Menu

World’s Deadliest Animal: ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మందిని చంపేస్తున్న భయంకరమైన జంతువు ఏంటో తెలుసా?

Tri Ten B
national dengue day

ప్రపంచంలో ప్రాణాంతక జంతువు ఏంటో తెలుసా? సింహం, పులి కాదు.. ఏనుగు అంతకన్నా కాదు.. కేవలం 2.5 మిల్లిగ్రాముల బరువుండే దోమ. అవును..! మన వీధిలోనే.. మన ఇంట్లోనే.. మన పడకమీదే.. మన చెవుల దగ్గర శబ్దం చేస్తూ చికాకు పుట్టించే దోమలు ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల కంటే ఎక్కువ మరణాలకు కారణమవుతున్నాయి. భారత్‌లోనూ దోమల బెడద చాలా ఎక్కువే. ముఖ్యంగా వర్షాకాలం వస్తుందంటే చాలు దోమలు ఇంట్లో తిష్ట వేసుకుంటాయి. కాస్త చిరుజల్లులు పడితే చాలు దోమలు ఇంట్లో మకాం వేస్తాయి.. రక్తాన్ని తాగుతాయి. అనేక వ్యాధులను తీసుకొస్తాయి.. అందులో మలేరియా, డెంగీ లాంటి తీవ్రమైన వ్యాధులు కూడా ఉన్నాయి. ప్రతీఏడాది ఇండియాలో మే 16న నేషనల్‌ డెంగీ డే(National Dengue Day)గా జరుపుకుంటున్నారు.

ఏటా పెరుగుతున్న కేసులు:
వర్షాకాలంలో ఇండియాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ డెంగీ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతుంటుంది. ప్లేట్‌లేట్స్‌ పడిపోయి ఆస్పత్రిపాలయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తుంటుంది. 2020లో తెలంగాణలో 2,173 డెంగీ కేసులు, 2021లో 7,135, 2022లో 8,972, 2023లో 7,894 కేసులు నమోదయ్యాయి. ప్రతీఏడాది జనవరి నుంచి జూలై వరకు డెంగీ కేసులు తక్కువగా ఉంటాయి. వర్షాకాలం మొదలైన తర్వాత అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కేసులు ఎక్కువగా రికార్డువుతాయి. ఇటు ఏపీలో 2020లో 925, 2021లో 4,760, 2022లో 6,391, 2023లో 5,936 డెంగీ కేసులు నమోదయ్యాయి.

dengue cases

అది అపోహ మాత్రమే:
అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్లు, కండరాలు, కీళ్లు, ఎముకల్లో నొప్పితో డెంగీ మొదలవుతుంది. డెంగీ సమయంలో నొప్పులు కొన్నిసార్లు చాలా తీవ్రంగా ఉంటాయి, దీనిని తరచుగా బ్రేక్-బోన్ జ్వరం అని పిలుస్తారు. డెంగీ బారినపడ్డ వారు ప్లేట్‌లెట్ కౌంట్‌ను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఇక ప్లేట్‌లెట్‌ కౌంట్‌ పెరగడం కోసం చాలా మంది ఫ్రుట్స్‌ తింటారు. అయితే ఓ పండు ప్లేట్‌లెట్‌ కౌంట్‌ను నేరుగా పెంచుతుందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రియ ఆధారాలూ లేవు. మంచి నీరు తాగుతూ హైడ్రేట్‌గా ఉండటంతో పాటు పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. బొప్పాయి, కివి లాంటి కొన్ని పండ్లలో విటమిన్-సీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డాక్టర్లు వీటిని డెంగీ టైమ్‌లో ఫ్రిఫర్ చేస్తారు. విటమిన్‌-సీ కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొంతమంది బొప్పాయి ఆకులను తినడం లేదా జ్యూస్‌ చేసుకోని తాగుతారు. దీన్ని వల్ల ప్లేట్‌లెట్‌ కౌంట్‌ పెరుగుతుందన్నది కేవలం అపోహ మాత్రమే!

Also Read: బానిస మనస్తత్వాలకు దారి తీస్తున్న ఈ జబ్బు గురించి తెలుసా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *