Menu

Forgiveness: క్షమాపణ అడగలేదు.. అయినా క్షమించాల్సిందే.. ఎందుకో తెలుసుకోండి!

Tri Ten B

క్షమాపణ ఎందుకు ముఖ్యం: మనసు నొప్పిస్తారు..బాధపెడతారు.. ఏడిపిస్తారు.. వెక్కివెక్కి ఏడ్చేలా చేస్తారు.. చివరకు క్షమాపణ కూడా చెప్పరు! తప్పంతా మనదేనని మనకి మనమే అనుకునేలా.. ఎక్కడెక్కడో తిరిగి మనమే మళ్ళీ వారి చుట్టూ చేరేలా చేసుకుంటారు. స్నేహితుల దగ్గర నుంచి ప్రేయసి, ప్రేమికుడు వరకు ఇలాంటి వారు మన జీవితంలో ఎంతో మంది ఎదురవుతారు. అయితే వీరిలో కొందరు జీవితాన్ని అస్తవ్యస్థం చేసే తప్పులు చేస్తారు. మన జీవితమే తలకిందులయ్యే పరిస్థితిని తీసుకొస్తారు. అయినా క్షమించాల్సిందేనా? తిరిగి వారిని జీవితంలోకి ఆహ్వానించాల్సిందేనా? ఏం చేయాలి?

ఒక వ్యక్తి ని క్షమించాలి అనుకున్నప్పుడు అవతలి వ్యక్తి నుంచి క్షమాపణ వచ్చే వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. మనమే మనస్ఫూర్తిగా క్షమించాలి అంటే ఆ ఆలోచన ఉండాలి. ఈగో సమస్యలా చూడాల్సిన అవసరం లేదు.

రెండు వేరువేరు:

క్షమించడానికి, సయోధ్యకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఇది తెలియక చాలామంది జీవితంలో చేసిన పొరపాట్లే చేస్తుంటారు. ఒకరి కారణంగా ఎంతో వేదన అనుభవించి మళ్ళీ వారి గూటికే చేరతారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. క్షమించడం వేరు.. సయోధ్య వేరు. చాలామంది క్షమించడానికి అర్థం తిరిగి ప్యాచ్ అప్ అవ్వడం అనుకుంటారు. ఇక్కడే జీవితం మళ్లీ అగాధంలోకి వెళ్తుంది. ఒక వ్యక్తిగా ఎదగడానికి, మానసికంగా ధృడంగా మారడానికి క్షమించడం చాలా అవసరం. ఇది సైకాలజిస్టులు చెబుతున్న మాట. ఎందుకంటే క్షమించడం వల్ల పగ, ప్రతీకారల లాంటి ఆలోచనలు పోతాయి. ఇది మనసును తేలిక చేస్తుంది..శాంతపరుస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్షమాగుణానికి మించిన గుణం ఈ ప్రపంచంలో లేదని అందుకే చెబుతుంటారు. అయితే ఈ క్షమాపణ సంబంధిత వ్యక్తితో సయోధ్యకు దారితీయకూడదు.

క్షమించే స్వేచ్ఛ మనదే.. సయోధ్య మన చేతిలో లేదని తెలుసుకోండి.. అది రెండు వైపుల నుంచి రావాలి.. క్షమించేశా కదా అని సయోధ్యకే ప్రయత్నిస్తే అది మొదటికే మోసం వస్తుంది.

అప్పుడే ప్రశాంతత:

క్షమించడమన్నది అంతర్గత ప్రక్రియ.. మనం క్షమించమని సంబంధిత వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు. అవతలి వ్యక్తి మనకు హాని తలపెట్టినప్పుడు వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూడడం మన మానసిక ఆరోగ్యాన్ని నెగిటివ్‌గా ప్రభావితం చేస్తుంది. ప్రతీకార ఆలోచనలు మన ఎదుగుదలకు అదిపెద్ద ఆటంకాలు. మనసంతా పగతోనే నిండి ఉంటే ఏ పనీ ముందుకు కదలదు. అవతలి వ్యక్తి సారీ చెప్పాలన్న ఆలోచన కూడా రావాల్సిన అవసరం లేదు. క్షమాపణ అడగడం మంచి విషయమే.. ఇది ఎవరూ కాదనలేని నిజం..అయితే ఆ క్షమాపణ కోసం ఎదురుచూడడం సంకుచిత మనస్తత్వానికి చిహ్నం. క్షమాపణ చెప్పినా చెప్పకున్నా మన కోసం మనం సంబంధిత వ్యక్తిని క్షమించి తీరాల్సిందే. అప్పుడే ఆనందం.. ప్రశాంతత!

Also Read: ఎవరూ వినని,అర్థం చేసుకొని గోడు!

 

 

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *