Menu

AP Politics: మూడు నాలుకల సిద్ధాంతం.. ముస్లిం రిజర్వేషన్లలో కూటమిది తలో మాట!

Praja Dhwani Desk
muslim reservations in andhra pradesh

Muslim Reservations in Andhra Pradesh: ముస్లిం రిజర్వేషన్లుపై బీజేపీ ఎంతో క్లారిటీగా ఉంది. ఈసారి(2024) కేంద్రంలో అధికారంలోకి రాగానే పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని బలగుద్ది చెబుతోంది. స్వయంగా ప్రధాని మోదీనే వివిధ రాష్ట్రాల్లో ప్రచారం సందర్భంగా ఈ మాట పదేపదే చెబుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ సీఎంగా ఉన్నప్పటి నుంచి అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లపై మోదీ చాలా సార్లు కామెంట్స్ చేశారు. సిద్ధాంతపరంగా ముస్లింలకు బీజేపీ అతి పెద్ద శత్రువు. అలాంటి బీజేపీతో జత కట్టిన చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఇది ఆయన సహజ గుణమే అయినా.. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేకపోయినా ఒకవేళ ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా అన్నదానిపై చర్చ జరుగుతోంది.

2019 chandrababu vs modi

కూటమి ఎజెండా స్వార్థమే:
కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా బీజేపీతో కూటమిలోనే ఉన్నా ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు అమలవుతాయని చంద్రబాబు ఎన్నికల ర్యాలీల్లో చాలాసార్లు చెప్పుకున్నారు. ఇటివలీ ‘న్యూస్‌ లాండ్రి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అంటే చంద్రబాబు మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టే లెక్క. అయినా వారు కలిసే ఉన్నారు. ఈ లెక్కన చూస్తే బీజేపీ-జనసేన-టీడీపీ కూటమికి ఓ ఉమ్మడి ఏజెండా అంటూ ఏది లేదని అర్థమవుతోంది. జగన్‌ను ఓడించడమే చంద్రబాబు-పవన్‌ లక్ష్యం.. రాష్ట్రంలో పవన్‌ను అడ్డం పెట్టుకోని హిందుత్వ భావజలాన్ని వ్యాప్తి చేస్తూ తమ పార్టీకి స్ట్రాంగ్‌ బేస్‌ ఏర్పారచుకోవడమే బీజేపీ టార్గెట్‌. ఇక్కడ ప్రజలు, వారి సమస్యలు నెగ్లిజబుల్‌. పైకి మాత్రం ప్రజల కోసమే పుట్టినట్టుగా చెప్పుకుంటారు.

చంద్రబాబుకు అంత అవసరం ఏంటి?
సర్వేల లెక్కలు, కొన్ని సంస్థల స్టడీలు జగన్‌ ఓడిపోతాడని చెబుతున్నాయి. ఇవన్ని పెయిడ్‌ సర్వేలా కాదా అన్నది అటు ఉంచితే ఏపీలో జగన్‌పై వ్యతిరేకత ఉందన్నది నిజమే. ఈ వ్యతిరేకతను క్యాష్‌ చేసుకునే సత్తా చంద్రబాబుకు ఉందో లేదో అయన భజన బృందానికే తెలియాలి. టీడీపీ ఒక్కటే జగన్‌ను ఓడించగలదన్న ధీమా వారిలో ఉన్నప్పుడు మరి పవన్‌, బీజేపీ అవసరం చంద్రబాబుకు ఏమోచ్చిందో తెలియదు.. బీజేపీతో పొత్తు కేసుల భయంతో కావొచ్చు.. జగన్‌కు అదే భయం ఉందని చెబుతుంటారు కదా..!

 

View this post on Instagram

 

A post shared by Newslaundry (@newslaundry)


అప్పుడు ఉగ్రవాది.. ఇప్పుడు విశ్వగురువు:
ఒకప్పుడు మోదీని ఉగ్రవాదితో పోల్చిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం దేశానికి విశ్వగురువు అవసరం ఉందని చెబుతున్నారు. 2014 నుంచి 2018 వరకు బీజేపీతో కలిసి తిరిగిన చంద్రబాబు ఆ తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోదీని ఎన్నో మాటలున్నారు. వ్యక్తిగతంగానూ టార్గెట్‌ చేశారు. టీడీపీ చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌తోనూ ఆనాడు చంద్రబాబు జత కట్టారు. ఇదంతా జరిగి ఐదేళ్లే అవుతుంది. ఇంతలోనే మోదీ ఏం పుణ్యం చేశారని మంచోడు అయిపోయాడో తెలియదు. పార్టీ ప్రయోజనాల కోసం, తన స్వార్థం కోసం బీజేపీతో జతకట్టిన చంద్రబాబు ఇప్పుడు మోదీని ఓ రేంజ్‌లో ఆకాశానికి ఎత్తేస్తుండడం విడ్డూరం.

Also Read: తెలంగాణ వారికి ఇది చేతకాదట.. ఏపీలో రాజకీయ వికృత క్రీడ!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *