Menu

All eyes on Rafah: ఇజ్రాయెల్‌ నరమేధం.. పాలస్తీనాలో ఏరులై పారుతున్న రక్తం.. అగ్రరాజ్యాల చోద్యం..!

Praja Dhwani Desk

Palestine vs Israel: స్వేచ్ఛ కోసం పోరాటం చేసేది ఒకరైతే.. కండకావరంతో, సామ్రాజ్యదేశాల అండతో యుద్ధానికి దిగేది మరొకరు. హమాస్‌పై ప్రతీకారం పేరుతో ఇజ్రాయెల్‌ సృష్టిస్తోన్న నరమేధంలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. పాలస్తీనా జాతి ప్రతిఘటనకు ప్రతిరూపమైన హమాస్‌ను ఓ ఉగ్రవాద సంస్థగా ప్రచారం చేస్తూ అమెరికా అండతో గాజా గడ్డపై ఇజ్రాయెల్‌ నెత్తుటి ప్రవాహానికి కారణమవుతోంది. ఇజ్రాయెల్‌ పాలకుల దుర్మార్గానికి పాలస్తీనా మరోసారి మారణ హోమాన్ని చూస్తోంది. ఏ సమయంలో ఏ బాం*బు నెత్తి మీద పడుతుందో తెలియదు.. ఎవరు ఎటు వైపు నుంచి దాడి చేస్తరో అర్థంకాదు.. ఆఖరికి ఆస్పత్రిల్లోని రోగులను కూడా వదలడం లేదు ఇజ్రాయెల్ సైనికులు. హమాస్‌ను హతం చేస్తామంటూ పాలస్తీనా పౌరుల ప్రాణాల్నీ తీస్తున్నారు. మానవ హక్కులను ఇజ్రాయెల్‌ సైనికులు ఇంతలా కాలరాస్తున్నా అగ్రదేశాలుగా చెప్పుకునే పలు దేశాలు మాత్రం ఇప్పటికీ పాలస్తీనాలో జరుగుతున్నదంతా హమాస్‌పై యుద్ధమేనంటున్నాయి.. పైగా ఇజ్రాయెల్‌ చేస్తున్నది ‘యుద్ధం పరిధి’లోనే ఉందని అమెరికా ఇప్పటికీ బుకాయిస్తూనే ఉంది.


రక్తం రుచిమరిగిన వారే రాజ్యాధిపతులా?
ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య అక్టోబర్‌ 7, 2023 నుంచి జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధంలో మే 28, 2024నాటికి గాజా, వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాల్లో దాదాపు 36 వేల మంది చనిపోయినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారని యూనిసేఫ్‌(UNICEF) చెబుతోంది. పసిబిడ్డల రక్తాలతో పాలస్తీనా గడ్డ తడవని రోజే లేదు. 2024 మార్చి 17నాటికి యూనిసేఫ్‌ లెక్కల ప్రకారం దాదాపు 13 వేల మంది చిన్నారులు ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించారు. మిగిలిన చిన్నారులు అనాధలగా మారారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ బిడ్డల వేదనను చూసి కరిగిపోని మనిషే ఉండడని అనుకుంటే మీకు అమెరికా, దాని మిత్రదేశాల ధనదాహాపు బుద్ధి తెలియదనే చెప్పాలి. అయినా యుద్ధంలో ఎంతమంది మరణిస్తే ఆ దేశాధినేత అంత గొప్పవాడు కదా… ఇది రాజుల కాలం కాదు.. కానీ ఆ రాజనీతి మాత్రం ఇంకా అలానే ఉంది.. అందుకే ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు ఇప్పటికీ పలు దేశాలకు వీరుడే..! అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు చట్టాలకు మాత్రం ఆయనో యుద్ధాన్మోది.. సొంత దేశంలోనే నెతాన్యహుపై తిరుగుబాటు జరిగే రోజు దగ్గరలోనే ఉందని ఇజ్రాయెల్‌లో ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలే స్పష్టం చేస్తున్నాయి.

ప్రతీకారం పేరుతో నరమేధం:
అక్టోబర్‌ 7, 2023న ముందుగా హమాస్‌ ఇజ్రాయెల్‌ స్థావరాలపై దాడి చేసిందని అందుకే తప్పంతా హమాస్‌దేనని పాశ్చాత్యా మీడియా ముందు నుంచి ప్రచారం చేస్తూ వస్తోంది. హమాస్‌ దాడిలో ఇజ్రాయెల్‌ పౌరులు చనిపోయిన విషయం నిజమే కావొచ్చు.. ఈ ఘటనను, ఆ మరణాలను ఎవరూ సమర్థించడంలేదు కూడా…! కానీ ఆ తర్వాత ప్రతీకారం పేరుతో గాజా గడ్డపై ఇజ్రాయెల్‌ చేసిన దారుణాలు, విధ్వంసాలు, నరమేధం ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనే. దీన్ని ప్రతీకారం పేరుతో కప్పిపుచ్చుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఇది కిరాతకమే అవుతుంది. ఇవాళ పాలస్తీనా పౌరులకు తిండి లేదు.. తాగడానికి నీరు దొరకడం లేదు.. వైద్యం అందడం లేదు.. ఇదంతా ఎవరి పాపం?

అయినా అంతా అక్టోబర్‌ 7 చుట్టూనే తిరుగుతున్నారు కానీ ఆ అక్టోబర్‌ 7 ఘటనకు కారణమైన విషయలేంటి? హమాస్‌ నిజంగా ఉగ్రవాద సంస్థేనా? అన్నెంపున్నెం ఎరుగని శిశువులను సైతం హతమార్చుతున్న ఇజ్రాయెలీ సైనికులు ఉగ్రవాదులు కాదా? అపార చమురు సంపదకు నిలయంగా ఉన్న పశ్చిమాసియాను తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే అగ్రదేశాల కపట బుద్ధి కారణం కాదా?

నిజానికి దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు అక్టోబర్‌ 7 అసలు కారణమే కాదు.. పాలస్తీనాలో నెత్తురు ఏరులై పారడానికి సామ్రాజ్యవాదమే కారణం.. ప్రపంచంపై పెత్తనం చెలాయించలానే అమెరికా ఆధితప్య ధోరణే కారణం.. మరి ఈ అక్టోబర్‌ 7 చుట్టూ ఆ మోజేందుకు? నిందంతా ఆ ఒక్క తేదీపైనే వేయడం న్యాయామా?

మానవ హక్కుల ఉల్లంఘన ఈ దేశాలకు పట్టదా?
పాలస్తీనాను ఒక సభ్యదేశంగా 2012వరకు గుర్తించని ఐక్యరాజ్యసమితి అమెరికా చెప్పు చేతుల్లో నడిచే ఓ కీలుబొమ్మ.. అయినా ఐక్యరాజ్యసమితి నిర్వహించే ఓటింగ్‌ల్లో ప్రపంచదేశాలు పాలస్తీనా వైపే ఉంటాయి. ఇటు ఇండియా సైతం నాటి నెహ్రూ నుంచి పాలస్తీనా పక్షానే నిలపడింది. అయితే ఇటివలీ కాలంలో ఇండియా ద్వంద్వ వైఖరిని పాటిస్తోంది. గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం మానవ హక్కుల మండలిలో ఏప్రిల్ 5న చేసిన తీర్మానానికి భారత్ డుమ్మా కొట్టడం మోదీ ప్రభుత్వ కపట బుద్ధికి నిదర్శనంగా చెప్పాలి. అయినా ఇండియాలోనే మానవ హక్కులకు చోటు కరువైపోతుందని విమర్శలు పెరుగుతున్న సమయంలో మోదీ ప్రభుత్వం నుంచి ఈ అడుగు ఊహించినదే.. మానవ హక్కుల కంటే మతం హక్కులే ఎక్కువని భావించే ఫాసిస్ట్‌ పాలన బీజేపీది!

india vs palestine vs hamas vs isarael

ఏకతాటిపైకి వస్తున్న పౌర సమాజం:
ఓవైపు అమెరికా, దాని మిత్రదేశాలు పాలస్తీనాను ఏకాకి చేసేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా మరోవైపు పౌర సమాజం మాత్రం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతోంది. మే 26, 2024న హమాస్‌పై ప్రతీకారం పేరుతో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 81 మంది సామాన్యులు చనిపోయినట్టుగా పలు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ దాడిని ఖండిస్తూ ఇండియా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రజలు పాలస్తీనాకు సంఘీభావంగా నిలుస్తున్నారు. ‘All eyes on Rafah’ హ్యాష్‌ట్యాగ్‌తో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పాలస్తీనాకు మద్దతు ప్రకటిస్తున్నారు.


ఆశ్రయిం ఇచ్చినవారే నిరాశ్రయులు:
1948 ముందు వరకు ఇజ్రాయెల్‌ అనే దేశమే లేదు.. యూదులపై నాజీల ఊచకోత సమయంలో వారంతా పాలస్తీనాలో రక్షణ పొందారు. క్రమక్రమంగా అరబ్బు నేలను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలు అమెరికాను ప్రపంచంలో బలమైన దేశంగా నిలబెట్టాయి. అమెరికా అండదండలతో యూదులు తమకు తాముగా ఇజ్రాయెల్‌ అనే పేరుతో ఓ దేశాన్ని ప్రకటించుకున్నారు.. అప్పటినుంచి పాలస్తీనా పౌరులకు నిలువనీడ లేకుండా పోయింది. జియోనిస్టుల భూకాంక్షకు హద్దే లేకుండా పోయింది. ఇజ్రాయెల్‌ దళల నుంచి తమను తాము రక్షించుకునేందుకు పొరుగు దేశాలైన ఈజిప్ట్‌, లెబనాన్‌, జోర్డాన్‌లో పాలస్తీనియన్లు తలదాల్చుకోవాల్సి వచ్చింది..

అమెరికాకు ఓటమి తప్పదా?
తమ మాతృభూమిపై మమకారం, తిరిగి దాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో పాలస్తీనియన్లు ఏడున్నర దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేశారు. పాలస్తీనా విమోచనానికి యాసర్‌ అరాఫత్‌ నాయకత్వంలో పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌(PLO) ఏర్పడింది. ఇది చాలా కాలం పాటు సాయుధ మార్గంలో పోరాటాలు చేసింది.. సంప్రదింపులూ చేసింది. అయినా ఫలితం దక్కలేదు.. ఈ క్రమంలోనే హమాస్‌ లాంటి గ్రుపులు పుట్టుకొచ్చాయి.. దీనికి పాలస్తీనియన్ల నుంచి గట్టి మద్దతు లభించింది. నిలువ నీడ కోసం వీధి పోరాటాలు చేసే ఇలాంటి సంస్థలను ఉగ్రవాద సంస్థలగా ముద్రించడంలో అందరికంటే ముందుండే అమెరికా ఆ పని చేయకనే చేసింది. అందుకే ఇజ్రాయెల్‌ వర్సెస్ హమాస్‌ యుద్ధంలో గత చరిత్ర తెలియనివారంతా ఇజ్రాయెల్‌ పక్షాన నిలపడుతూ వచ్చారు. ఓ ఉగ్రవాద సంస్థతో ఇజ్రాయెల్‌ సైన్యం యుద్ధం చేస్తుందని జరిగిన ప్రచారాన్ని నమ్మారు.. కానీ ఇప్పుడిప్పుడే జనాలకు అసలు విషయాలు తెలుస్తున్నాయి.. ఎవరు ఎలాంటి వారో అర్థం చేసుకోగలుగుతున్నారు.. అందుకే ఈ 7 నెలల యుద్ధం సమయంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య జనం పాలస్తీనా కోసం వినిపిస్తోంది.. ఇది అమెరికాకు పెద్ద ఓటమనే చెప్పాలి.. ముందుముందు మరిన్ని ఓటములను సూచననే భావించాలి..!

Also Read: కరుడుకట్టిన యుద్ధాన్మోది.. హిట్లర్‌కు ఏం తక్కువ కాదు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *