Menu

RSS During Emergency: ఎమెర్జెన్సీ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చేసింది ఇదే.. మరి ఉన్నట్టుండి రాజ్యాంగంపై ఆ కపట ప్రేమేందుకు?

Tri Ten B
dark period emergency

అది 1910వ దశకం.. అండమాన్‌ జైల్లో సావర్కర్‌ కాలం గడుతుపున్న కాలం.. బ్రిటీష్‌ బానిస సంకేళ్ల నుంచి ఇండియాను విముక్తి చేసేందుకు పోరాడిన వారిలో సావర్కర్ కూడా ఒకరు. అందుకే ఆయన్ను అండమాన్‌ జైల్లో పెట్టారు నాటి బ్రిటీష్ పాలకులు. అయితే సావర్కర్‌ ఒక వీరుడిలా జైలు నుంచి విడుదలవ్వలేదు.. ఆయనో పిరికివాడిలా రిలీజ్ అయ్యారు.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదుసార్లు బ్రిటీష్ పాలకులకు క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకోని జైలు నుంచి బయటకు వచ్చారు. ఇది ఓ వీరుడి లక్షణం కానేకాదు.. తనను ఉరి తీస్తున్నారన్న విషయం తెలిసి కూడా క్షమాభిక్ష పెట్టుకునే అవకాశం ఉన్నా ఆ పని చేయని భగత్‌సింగ్‌కు సావర్కర్‌కు చాలా తేడా ఉంది. అందుకే భగత్‌సింగ్‌ యావత్‌ దేశానికి ఓ హీరోలా మిగిలిపోయాడు.. ఇటు సావర్కర్‌ కేవలం ఒక వర్గానికి మాత్రమే వీరుడిలా కనిపిస్తున్నాడు. అది కూడా ఓ ఏజెండా కారణంగా, ఓ ప్రాపగండా కారణంగా..! జైలు నుంచి విడుదలైన తర్వాత ఇండియా తరుఫున ఒక్కసారి కూడా నిలబడని సావర్కర్‌ బ్రిటీష్‌ పాలకులకు అనూకులంగా నడుచుకోవడం ఆయన లొంగుబాటుతనానికి నిదర్శనం. అయితే కేవలం సావర్కర్‌ మాత్రమే ఇలా క్షమాభిక్ష పెట్టుకోని పిరికిపందగా మిగిలిపోలేదు. రాష్ట్రీయ స్వయం సేవక్‌(RSS) చరిత్ర చూస్తే క్షమాభిక్ష వారికి ఓ అలవాటుగా కనిపిస్తుంది. పోరాడాల్సిన సమయంలో క్షమించమని వేడుకోవడంలో వారిని మించిన వారు లేరనిపిస్తోంది..

అసలు రాజ్యాంగం ఇండియాకు సరిపోయేలా లేదు.. మనుస్మృతి నుంచి రాజ్యాంగాన్ని రూపొందించాల్సిందని చెబుతూ ఎన్నో ఏళ్ల పాటు రాజ్యాంగంపై బురద జల్లిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌

పదేళ్లగా బీజేపీ చేస్తున్నదేమిటి?
ప్రతీ ఏడాది జూన్ 25న ‘సంవిధాన్ హత్యా దివస్‌’గా జరుపుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన గెజిట్‌ కూడా జారీ చేశారు. రాజ్యాంగానికి ఏ మాత్రం విలువ ఇవ్వని, అసలు చాలా సంవత్సరాల పాటు రాజ్యాంగాన్ని గుర్తించని ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి పుట్టిన బీజేపీ ఇప్పుడు అదే రాజ్యాంగంపై కపట ప్రేమ చూపిస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగబద్దమైన సంస్థల స్వతంత్రను లాక్కొని ఈడి,సీబీఐ.. ఆఖరికి ఈసీని కూడా తమ చెప్పుచెతల్లో పెట్టుకున్న బీజేపీ పదేళ్లగా రాజ్యాంగాన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది.

పక్క దేశాల నుంచి అరువు తెచ్చుకున్న రాజ్యాంగం ఈ దేశానికి సరైంది కాదు, మనుషుల్ని వర్ణాలుగా విడగొట్టి,‌అందరూ సమానం కాదు అని చెప్పిన మను ధర్మశాస్త్రం నుంచి అవసరమైనవి రాజ్యాంగం తీసుకోవాలి అని చెప్పిన చరిత్ర ఆర్ఎస్ఎస్‌ది.

క్షమాభిక్షలు పెట్టుకోని వేడుకోలేదా?

1975-77 మధ్య ఇందిరా గాంధీ విధించిన ఎమెర్జెన్సీ ముమ్మాటికి రాజ్యాంగ విలువల ఉల్లంఘనే. తన పదవి కాపాడుకోవడం కోసం 21నెలల పాటు దేశాన్ని చిత్రహింసలకు గురి చేసిన ఇందిరా ఆ నాడు నిజంగానే రాజ్యాంగాన్ని హత్య చేసేందుకు ప్రయత్నించారన్నది నూటికి నూరుశాతం నిజమే కావొచ్చు. అయితే నాటి ఎమెర్జెన్సీలో నేటి బీజేపీ నాయకులు, నాటి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ఏం చేశారన్నదే అసలు ప్రశ్న. ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు నిజంగా ఎమెర్జెన్సీపై పోరాటం చేసిందా? లేదా సావర్కర్‌ లాగే క్షమాభిక్షలు పెట్టుకోని ఇందిరాను వేడుకుందా?

రాజ్యాంగ విలువలకు పాతర:
అది 1975.. జూన్‌ .. మెస్ బిల్లు పెంపును నిరసిస్తూ గుజరాత్ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం ఇతర రాష్ట్రాలకు చేరిన సమయం అది. తమ నిరసనలకు ఓ పెద్ద నాయకుడు కావాలని విద్యార్థులు భావించారు. జాతీయ స్థాయిలో ఉద్యమానికి నాయకత్వం వహించాలని జయ ప్రకాశ్ నారాయణ్ (జేపీ)ని కోరారు. దీంతో జేపీ విద్యార్థులతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. 1975 జూన్ 15న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన భారీ ర్యాలీలో ఇందిరాగాంధీ ఎన్నికను సవాలు చేస్తూ ప్రసంగించారు. జేపీ మాటలకు నాడు పోలీసులు, మిలటరీ సైతం కరిగిపోయింది. ఇందిరాకు వ్యతిరేకంగా మారిపోయింది. ఇదే సమయంలో అల్హాబాద్‌ హైకోర్టు ఇందిరాపై అనర్హత వేటు వేసింది. ఎన్నికల్లో రూల్స్‌ అతిక్రమించి ఇందిరా గెలిచారని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లారు ఇందిరా. అయితే జూన్ 24న అల్హాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఇందిరా అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఓవైపు జేపీ నడిపిస్తోన్న సంపూర్ణ క్రాంతి ఉద్యమం.. మరోవైపు కోర్టు తీర్పు. దీంతో ఇందిరా ఆర్టికల్‌ 352 అస్త్రాన్ని వినియోగించారు. దేశవ్యాప్తంగా ఎమెర్జెన్సీని విధించారు. ఇందిరాకు వ్యతిరేకంగా ఉన్నవారు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రతిపక్ష నేతలు ఇలా చాలా మందిని జైల్లో పడేసింది నాటి ఇందిరా ప్రభుత్వం. ఇలా అరెస్ట్‌ అయిన వారిలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలూ ఉన్నారు.

క్షమాభిక్ష పిరికిపంద చర్య:
21 నెలల ఎమెర్జెన్సీ కాలంలో జైలు నుంచే ఇందిరాపై పోరాడిన నేతలున్నారు. చాలామంది నిరాహారదీక్షలూ చేశారు. ఇందిరా నిరంకుశత్వానికి జైలు నుంచి కూడా ఎదురుతిరిగారు. కమ్యూనిస్టులు, విద్యార్థులు మొండిగా ఇందిరాపై పోరాడిన ఆ కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం తోకముడిచింది. మరోసారి క్షమాభిక్షనే నమ్ముకుంది. అప్పటి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ బాలాసాహెబ్ దేవరస్ ఇందిరాగాంధీకి క్షమాభిక్ష లేఖలు రాశారు. ఇలా చాలామంది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ఇందిరా క్షమాభిక్షతో జైలు నుంచి విడుదలై సైలెంట్‌ అయ్యారు. అటల్‌ బీహార్‌ వాజ్‌పెయి, అద్వాణి, అరుణ్‌ జైట్లీ మాత్రమే ఎమెర్జెన్సీ కాలం ముగిసే వరకు జైల్లో ఉన్నారు. ఇందులో వాజ్‌పెయి చాలా సమయంలో అనారోగ్యంతో ఆస్పత్రిలోనే గడిపారు.

ఎమెర్జెన్సీ కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఇందిరాపై పోరాడింది లేదు. ఎమెర్జెన్సీ విధింపుకు ముందు జరిగిన జేపీ సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో మాత్రమే ఆర్‌ఎస్‌ఎస్‌ పాల్గొంది. ఎమెర్జెన్సీ అరెస్ట్‌ల తర్వాత ఇందిరాకు వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ గళం విప్పింది లేదు. మరి నేటి బీజేపీ నేతలు ఎందుకింత హడావుడి చేస్తున్నట్టు? తమను తాముగా ఎమెర్జెన్సీ హీరోలగా చెప్పుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? ఉన్నట్టుండి రాజ్యాంగంపై ఈ కపట ప్రేమేందుకు?

Also Read: మనుషులు చేసిన దేవుళ్ల కోసం మూర్ఖపు చేష్టలు.. ఈ చావులకు బాధ్యులు ఎవరు?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *