Menu

Suhani: దంగల్ ఫేమ్ సుహానీ మృతికి కారణమైన ఈ వ్యాధి గురించి తప్పక తెలుసుకోండి!

Praja Dhwani Desk
Aamir Khan’s on-screen daughter in Dangal, Suhani Bhatnagar passed away on Saturday morning at the age of 19.

Dermatomyositis: What Is It? 2016లో రిలీజైన బ్లాక్ బస్టర్ మూవీ దంగల్‌(Dangal)లో బబితా ఫోగట్ చిన్ననాటి పాత్ర పోషించిన నటి సుహానీ భట్నాగర్(Suhani Bhatnagar)కేవలం 19 ఏళ్ల వయసులోనే ప్రపంచానికి వీడ్కోలు పలకడం బాలీవుడ్‌ను విషాదంలో ముంచేసింది. జాతీయ రహదారిపై ఉన్న అజ్రోండ శ్మశానవాటికలో సుహానీ అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు మృతితో సుహానీ తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు తన కూతురికి మొదటి నుంచి మోడలింగ్, యాక్టింగ్ అంటే ఇష్టమని తల్లి పూజా భట్నాగర్ చెప్పారు. దంగల్‌ మూవీ కోసం 1,000 మంది పిల్లల్లో తన కుమార్తెతో పాటు మరో అమ్మాయిని ఎంపిక చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత దంగల్ సినిమాలో బబితా ఫోగట్ పాత్రలో నటించిన సుహానీ చనిపోయేనాటికి మాస్ కమ్యూనికేషన్ (జర్నలిజం) కోర్సు చేస్తోంది ఫరీదాబాద్ లోని మానవ్ రచనా ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ లో రెండో సంవత్సరం చదువుతోంది. చదువు పూర్తయిన తర్వాత నటజీవితాన్ని కొనసాగించాలనేది ఆమె కల. కానీ అది నెరవేరకుండానే తుదిశ్వాస విడవడంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

సుహానీ భట్నాగర్

రెండు నెలల క్రితం అకస్మాత్తుగా శరీరంపై సుహానీకి దద్దుర్లు మొదలయ్యాయి. ముందుగా ఎన్ని ఆస్పత్రులు తిరిగినా సుహానీకి శరీరంలో ఏం జరుగుతుందో డాక్టర్లు చెప్పలేకపోయారు. తర్వాత కొన్నాళ్లకు ఆమెకు డెర్మటోమైయోసిటిస్(Dermatomyositis) అనే వ్యాధి ఉందని చెప్పారు.


డెర్మటోమైయోసిటిస్ అంటే?
ఇది చాలా భిన్నమైన వ్యాధి. చర్మంతో పాటు కండరాలను ప్రభావితం చేసే వ్యాధి. ఈ వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కేటగిరీలో ఉంచారు.వీటిలో మన రోగనిరోధక వ్యవస్థ భిన్నంగా పనిచేస్తుంది. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గి వ్యాధులతో పోరాడలేకపోతుంది. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. డెర్మటోమైయోసిస్ వ్యాధి మొదటి లక్షణం చర్మంపై కనిపిస్తుంది. క్రమంగా చర్మం నల్లబడటం ప్రారంభమవుతుంది. అదే సమయంలో దద్దుర్లు కూడా రావడం మొదలవుతుంది. దీని ప్రభావం ఎక్కువగా కళ్ల చుట్టూ, ముఖంపై కనిపిస్తుంది. ఈ దద్దుర్లు దురదకు కారణమవుతాయి. ఈ వ్యాధి ఉన్నవారు కూర్చోవడం, బరువులు ఎత్తడం, మెట్లు ఎక్కడం, దిగడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏ పనీ చేయకుండానే అలసటగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఎగువ శరీరం, కండరాలు క్రమంగా బలహీనపడటం ప్రారంభిస్తాయి. సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. ఇప్పటివరకు ఈ వ్యాధి సోకడానికి గల కారణాలపై ఎలాంటి స్పష్టతా లేదు. జన్యుశాస్త్రం, కొన్ని రకాల మందులు, వైరస్ ఇన్ఫెక్షన్లు, ధూమపానం లాంటివి దీనికి కారణం కావచ్చని చెబుతుంటారు.

Also Read: వివాహాలు కావు.. వ్యాపారాలు..! ఇక్కడ అమ్మకానికి పెళ్లికొడుకులు!

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *