Menu

Demise*xuality: ఎవరూ వినని,అర్థం చేసుకొని గోడు!

Tri Ten B
Demisexuality is described as “a sexual orientation defined by a lack of sexual attraction towards other people unless there is an existing emotional and romantic connection. The occurrence of sexual desire is dependent on the closeness of the relationship, as opposed to an initial attraction.”

What is Demisexuality: కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిలను, అబ్బాయిలకు అమ్మాయిలను చూస్తే కోరిక కలుగుతుంది. మరికొంతమంది అబ్బాయిలు అబ్బాయిల పట్ల ఆకర్షితులవుతారు.. ఇంకొందరు అమ్మాయిలు అమ్మాయిల పట్ల అట్రాక్ట్‌ అవుతారు. ఇక ట్రాన్స్‌ కేటగిరి ఎలాగో ఉంది. అటు వయసుతో సంబంధం లేకుండా తమకంటే ఎంతో పెద్దవారి పట్ల మోహంతో ఉండేవారు కూడా మనకళ్ల ముందు కనిపిస్తూనే ఉంటారు. అటు ఆటోసె*క్సువల్స్‌ కూడా ఉంటారు. వీరు తమని తామే ఇష్టపడతారు. తమను తాము చూసి మాత్రమే ఆకర్షితులవుతారు. అద్దంలో ముఖాన్ని చూసుకోని కోరికను ఊహించుకుంటారు. సెక్సువల్‌ ఓరియన్‌టెషన్లు ఎన్ని రకాలో చెప్పడం కష్టం. ప్రస్తుతానికి 16 సె*క్సువల్‌ ఓరియన్‌టెషన్ల గురించి క్లియర్‌కట్‌ అనాలిసిస్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటి డెమిసె*క్సువాలిటీ. దీన్నే కొంతమంది అసెక్సువాలిటీ అని అంటుంటారు. నిజానికి రెండు వేరువేరు. ఎలాంటి సెక్సువల్‌ ఫీలింగ్స్‌ లేకపోతే అది అసెక్సువాలిటీ కిందకు వస్తుంది. అటు డెమిసె*క్సువల్స్‌కి అందరిలాగే కోరికలు ఉంటాయి. అయితే అది కొందరితోనే ఉంటాయి..!

Demisexuality: The Gray Area of Asexuality

డెమిసెక్సువల్స్‌కి ఎవరిపై ఫీలింగ్స్‌ కలుగుతాయి?
అమ్మాయిల్లో, అబ్బాయిల్లో శరీర ఆకృతి బాగుంటే వారిని చూడగానే మిగిలినవారు అట్రాక్ట్ అవ్వడమన్నది సహజంమైన ఫీలింగ్‌గా సమాజం డిక్లేర్ చేసింది. కేవలం శరీర ఆకృతి అనే కాదు.. ఇలా ఆకర్షితులవడానికి అనేక ఫ్యాక్టర్లు ఉంటాయి. కొంతమందికి ఇతరుల నవ్వు, కళ్లు.. ఇలా ఎవరి సె*క్స్‌ అప్పిల్‌ ఇంట్రెస్ట్‌ వారిది. ఇలా చూడగానే ఏదో ఒక ఫీలింగ్‌ కలగడమన్నది సాధారణమే. బాడీని చూసి మోహించడాన్ని ప్రైమరీ సెక్సువల్‌ అట్రాక్షన్‌గా చెబుతారు. ఇక సెకండరీ సెక్సువల్‌ అట్రాక్షన్‌ భావోద్వేగాలకు సంబంధించింది. అంటే అవతలి వారిలో ఏదో ఒక లక్షణం నచ్చి వారిని ఇష్టపడడం, కామించడం సెకండరీ సె*క్సువల్‌ అట్రాక్షన్‌ కిందకి వస్తుంది. డెమిసె*క్సువల్స్‌ ఈ కేటగిరిలోకే వస్తారు. సహజంగా వీరికి ఎవరిపైనా లైంగిక కోరికలు అంత ఈజీగా రావు. చాలా క్లోజ్‌ అయినవారితోనే ఏదైనా చేయాలనిపిస్తుంది. ఎమోషనల్‌ బాండింగ్‌ లేకుండా ఎవరికీ కూడా ముద్దు పెట్టాలని కూడా అనిపించదు.

What is demisexuality?

ఎవరో తెలియని వారి పట్ల లైంగిక వాంఛ ఎలా?
కంటికి అందంగా కనిపించేవారిని చూడగానే బాడీలో సంబంధిత హోర్మన్లు రిలీజ్ అవుతాయి. డెమిసె*క్సువల్స్‌కు కూడా అలానే అవుతాయి. అయితే పరిచయం లేని వారితో, అపరిచితులతో వీరు శృంగారం చేయడానికి ఆసక్తి చూపరు. ముందు ఫ్రెండ్‌షిప్‌ తర్వాత రిలేషన్‌షిప్‌ అన్నట్టు ఉంటుంది వీరి ఆలోచన. అది కూడా మానసికంగా, ఎమోషనల్‌గా కనెక్ట్ అయితేనే వీరు రొమాన్స్‌ చేస్తారు. డెమిసె*క్సువల్స్ వారి జీవితకాలంలో కొద్దిమంది వ్యక్తులకు మాత్రమే ఆకర్షితులవుతారు. వారితో మాత్రమే శృంగారంలో కానీ రొమాన్స్‌లో కానీ పాల్గొంటారు. ఎవరో తెలియని వారి పట్ల ఇతరులకు లైంగిక వాంఛ ఎందుకు కలుగుతుందో కూడా వీరికి అర్థంకాదు. కానీ అది సాధారణమేనన్న విషయాన్ని మాత్రం గ్రహిస్తారు. అందరితోపాటే నడుచుకుంటారు. అటు ఇతరులు మాత్రం వీరిని అర్థం చేసుకోవడంలో ఎక్కువగా విఫలమవుతారు. ఎమెషనల్‌ బాండింగ్‌కి శృంగారంతో ఏం సంబంధమన్నది చాలా మంది వాదన. వీరి వాదనను సైన్సు తొసిపుచ్చుతుంది. మనుషుల ఆలోచనల పరిధి ఎంతైనా వారి మనసులు దాటి బయటకు రాదు కదా..!

Also Read: అతను ఊ అంటాడు.. ఆమె నో అంటుంది.. పడక గదిలో చిచ్చు పెట్టింది ఎవరు ?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *