Menu

Movie Review: ఫ్యాక్షన్ లేని సీమ కథ.. ఇందులో నటులు కాదు పాత్రల్లో గుర్తిండిపోతాయి..!

Praja Dhwani Desk

ఈ సినిమాను నేను ఇంకో ఇద్దరు మిత్రులు కలిసి. ప్రొద్దుటూరు నుంచి అనంతపురం కి, 150 km బైక్‌లో ట్రిపుల్ రైడింగ్ చేసి, వానలో తడుస్తూ, చలికి వణుకుతూ, ఉదయం 8 గంటలకు వేసిన ప్రివ్యూ కి టoచనుగా చేరుకొని.. రాము ఫ్రీ గా ఇచ్చిన టికెట్స్ తో సినిమాని చూశాము..

సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది డైరెక్టర్ వాసు సార్ తో చెప్పా. అదే ఇక్కడ రాస్తున్నా.

ముందు నాకు నచ్చిన విషయాలు.

ఇండి సినిమా అని చెప్పి నాలుగు కుల్లు జోకులు వెయ్యలేదు .

బూతులు మాట్లాడే స్పేస్ ఉన్నా మాట్లాడిoచలేదు.

గుర్తుండిపోయే పాత్రలను రాయడం.

ప్రేమ పాటలే కాదు ప్రేమించడానికి ఒక్క ఆడ కేరక్టర్ కూడా కనిపించదు ఈ సినిమాలో . రాయలసీమ లో ఒక థ్రిల్లర్ కథను తీయడం. గ్రేట్ అటెంప్ట్.

టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ దగ్గర నుండి సౌండ్ డిజైన్ వరకు అద్బుతం. ముఖ్యంగా సౌండ్ డిజైన్. నెక్స్ట్ లెవెల్. మన పెద్ద సినిమాల్లో కూడా అంత మంచి సౌండ్ డిజైన్ నేను చూడలేదు.

కేవలం టార్చ్ లైట్స్ తో(అవి కూడా సీన్ లో ప్రాపర్టీ నే) తీసిన నైట్ సీన్లు breathtaking. ముఖ్యంగా natural లైటింగ్ తో they create something magical. Kudos to dop anil mallella.

ఇక ఆఖరిగా యాక్టింగ్ విషయానికి వస్తె. అందరూ కొత్త నటులే కానీ వాళ్ళు నటులని మరిచిపోయి పాత్రల్లోనే గుర్తుంచుకుంటాం. రాము(సీనా) అండ్ వినయ్ (కొండి). చాలా రోజులు గుర్తుంటారు.

“Tecnically speeking, its a best crafted film”.
నాకు నచ్చని విషయాలు.

**Spoilers**
టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ, నాకు కథా గమనం, స్క్రీన్ ప్లే లో కొన్ని నచ్చలేదు.
స్ట్రాంగ్ అండ్ మెమరబుల్ క్యారక్టర్స్ క్రియేట్ చేసారు కానీ, కొన్ని క్యారక్టర్స్ కి జస్టిఫికేషన్ ఇవ్వలేదు.

కొండి గాడి charecter లో ఒక మిస్టరీ సస్పెన్స్ ఉంటుంది. అది ఆకరికి జస్టిఫై కాలేదు అనిపించింది.

అలాగే రూం లో ఎప్పుడు పడుకొనే ఉండే ఫ్రెండ్ కేరక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఇంక్కొన్ని సీన్లు పడుంటే బాగుండేది అనిపించింది.

ఫస్ట్ హాఫ్ కేరక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కి కొంచం ఎక్కువ టైం తీసుకున్నారు . త్వరగా స్టోరీ ముందుకు సాగదు. But కేరక్టర్ ని ఆడియన్స్ ఓన్ చేసుకోవాలనే అలా చేసారేమో.
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు అవసరం లేదు అనిపించింది.

All the fun is in 2nd half . And last 20 minutes was పైసా వసూల్.
Finally its a very passionate and original film. Do support originality.
ఫ్యాక్షన్ లేని సీమ కథ.
Experience something new.

Also Read: కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో సంకెళ్లు.. ఆ యువతి ఆలోచనలు ఎలా ఉంటాయ్ ?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *