Menu

ప్రేమకు ఖరీదు! వాలెంటైన్స్ డే పేరుతో మార్కెట్లో దోపిడీ.

Praja Dhwani Desk

ఫిబ్రవరి 14. ఆరోజు వస్తేనే ప్రేమికుల వలపు చేష్టలు, ప్రేమ అందుకోవడానికి ఒంటరి పక్షులు పడే పాట్లు. అబ్బో అన్ని ఇన్ని కావు. అనేక సాహసాలు , ఇష్టాల కోసం పడే కష్టాలు, ఒకరినొకరు ఆకట్టుకోవడానికి చేసే ఫీట్లు, పెద్దవారికి తెలిసిన వారికి దొరకకూడదు అని దాగుడు మూతలు. ఇటువంటి ఎన్నో యాక్షన్లు ఆరోజు చూస్తూనే ఉంటాం. అయితే వాలెంటైన్స్ డే అర్థాలే మార్చేలా ఇవాళ అది ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది.

 

ప్రేమించడానికి కూడా డబ్బు కావాలి! 

ప్రేమకు గుర్తుగా చూడాల్సిన రోజును తడిసిమోపెడు అయ్యే వేదికగా మార్చేశారు. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రేమ వ్యక్తం చేయడానికి, అది అందుకోవడానికి కూడా డబ్బు ఉండి తీరాలి అనే పరిస్థితి తయారైంది. గిఫ్ట్ లు, జ్యూవెలరీ, ఫైన్ డైనింగ్ ,ఖరీదైన పెర్ఫ్యూమ్, చాక్లెట్స్ ఇవన్నీ కొని ఇస్తే కానీ గడవట్లేదు. పైగా జనాల మైండ్ సెట్ ను ఎలా ప్రభావితం అయ్యాయి అంటే, ఇవన్నీ ఉంటేనే ప్రేమించడానికి అర్హతలా చూస్తున్నారు. జీవితంలో తోడు కావడానికి ప్రేమిచుకుంటారా,ఇలా అవసరం లేని దుబారా ఖర్చులు కోసమా అనే డౌట్ వస్తుంది.

అమెరికాలో జాతీయ రిటైల్ సమాఖ్య లెక్కల ప్రకారం వాలెంటైన్స్ డే మార్కెట్ 25,000 కోట్ల డాలర్ల పైచిలుకు ఉంది అని అంచనా!

వాలెంటైన్ వీక్ దోపిడి:

వాస్తవానికి ప్రేమ లేఖలు, చిన్న బహుమతులతో సాగిపోయే వాతావరణంలో, వాలెంటైన్ వీక్ అని 8 రోజుల పాటు రకరకాల పేర్లతో మార్కెట్లో వాలెంటైన్స్ డే నాడు ఇవి కొనండి అంటూ లూటీ చేస్తున్నారు. ఫిబ్రవరి 7 నుండి ఫిబ్రవరి 14 వరకు ఒక్కోరోజు ఒక్కో పేరుతో మార్కెట్ చేస్తున్నారు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాకొలేట్ డే, టెడ్డి డే, ప్రామిస్ డే,కిస్ డే, హగ్ డే, వాలెంటైన్స్ డే అంటూ లేని రోజులను కల్పించి దోపిడీ చేస్తున్నారు.

 

 

అసలు ఇది నిజంగా ప్రేమికుల రోజేనా? 

చరిత్రకారుల ప్రకారం అసలు వాలెంటైన్స్ డే ఒక రోమన్ ల మతసంబంధమైన పండుగ. ఇదే ఫిబ్రవరి 15న చేసుకునే పండగ లూపెర్కలియా . ఈరోజు ఉన్న నాగరిక సమాజంలో ఈ పండుగ కాస్త అతిగా అనిపించవచ్చు. ఎందుకంటే ఈ పండుగలో యువకులు మేకలు, శునకం బలి ఇస్తారు.‌ వాటి చర్మాన్ని వలిచి కొరడాగా మార్చి నగ్నంగా వీధిలో తిరుగుతూ, పెళ్ళి అయి పిల్లలు పుట్టని ఆడవారి చేతి మీద కొరడాతో కొట్టేవారు. ఇలా చేస్తే ఆ మహిళకు పిల్లలు పుడతారు అని నమ్మేవారు. ఈ పండుగ క్రైస్తవ మతం రోమన్ సామ్రాజ్యంలో చట్టబద్ధమైన 150 సంవత్సరాల తరువాత కూడా కొనసాగింది.‌ ఆ తర్వాత వాటికన్ చర్చి ఈ పండుగను సెయింట్ వాలెంటైన్ కు గుర్తుగా ప్రేమికుల దినోత్సవంగా మార్చుకోవాలి అని మార్చేశారు.

అసలు ఎవరీ వాలెంటైన్? 

వాలెంటైన్ కు సంబంధించి రకరకాల కధనాలు ప్రచారంలో ఉన్నాయి. మూడవ శతాబ్దంలో మార్కస్ క్లాడియస్ గొతిగస్ అనే రోమన్ రాజు సైనికుల సంఖ్య ఎక్కువ ఉండాలి అని యువత పెళ్ళి చేసుకోవడాన్ని నిషేధించాడు. అయితే వాలెంటైన్ అనే‌ పూజారి రహస్యంగా పెళ్లిళ్ళు చేసేవాడు. విషయం తెలుసుకున్న రాజు తనను జైల్లో బంధించి ఉంచాడు. అక్కడ జైలర్ కూతురును చూసి ప్రేమించాడు. జైల్లో రోజు కలుసుకునేవారు. వాలెంటైన్ ను కొన్ని రోజులకు మరణదండన విధించారు. తనకు శిక్ష విధించే ముందు ఆ అమ్మాయికి ప్రేమ లేఖ‌ రాసాడని కథ!

పోప్ మార్చిన చరిత్ర!

5వ శతాబ్దంలో ఫిబ్రవరి 14 ని వాలెంటైన్స్ డే ” గా పోప్ గెలాసియస్ ప్రకటించాడు. అప్పటి నుంచి ఆ రోజు ప్రేమికుల రోజు గా గుర్తింపు పొందింది. చరిత్రలో ఈరోజు గురించి 13వ శతాబ్దంలో జెఫ్రీ చౌసర్ రాసిన కవితల్లో వాలెంటైన్స్ డే గురించి రాశాడు. షేక్స్పియర్ కూడా ఒక నాటకంలో రాశాడు. అయితే 16,17వ శతాబ్దాలలో ఇంగ్లాండ్ లో వాలెంటైన్స్ డే నాడు ప్రేమ లేఖ‌లు బహుమతులు పంచుకోవడం ప్రాచుర్యం పొందింది. అది అక్కడి నుంచి అనేక దేశాలకు పాకింది. ఇప్పుడు దాని చుట్టూ వ్యాపార కేంద్రంగా మారింది.

 

పెట్టుబడిదారీ వ్యవస్థకు లాభాలు తప్ప ఇంకేమీ పట్టవు అని కొందరు ఆర్థికవేత్తలు అన్నట్టు, ఈ వ్యవస్థలో ప్రేమికుల రోజు కూడా వ్యాపారం అయ్యింది.


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *