Menu

Sudha Murthy: ఈ వలస పక్షులు కడిగిన ముత్యాలు.. ఒక్క నిర్ణయంతో తుడిచిపెట్టుకుపోయిన అవినీతి మరకలు!

Tri Ten B

Sudha Murthy to Rajyasabha: ఎవరైనా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని దేశద్రోహులు అనడం కమలనాథులకు, అఖండ భక్తులకు కొత్తేమీ కాదు. ఇది జగమెరిగిన సత్యం కూడానూ! అసలు బీజేపీపై విమర్శ చేస్తేనే కాదు.. వారికి నచ్చకపోతే చాలు.. సంబంధిత వ్యక్తిని పాకిస్థాన్‌ మద్దతుదారుడుగా జమ కడతారు. లేకపోతే లెఫ్టిస్ట్‌ అని అర్బన్‌ నక్స్‌లైట్‌ అని పేర్లు పెడతారు. ఇలా సంఘ పరివార్‌ బాధితుల్లో ఒకప్పుడు ఇన్ఫోసిస్‌ సుధామూర్తి కూడా ఒకరు. ఆమెను ఏకంగా తుక్డే తుక్డే గ్యాంగ్‌ అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ పత్రిక పాంచజన్య 2021 సెప్టెంబర్‌లో ఓ కథనాన్ని ప్రచురించింది. నిజానికి అది గెస్ట్ కాలమ్‌లోని కథనమే అయినప్పటికీ పాంచజన్య తన భావజాలానికి తగ్గట్టునే గెస్టులతో వార్తలు రాయించుకుంటుంది. ఇన్ఫోసిస్‌ని పాక్‌, చైనా గూఢచార్యులగా నిందించిన అదే ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఇప్పుడు సుధామూర్తికి అనుకూలంగా వార్తలు రాస్తోంది. ఆమెను రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడం, ప్రధాని మోదీ అభినందలు తెలపడం చూసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక్కసారిగా రూటు మార్చింది. సుధామూర్తిని ఆకాశానికి ఎత్తుతు కథనాలు అల్లుతోంది. దీన్నే మోదీ మాటల్లో చెప్పాలంటే హిపోక్రసీ అంటారు.


ఐఎస్ఐకి సపోర్ట్ ఇచ్చినట్టేనట:
ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్ ఉద్దేశపూర్వకంగా భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని, నక్సలైట్లు, వామపక్షాలకు సహాయం చేస్తోందని ఆర్‌ఎస్‌ఎస్‌ 2021 సెప్టెంబర్‌లో తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ సమయంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్‌గా సుధామూర్తి ఉన్నారు. ఆమె టార్గెట్‌గానే ఆర్ఎస్‌ఎస్‌ సోషల్‌మీడియాలోనూ విష ప్రచారం చేసింది. ఇన్ఫోసిస్‌లో పెద్ద పొజిషన్‌లో ఉన్నవాళ్లంతా బెంగాల్‌కు చెందిన మార్క్సిస్టులేనని రాసుకొచ్చింది. ఇన్ఫోసిస్ ఒక నిర్దిష్ట భావజాలానికి చెందిన వ్యక్తులను ముఖ్యమైన పదవుల్లో నియమిస్తుందని.. అలాంటి సంస్థకు ప్రభుత్వ టెండర్లు లభిస్తే చైనా, పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి సపోర్ట్ ఇచ్చినట్టే అవుతుందని అడ్డగోలు రాతలు రాసింది.


ప్లేటు తిప్పడంలో మాకు మేమే సాటి:
ఇన్ఫోసిస్ చారిటీ లబ్ధిదారుల్లో కుల విద్వేషాలను వ్యాప్తి చేసే కొన్ని సంస్థలు కూడా ఉన్నట్టు ఆనాడు చెప్పిన ఆర్‌ఎస్‌ఎస్‌ తాజా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత అసలేమీ అననట్టే ప్రవర్తిస్తోంది. దేశ వ్యతిరేక, అరాచక సంస్థలకు ఇన్ఫోసిస్ నిధులు ఇస్తుందంటూ నిరాధార ఆరోపణలు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకోని సుధామూర్తికి ఎలివేషన్లు ఇస్తుందో భక్తులే చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో ఇన్ఫోసిస్‌ అసలు పాల్గొనడానికే వీలు లేదని చెప్పిన కాషాయ పార్టీ ఇప్పుడమెను రాజ్యసభలోకి ఆహ్వానించడం ఎంత విడ్డూరమో కదా..!

ఇక ప్లేటు తిప్పడం రాజకీయనాయకుల కంటే దేశంలో ప్రజలకే బాగా అలవాటుగా మారింది. నిన్నటివరకు ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి వారానికి 70గంటల పని ఫార్ములాను వ్యతిరేకించిన వారిలో బీజేపీ మద్దతుదారులు కూడా ఉండి ఉండొచ్చు. సుధామూర్తిని బీజేపీ రాజ్యసభకు పంపుతుండడంతో ఇప్పుడువారంతా అదే ఫార్ములాను సమర్థిస్తున్నట్టు నటించే అవకాశాలు లేకపోలేదు.. ఇక నరనరానా కాషాయం నింపుకున్న వారు ఆవేశపడి, ఆరోగ్యాన్ని పాడు చేసుకునే విధంగా వీక్లి 70 గంటలు పని చేయవచ్చు. ఇదంతా వారి ఇష్టంలే కానీ.. ఆఫీస్‌లో బాసులు కూడా టీమ్‌మెట్స్‌ని వారానికి 70గంటలు పనిచేయమని చావగొట్టకుండా ఉంటే చాలు!

Also Read: ఛాయా మర్మం.. లింగంపై స్థంభం నీడ మిస్టరి ఏంటి? ఇది దేవుడి మహిమేనా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *