అది 1980వ దశకం.. ఈనాడు రామోజీరావు పత్రీకా విలువలకు పాతరేసి కమ్మజపం అందుకున్న కాలం..! 1974లో కమ్యూనిస్టు సానుభూతిపరుల అక్షరాలతో మొదలైన ఈనాడు పత్రీకా ప్రస్థానం ఆ తర్వాత మొత్తానికే మారిపోయింది.. అప్పటివరకు కనిపించిన అభ్యుదయ భావాలు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావంతో ఈనాడులో కనుమరుగైపోయాయి. పక్కా బిజినెస్‌మ్యాన్‌గా మారిన రామోజీరావు తెలుగుదేశం పార్టీ గెలుపే ఎజెండాగా పత్రికను నడిపారు. దీంతో 1984లో ఉదయం పత్రిక పుట్టుకొచ్చింది. బడుగు బలహీన వర్గాల మౌత్ పీస్‌గా ప్రజల్లోకి దూసుకెళ్లింది. ప్రారంభమైన నెల రోజులకే 2,24,000 సర్క్యులేషన్ మార్క్‌ను టచ్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.
అక్షరాలకు అన్యాయం చేస్తూ అబద్ధాలతో పత్రికలు నడపడమన్నది తెలుగునాట బహూశ ఈనాడు నుంచే మొదలై ఉండొచ్చు.
మద్యపాన నిషేధం అందుకేనా?
ఈనాడులో పనిచేసి మానేసిన ఏబీకే ప్రసాద్, సినీ దర్శకుడు దాసరి నారాయణరావు నడిపిన పత్రిక ఉదయం. అప్పటికే అధికారంలోకి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ అండతో ఈ పత్రికను తొక్కడానికి రామోజీరావు విశ్వప్రయత్నాలూ చేశారు..! 1990ల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి చేతుల్లోకి ఉదయం పత్రిక వెళ్లిన తర్వాత రామోజీరావు మాస్టర్ ప్లానే రచించాడంటారు నాటి తరం జర్నలిస్టులు. మాగుంట ఆర్థిక మూలలను దెబ్బతీసేందుకు మద్యపాన నిషేధాన్ని ఎన్టీఆర్ 1994లో అమలు చేశారని చెబుతుంటారు. ఇలా ఉదయం పత్రికకు తాళాలు పడ్డాయి. ఈనాడు రాసిన కమ్మనైన అబద్ధాలను ఎండగట్టిన ఉదయం పత్రిక చివరకు ఆస్తమించాల్సి వచ్చింది. ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు మరణం తర్వాత ఆయనకు ఇస్తున్న మీడియా కవరేజ్ హర్షించదగినదే.. ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా తెలుగు మీడియా అంటే రామోజీరావుకు ముందు రామోజీరావు తర్వాత అని ఒప్పుకోని తీరాల్సిందే.. అయితే విమర్శలకు ఎవరూ అతీతులు కాదు.
రామోజీరావు జీవితంలో గెలుపోటములు ఉన్నట్టే వివాదాలూ ఉన్నాయి. ఓ వ్యక్తి మరణించినప్పుడు కేవలం ఆయన/ఆమె చేసిన గొప్ప విషయాలు గురించే మాత్రమే మాట్లాడాలన్న నిబంధన జర్నలిస్టులకేమీ లేదు. అంతర్జాతీయ పత్రికలు అలా చేయవు కూడా. ఓ వ్యక్తి జీవిత ప్రస్థానంలో సాధించిన విజయాలు ఉన్నట్టే వివాదాల గురించీ ప్రస్తావిస్తుంటాయి.
ఇవి జర్నలిస్టు విలువలు కావు కదా!
రామోజీరావు సినీ జీవితం, మార్గదర్శి చిట్ ఫండ్ స్కామ్ లాంటి విషయాలను కాసేపు పక్కనపెడదాం.! ఆయన మరణం తర్వాత ఎక్కువ మంది ‘అక్షరాల’ గురించే మాట్లాడుతున్నారు కాబట్టి అసలు అందులో అక్షర సత్యం ఎంటో తెలుసుకుందాం! 1982 నుంచి ఈనాడు పత్రిక కేవలం తెలుగుదేశం కోసం మాత్రమే పనిచేసిందన్నది నిజం కాదా? నాడు ఎన్టీఆర్‌కు అండదండలందించిన రామోజీరావు 1990వ దశకంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మారారు. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్న తర్వాత మారిన పరిణామాలతో చంద్రబాబు పక్షాన నిలబడ్డారు రామోజీ. నాటి వైస్రాయ్ హోటల్ ఘటనకు ప్లాన్ చేసిందే రామోజీరావని చెప్పే వారు కూడా ఉన్నారు. ఇదంతా ఎంతవరకు నిజమోనన్నది పక్కన పెడితే ఈనాడు పత్రిక మాత్రం కేవలం టీడీపీ కోసం రాతలు రాసింది. అందులో అబద్ధపు రాతలు కూడా ఉన్నాయని చాలా సందర్భాల్లో నిరూపితమైంది.
మరి రామోజీరావుకు అక్షర నివాళులు అర్పించడం ఎంత వరకు కరెక్టో ఇలా ఇస్తున్నవారికే తెలియలి. జర్నలిస్టు విలువలంటే చీర కట్టుకోని న్యూస్ ప్రజెంట్ చేయడం అనుకునే వారికి ఇంత కంటే చెప్పదేమీ లేదు కూడా!
చిట్ ఫండ్ స్కామ్ సంగతేంటి?
ఓ సాధారణ కుటుంబంలో, చిన్నాచితాక ఆస్తిపాస్తులతో పుట్టినవారు అంబానీలు, రామోజీలు అవ్వడం ఇండియాలో మాత్రమే జరుగుతుందానన్న భావన కలుగుతోంది. గుమస్తా ఉద్యోగంతో కెరీర్ మొదలుపెట్టిన రామోజీకి ప్రపంచంలో అతిపెద్ద ఫిల్మ్ సిటీ నడిపే అంత డబ్బు ఎక్కడిదో.. ఆ భూమిలన్నీ ఎవరివో..! మార్గదర్శి చిట్ ఫండ్ స్కామ్ ఎన్నో ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతోంది. మార్గదర్శిలో రామోజీరావు వాటా కేవలం 10రూపాయలేనన్న ప్రచారమూ ఉంది . మిగిలినవాట అంతా జీజే రెడ్డిదేనని.. ఆయనపై దేశద్రోహం కేసు పడడంతో జీజే రెడ్డి ఇండియాను విడిచి పారిపోయారని చెబుతుంటారు. ఆ తర్వాత మార్గదర్శిని తన గుప్పిట్లోకి తీసుకున్న రామోజీ వేలకోట్లకు పడగలేత్తారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఇదే విషయంలో జీజే రెడ్డి కుమారుడు యూరీ రెడ్డి కోర్టు గడప కూడా తొక్కారు.! ఇవే కాదు.. రామోజీరావు సామ్రాజ్య విస్తరణలో ఎన్నో అవినీతి కార్యకలాపాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున విమర్శలూ ఉన్నాయి. ఆయనపై ఎన్నో కేసులు కూడా నమోదయ్యాయి.. ఇవన్ని ఆయన చనిపోయినప్పుడు చర్చించాలనీ కాదు.. చర్చించకుండా వదిలియడం కరెక్టూ కాదు!
Also Read: జర్నలిస్టు విలువలను మంటగలుపుతున్న ‘అతి’వాద యాంకరింగ్!