Menu

KCR-Jagan-Revanth: బూతుల సీఎంలు.. వీళ్లే ఇంతలా దిగజారిపోతే ప్రజలు ఎలా ఉండాలి?

Tri Ten B
randa politics

నేనింతే(Neninthe) సినిమాలో ఒక డైలాగ్‌ ఉంటుంది. హీరో రవితేజ విలన్‌తో అంటాడు. ఆడవాళ్లని కలపకుండా తిట్టడానికి తిట్లే లేవని. అందులో విలన్‌ నోరు విప్పితే ఆడవాళ్లను కలుపుతూ బూతులు మాట్లాడుతాడు. అతను సినిమాలో విలన్ కదా అలానే బూతులు మాట్లాడాలి. కానీ రాజకీయాల్లో హీరోలే బూతులు మాట్లాడుతారు. నిజానికి అలా మాట్లాడితేనే వాళ్లని హీరోలంటారు. అప్పట్లో జగన్‌ని చంద్రబాబు బోసి*కే అన్నారు.. అది పట్టుకోని జగన్ దాని అర్థాన్ని ఓ పబ్లిక్‌ మీటింగ్‌లో చిన్నపిల్లల ముందు వివరించారు. గతంలో ఎప్పుడో కిషన్‌రెడ్డిని కేసీఆర్‌ ర*డా అన్నారు. తాజాగా రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ని ర*డా అన్నారు. వీళ్లంతా మన సీఎంలు. పాలనలో ఎవరి మార్క్‌ వారికి ఉంది కానీ వీళ్లకి లేనిది ఒకటుంది.. అదే కామన్‌సెన్స్‌. అందుకే అంటారు కామన్‌సెన్స్‌ ఇజ్‌ నాట్ సో కామన్‌ అని.

మాజీ సీఎం కేసీఆర్‌(KCR)ని విమర్శిస్తూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పలుమార్లు ర*డా అనే పదాన్ని వాడారు. డబ్బులు తీసుకొని శరీరాన్ని అమ్ముకునే స్త్రీలను ఈ పదంతో పిలుస్తారు. దేవదాసి, మిం*లకోరు, మిం*లమారి, రోగ*సాని, ల*జ, విటురాలు, వెలపడతి, వెలయాలు, వెలవెలది, వేడు*కత్తె, వేశ్య, వ్యభి*రిణి, శూల, సాని ఇవన్ని ఆ పదానికి మరో అర్థాలు. ఇక్కడ ఒకడిని ఇంకొడిని తిట్టడానికి మధ్యలో వేశ్యలు ఎందుకు వచ్చారో అర్థంకాలేదు. ఏ స్త్రీ కూడా ఇష్టంతో వ్యభి*రిణిగా బతకదు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులకు ఎలా మాట్లాడాలో తెలుసు.. ఏ పదాలు వాడకూడదో కూడా తెలుసు.. కానీ అవే మాట్లాడుతారు.


పెంచి పోషించింది సారే కదా:
రేవంత్‌రెడ్డి ఈ పదం ఉపయోగించగానే బీఆర్‌ఎస్‌ నేతలు, కొంతమంది హార్డ్‌కోర్‌ సపోర్టర్లు, మాజీ గులాబీ ఎమ్మెల్మేలు రంగంలోకి దిగిపోయారు. కేసీఆర్‌నే అంతమాట అంటావా అంటూ ఊగిపోయారు. చెప్పుతో కొడతా నా కో*కా అంటూ స్టేజీమీద పూనకాలు వచ్చినట్టు అయిపోయారు. అసలు కేసీఆర్‌కి బూతులే రానట్టు.. ఆయన పద్ధతిగా మాట్లాడే నేతఅన్నట్టు సాగుతోంది వారి ప్రవర్తన. నిజానికి సీఎం పదవిలో ఉండి హూందాతనం లేని మాటలను పెంచి, పోషించి, పెద్ద చేసింది కేసీఆరే కదా.. ఈ ర*డా పదం ఆయన గతంలో అన్నదే కదా. మరి ఎందుకీ బిల్డప్‌లు. మనం కరెక్ట్‌గా లేకుండా అవతలివాళ్ల మీద పడిపోతే ఎలా..?


ఒకరంటే ఇంకొకరు అంటారా?
ఇక గతంలో కేసీఆర్‌ అన్నాడు కాబట్టి ఇప్పుడు రేవంత్ అనడంతో తప్పు లేదట. ఇది కాంగ్రెస్‌ మద్దతుదారుల వాదన. ఒకడు గడ్డి తింటే మనమూ అదే తింటామా.. మన బుద్ధి ఎక్కడికిపోయినట్టు..? రేవంత్ చిన్నపిల్లాడా? సీఎం పదవిలో ఉన్నాడు కదా.. ఇలా మాట్లాడుతాడా.. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండే సీఎంలే ఇలా మాట్లాడితే సామాన్యులు ఏం మాట్లాడాలి..? సీఎంల మాటలకే బీప్‌లు వేసుకోవాల్సిన దుస్థితి దాపరించడం నిజంగా దారుణం. ఇక నుంచి ముఖ్యమంత్రుల స్పీచ్‌లకు కూడా డిస్‌క్లైమర్‌ వేసుకోవాలమో..చిన్నపిల్లలు వినకూడదని..!

Also Read: యావత్‌ దేశాన్ని ఫూల్‌ చేసిన పూనమ్‌కు ఆ సమస్య ఉందా? ఆమె ఎందుకిలా చేస్తుంది?

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *