Menu

Pawan Kalyan: ప్రేక్షకులు తప్ప ప్లేయర్లు లేని కెప్టెన్.. జనసేనాని చేసిన ఘోర తప్పిదం ఇదే!

Praja Dhwani Desk
janasena tdp seat sharing

TDP-Janasena Alliance: క్రికెట్‌ టీమ్‌లో ఎవరూ లేకుండా 11మంది ఆటే నేనే ఆడేస్తా అంటే కుదరదు. ఇద్దరు, ముగ్గురు, నలుగురితో ఆడి గెలిచేస్తానన్నా అది జరగదు. కెప్టెన్ అనేవాడు ముందు టీమ్‌ని బిల్డ్‌ చేసుకోవాలి. కీపింగ్‌, బౌలింగ్‌ ఓకే సమయంలో వెయ్యడం అవ్వని పని. ఈ విషయం పవన్‌(Pawan Kalyan)కు తెలిసినట్టు లేదు. జనసేన టీమ్‌ ఏర్పడి 10ఏళ్లు గడిచిన పట్టుమని 10మంది ప్లేయర్లు కూడా లేరంటే ఈ తప్పు పవన్‌ది కాకపోతే ఇంకెవరిది? అందుకే చంద్రబాబు-పవన్‌ పొత్తులో టీడీపీ అధినేతదే పైచేయిగా మారింది. టీడీపీ(TDP) ఇచ్చిన సీట్లతోనే జనసేన(Janasena) సర్థుకోని, సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా తన సొంత కులమైన కాపుల ఆగ్రహానికి పవన్‌ గురికావాల్సి వచ్చింది. అటు పవన్‌ హార్డ్‌కోర్‌ అభిమానులు సైతం పైకి బాధపడనట్టే నటిస్తున్నా.. లోలోపల మాత్రం తీవ్ర వేదనకు గురవుతున్నారు. పవన్‌ అన్నని సీఎంగా చూసే అవకాశం ఈసారికి కూడా లేదన్న విషయాన్ని తలుచుకోని బాధపడుతున్నారు.

టైమ్‌వేస్ట్‌.. టైమ్‌ పాస్‌:
2014లో ఎన్నికలకు ముందు జనసేన స్థాపించిన పవన్‌ అప్పట్లో చాలా తెలివిగా వ్యవహరించాడని విశ్లేషకులు సైతం మెచ్చుకున్నారు. తొందరపడి పోటిలోకి వెళ్లకుండా వ్యూహాత్మకంగా టీడీపీ-బీజేపీ కూటమి జెండాను మోశాడు పవన్‌. 2014-19మధ్య ఐదేళ్లలో పవన్‌ క్యాడర్‌ని సృష్టించుకోవడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అదే సమయంలో గెలుపు గుర్రాలనూ సిద్ధం చేసుకోలేకపోయాడు. తనని చూసి తన అభ్యర్థులకు ఓట్లు పడిపోతాయని భ్రమపడ్డాడు. అభ్యర్థులు సంగతి అటు ఉంచితే స్వయంగా పోటి చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు పవన్‌.

ఇంత ఈగో అయితే ఎలా బ్రదరూ?
సరే జరిగిపోయిందేదో జరిగిపోయిందని సర్థిచెప్పుకున్నారు పవన్‌ ఫ్యాన్స్‌. గెలుపుకు ఓటమే తొలి మెట్టు అని మోటివేట్ చేసుకున్నారు. అయితే పవన్‌ తర్వాత కూడా మారింది లేదు. ఈ ఐదేళ్లలో ప్లేయర్లను సృష్టించుకోలేదు. సేల్ఫ్‌గా ఎమెర్జ్‌ అయిన కొందరి లీడర్లను పట్టించుకోలేదు. నాయుకుడనేవాడు సెల్ఫ్‌ సెంట్రిక్‌గా ఉంటే ఎలాంటి వైఫల్యాలను ఎదుర్కొవాల్సి వస్తుందో పవన్‌ చూపించి చెప్పవచ్చు. పవన్‌ కోసం రేయింబవళ్లు కష్టపడిన నాయకులున్నారు. వారిని కూడా పవన్‌ పట్టించుకున్న పాపాన పోలేదు. వారిని ప్రమోట్ చేయలేదు. ఎంత సేపు తన గురించి చెప్పుకుంటాడే కానీ తన ప్లేయర్ల గురించి మాట్లాడడు. ఉన్నా నలుగురైదుగురు ప్లేయర్లను కూడా తొక్కి ఉంచితే ఎలా పవనూ..!

పట్టరాని బాధ:
అటు నియోజవర్గంలో డబ్బు ఖర్చు చేసి, జనసేన జెండాలు మోసి.. కావాల్సినప్పుడు ‘పసుపు’ పూసుకోని.. అవసరమైతే కాషాయం ధరించిన నాయకులను పవన్‌ నట్టేటా ముంచాడు. అందుకే కష్టపడి పని చేసి, సీటు ఆశించిన కొందరు జనసేన నేతలు తీరా అది జరగకపోయే సరికి వెక్కివెక్కి ఏడ్చారు. బాధతో బైకులకు అంటించున్న పవన్‌ బొమ్మలను కూడా చించేశారు. ఇదంతా ఆయనపై కోపంతో చేయలేదు.. బాధతోనే చేశారు..!

‘తమ్ముడు..’ ఇవి సరిపోతాయి:
ఏపీలో 175 నియోజవర్గాలుంటే పవన్‌కు 175మంది అభ్యర్థులను క్రియేట్ చేసుకోవడానికి 10ఏళ్లు సరిపోలేదు. అందుకే చంద్రబాబు 24తో సరిపెట్టుకోమన్నాడు. అటు కాపులు 50-60 ఇస్తారని ఆశపడ్డారు. పవన్‌ను సీఎంగా చూడాలనుకున్నారు కానీ వాస్తవాన్ని గుర్టుపట్టలేకపోయారు. చంద్రబాబు అన్ని ఆలోచించే పవన్‌కు 24 ఇచ్చారు.. అంతకంటే ఎక్కువిస్తే అది మొదటికే మోసం రావొచ్చు.. జగనే మళ్లీ గెలవచ్చు..అందుకే టీడీపీ జాగ్రత్త పడింది. 24 సీట్లు సరిపోతాయని పవన్‌కు నచ్చచెప్పింది.

Also Read: వివాహాలు కావు.. వ్యాపారాలు..! ఇక్కడ అమ్మకానికి పెళ్లికొడుకులు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *