Menu

IPL Final: ఎవరు గెలవాలన్నా అదే కీలకం.. హైదరాబాద్‌, కోల్‌కతాలో కప్‌ కొట్టేది ఎవరంటే?

Tri Ten B
kolkata vs hyderabad

ఐపీఎల్‌ ఫైనల్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. టోర్నీలో అద్భుతంగా ఆడిన రెండు జట్లు ఫైనల్‌కు వచ్చాయి. లీగ్‌ స్టేజీ మ్యాచ్‌లను చూస్తే హైదరాబాద్‌ కంటే కోల్‌కతానే యమ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. అటు ప్లేఆఫ్‌ తొలి మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌పై గెలిచిన కేకేఆర్‌ ఫైనల్‌లో ముందుగా అడుగుపెట్టింది. కోల్‌కతాపై ఓటమితో రాజస్థాన్‌పై గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్‌కు వచ్చాయి. అంటే ఫైనల్‌ రసవత్తరంగా జరగడం ఖాయమే. అయితే క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ మాత్రం కేకేఆర్‌ గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు.

చెన్నై చెపాక్‌ వేదికగా జరిగిన రాజస్థాన్‌ వర్సెస్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లో అసలు డ్యూ ఫెక్టర్‌ పని చేయలేదు. దీంతో బ్యాటింగ్‌ చేయడం కష్టంగా అనిపించింది. స్పిన్నర్లకు బంతిపై పట్టు దొరికింది. ఫైనల్‌ జరిగేది కూడా అదే పిచ్‌పై కావడంతో పాటు ఆదివారం కూడా డ్యూ ఫెక్టర్‌ ఉండే అవకాశం లేదన్న విశ్లేషనలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే కేకేఆర్‌ జట్టులో ఉన్న నరైన్‌తో పాటు వరుణ్‌ చక్రవర్తికి ఇది అడ్వాంటేజ్‌ కానుంది. ఇటు హైదరాబాద్‌కు రాజస్థాన్‌పై మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మతో పాటు షెహబాజ్‌ అహ్మద్‌ అద్భుతంగా బంతితో మెరిశారు. దీంతో ఈ విషయంలో ఇరు జట్లు సమానంగా నిలుస్తున్నాయి.

మరోవైపు టాస్‌ కీలకం అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌. టాస్‌ గెలిచిన జట్టే మ్యాచ్‌ గెలిచే ఛాన్స్ ఉందంటున్నారు. ఎందుకంటే సెకండ్‌ బ్యాటింగ్‌ చేయడం కలిసి వస్తుందని వారి అభిప్రాయం. ఇక ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా అది వారికి మూడో ఐపీఎల్‌ టైటిల్‌ అవుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 2016లో ఐపీఎల్‌ గెలిచింది. 2009లో డెక్కన్ ఛార్జెర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ ట్రోఫి గెలిచింది. ఈ రెండు హైదరాబాద్‌ను రిప్రెంజెంట్‌ చేశాయి.. కానీ ఫ్రాంచైజీలు వేరు వేరు.. అంటే టెక్నికల్‌గా సన్‌రైజర్స్‌కు ఇప్పటివరకు ఒక్కటే ఐపీఎల్‌ ట్రోఫి ఉన్నట్టు లెక్క. ఓవరాల్‌గా హైదరాబాద్‌కు రెండు ట్రోఫిలు ఉన్నాయని అర్థం. అటు కోల్‌కతాకు 2012, 2014లో ఐపీఎల్‌ ట్రోఫి దక్కింది. ఈ రెండు గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్సీలోనే వచ్చాయి. 2024 సీజన్‌లో గంభీర్‌ కోల్‌కతాకు మెంటర్‌గా ఉండడం విశేషం.


కేకేఆర్ టీమ్‌-11 (అంచనా): రహ్మానుల్లా గుర్బాజ్‌ (wk), సునీల్.. నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (సి), నితీశ్ రానా, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్ దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి

కేకేఆర్.. ఇంపాక్ట్ ప్లేయర్: వైభవ్ అరోరా/సుయాష్ శర్మ

ఎస్ఆర్‌హెచ్ టీమ్‌-11 (అంచనా): అభిషేక్ శర్మ, ట్రావిస్ తల రాహుల్.. త్రిపాఠి, క్లాసెన్‌ (wk), నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, కమిన్స్ (సి), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్

ఎస్ఆర్‌హెచ్ ఇంపాక్ట్ ప్లేయర్‌: జయదేవ్ ఉనద్కత్/మయాంక్ మార్కెండే

Also Read: హెడ్‌కోచ్‌గా గంభీర్‌.. పక్కా జై షా స్క్రిప్ట్‌.. 3 నెలల ముందే మేటర్‌ తెలిసిపోయింది..!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *