స్‌కు సంబంధించి కూడా ఎన్నో కొత్త ఆవిష్కరణలకు బీజం పడింది మొదటి ప్రపంచయుద్ధ సమయంలోనే. ఇలా మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పుట్టిన అత్యంత ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలపై ఓ లుక్కేద్దాం!

Necessity is the mother of invention అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అది సరిగ్గా ఇక్కడ వాడొచ్చు. తప్పనిసరి అవసరాలు సరికొత్త ఆవిష్కరణకు ఆద్యం పోశాయి.

రిస్ట్ వాచ్:
చాలామంది చేతికి వాచ్‌(చేతి గడీయారం) పెట్టుకోని కనిపిస్తుంటారు. అయితే ఈ ట్రెండ్‌ స్టార్ట్ అయ్యింది వరల్డ్‌ వార్‌-1 సమయంలోనే..! మొదటి ప్రపంచ యుద్ధం కోసం ప్రత్యేకంగా చేతి గడియారాలను కనుగొనలేదు, కానీ వాటి వాడకం పెరిగింది మాత్రం ఆ కాలంలోనే. వాచ్‌ తయారీదారులు యుద్ధసమయంలో ఈ రిస్ట్‌ వాచ్‌లను ఎక్కువగా మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు. అంతకముందు చాలా వరకు వాచ్‌లను జేబుల్లో పెట్టుకోని టైమ్‌ చూసుకునేవారు. కానీ యుద్ధంలో ప్రతీ సెకన్‌ ముఖ్యమే.. అందుకే చేతి గడియారాలను తయారు చేశాయి కంపెనీలు. ఇలా ప్రతి నలుగురిలో ఒక సైనికుడు రిస్ట్‌ వాచ్‌ను ధరించాడు. అలా అక్కడి నుంచి ఎన్నో కోట్ల విలువ చేసే వాచ్ ల నుండి ప్రస్తుతం ప్రాణాలను సైతం కాపాడుతున్న రిస్ట్ స్మార్ట్ వాచ్ లు వాడుకలో ఉన్నాయి.

జిప్స్:
ప్యాంట్‌కైనా, షర్ట్స్‌కైనా, స్వెట్టర్స్‌కైనా చాలావాటికి జిప్‌ ఉంటుంది. ప్రైవేట్‌ పార్ట్‌ను కవర్‌ చేసే వాటిల్లో జిప్‌ కూడా ఒకటి. ఈ జిప్‌ తయారీ కూడా వరల్డ్‌వార్‌-1 టైమ్‌లోనే జరిగింది. యుద్ధం అంటే మన ఊరిలో చేసేది కాదు.. చాలా దేశాల్లో, విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడి చలిని తట్టుకునేందుకు జిప్‌ ఉపయోగపడింది. స్వీడన్‌లో పుట్టి అమెరికాకు వలస వచ్చిన గిడియాన్ జిప్‌లను డిజైన్ చేశాడు. అమెరికా సైన్యం ఈ జిప్‌లను యూనిఫాంలు, బూట్లలో చేర్చింది. ముందుగా నావికాదళంలో ఉపయోగించింది. యుద్ధానంతరం పౌరులు కూడా జిప్‌కు సంబంధించిన దుస్తులు ధరించడం మొదలుపెట్టారు.

స్టెయిన్‌లెస్ స్టీల్:
ఇప్పడు మనం ఉపయోగిస్తున్న గిన్నెలు, ఇతర వంట పాత్రలు, పైపులు ఎక్కువగా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌వే ఉంటాయి. అవి తప్పుబట్టవు కాబట్టి వాటినే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. వాస్తవానికి ఉక్కును ఎన్నో వేల ఏళ్ళుగా తయారు చేస్తూనే ఉన్నాం. దక్షిణ భారతంలో Wootz steel అనే ఉక్కును తయారు చేయబడింది. అయితే అసలు తుప్పు పట్టని ఇనుముకు బీజం పడింది కూడా వరల్డ్‌వార్‌-1 సమయంలోనే! బ్రిటిష్ సైన్యం తుపాకుల కోసం ఓ లోహాన్ని కనుగొనడానికి ప్రయత్నించింది.సషెఫీల్డ్ సంస్థలో మెటలర్జిస్ట్‌గా పనిచేస్తున్న బ్రెయర్లీని ఓ కఠినమైన మిశ్రమాలను కనుగొనమని అడిగారు. ఆ తర్వాత అతను స్టెయిన్‌లెస్ స్టీల్ రహస్యాన్ని కనిపెట్టాడు. తుప్పు పట్టిని ఉక్కు గా (restless steel) తీసుకొచ్చాడు. ఆ తర్వాత కత్తులు, ఫోర్కులు, స్పూన్లతో పాటు పలు వైద్య పరికరాల్లో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వాడకం పెరిగింది.

పైలట్ కమ్యూనికేషన్స్:
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, పైలట్లు ఒకరితో ఒకరు లేదా నేలపై ఉన్న వ్యక్తులతో మాట్లాడటానికి ఛాన్స్ లేదు. యుద్ధం ప్రారంభంలో, సైన్యాలు కమ్యూనికేట్ చేయడానికి కేబుళ్లపై ఆధారపడ్డాయి. అయితే జర్మన్లు బ్రిటిష్ కేబుల్ కమ్యూనికేషన్లను ట్యాప్ చేసే మార్గాలను కనుగొన్నారు. అటు అప్పటికి రేడియో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది కాని దాన్ని అభివృద్ధి చేయవలసి ఉంది. ఇక 1916 చివరినాటికి నిర్ణయాత్మక అడుగులు పడ్డాయి. పైలట్ల మధ్య వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ అందుబాటులోకి వచ్చింది.

ప్లాస్టిక్ సర్జరీ:

మొదటి ప్రపంచ యుద్ధ దళాలలో గాయాలను దృష్టిలో పెట్టుకోని వైద్యులు కళ్ళు, చెవి, ముక్కు, దవడ పునర్నిర్మాణ విధానాలను అభివృద్ధి చేశారు. హెరాల్డ్ గిల్లీస్, హెన్రీ పికెరిల్ అనే ఇద్దరు వైద్యులు ప్లాస్టిక్‌ సర్జరీ విధానాన్ని కనుగొన్నారు. రోగుల సొంత కణజాలాన్ని ఉపయోగించి ఈ సర్జరీలు చేశారు. 1920లో ప్లాస్టిక్ సర్జరీ ఆఫ్ ది ఫేస్ అనే పుస్తకాన్ని గిల్లీస్‌ ప్రచురించాడు. అంతముందు కూడా ప్లాస్టిక్‌ సర్జరీ విధానం అమల్లో ఉంది కానీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న సర్జరీ విధానం వలర్డ్‌వార్‌-1 నుంచి అందుబాటులోకి వచ్చింది.

మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు రెండు కోట్ల మంది చనిపోయారు అని అంచనా! మరి ఎంతోమంది గాయపడ్డారు ఆర్థికంగా,మానసికంగా ఎంతో కోల్పోయారు. వీరిలో 13 లక్షల మంది భారతీయులు కూడా సైనికులుగా యుద్ధంలో పాల్గొన్నారు. 74,000 పైచిలుకు ముంది చనిపోయారు. కానీ అదే యుద్ధం మనకు ఈ ఆవిష్కరణలు కూడా అందించింది అని చెప్పొచ్చు.

Also Read: లమకాన్‌.. విజ్ఞానానికి కేంద్రం.. ఒక్కసారైనా వెళ్లాల్సిన స్పాట్!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *