Menu

Poonam Pandey: యావత్‌ దేశాన్ని ఫూల్‌ చేసిన పూనమ్‌కు ఆ సమస్య ఉందా? ఆమె ఎందుకిలా చేస్తుంది?

Tri Ten B
Is Poonam Pandey a victim of 'HPD'?

Poonam Pandey Fake Death Updates: అటెన్షన్‌ సీకింగ్‌ చాలామందికి ఉండే రుగ్మత. అవతలి వారి అటెన్షన్‌ను గ్రాబ్ చేయడం కోసం ఏమైనా చేస్తారు.. ఏదైనా ప్రకటిస్తారు. ముఖ్యంగా సోషల్‌మీడియా కల్చర్‌ను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి ఈ రుగ్మత ఉంటుంది. రుగ్మతలు వ్యాధులు కావు. ప్రతీఒక్కరికి ఏదో ఒక రుగ్మత ఉండొచ్చు. నటి పూనమ్‌పాండే(Poonam Pandey)కు కూడా ఇలాంటి రుగ్మతలే ఉన్నాయంటున్నారు డాక్టర్లు. చనిపోయినట్టుగా తన టీమ్‌చేత ఇన్‌స్టాలో పోస్టు పెట్టుంచుకున్న పూనమ్‌ తర్వాతి రోజు అదే ఇన్‌స్టా వేదికగా ప్రత్యక్షమయ్యారు. తాను చనిపోలేదని.. సెర్వికల్‌ క్యాన్సర్‌(Cervical Cancer) గురించి అవగాహన పెంచడం కోసమే ఇలా చేశామని చెప్పుకొచ్చారు. పూనమ్‌ చేసింది ముమ్మాటికి తప్పే. ఆమె తన ఫేక్ డెత్‌ ప్రకటనతో క్యాన్సర్‌ బాధితులను అవమానపరిచారు. క్యాన్సర్‌ బాధ ఎలా ఉంటుందో అనుభవించేవాళ్లకే తెలుస్తుంది. మన శరీరాన్ని మొత్తం క్యాన్సర్ తీనేస్తుంది. చూసేవాళ్లు చూసి జాలిపడడం తప్ప ఇంకేమీ చేయాలని పరిస్థితులు ఉంటాయి. ఇంతటి మహమ్మారి గురించి పూనమ్‌ జోక్‌ చేయడం.. తర్వాత అవగాహన కోసమని చెప్పడం అటెన్షన్‌ సీకింగ్‌కాకపోతే మరొకటి కాదు.

మొదటి నుంచి ఇంతే:
నిజానికి పూనమ్‌ ఈ విధమైన పబ్లిసిటీ స్టంట్లు వేయడం ఇది తొలిసారి కాదు. అసలు పూనమ్‌ లైమ్‌లైట్‌లోకి వచ్చిందే ఇలాంటి పబ్లిసిటీ స్టంట్‌తో. 2011 ప్రపంచకప్‌లో భారత్‌ కప్‌ గెలుచుకుంటే బట్టలు విప్పెస్తానని అప్పట్లో పూనమ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ టాపిక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారింది. అంతకముందు ఇండియాలో ఇలాంటి ప్రకటనలూ ఎవరూ చేయలేదు కానీ.. ఆమె తర్వాత ఈ తరహా స్టేట్మెంట్లు చాలామంది ఇచ్చారు. కానీ ఎవరూ పూనమ్‌ నిలిచినంతా వార్తల్లో నిలవలేదు.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)


డాక్టర్లు ఏం అంటున్నారు?
సోషల్ మీడియా యుగంలో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, వార్తల్లో ఉండటానికి ప్రజలు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. మెట్రోలో బికినీలు ధరించి తిరగడం దగ్గర నుంచి సోషల్ మీడియాలో హాఫ్‌ న్యూ*డ్‌, అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రదర్శించడం ద్వారా ఫాలోవర్లను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పూనమ్ పాండే అంతకుమించి చేసింది. మరణం లాంటి సున్నితమైన అంశాన్ని ఎగతాళి చేసింది. ప్రజల దృష్టిని ఆకర్షించే ఈ మార్గాన్ని సైకాలజీలో హిస్ట్రియోనిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు.


HPD అంటే ఏంటి?
హిస్టెరియోనిక్ పర్సనాలిటీ డిజార్డర్ (HPD) అనేది మానసిక ఆరోగ్య సమస్య. ఇది భావోద్వేగ అస్థిరతకు దారి తీస్తుంది. ఈ సమస్య ఉన్నవారు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించడానికి లేనిపోని డ్రామాలను క్రియేట్ చేస్తారు. అనుచిత ప్రవర్తన వీరిలో కనిపిస్తుంటుంది. ఈ రుగ్మత ఉన్నవారి ఆలోచనా విధానం సమస్యలను తీసుకొస్తుంది. అరుదైన రుగ్మతలలో HPD ఒకటి. ప్రజలను దృష్టి పెట్టడానికి వింత దుస్తులు ధరించేవారు కూడా ఇదే లిస్ట్‌లోకి వచ్చే అవకాశం ఉంటుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. మీ చుట్టుపక్కల ఎవరికైనా HPD లక్షణాలు కనిపిస్తే వారిని మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లండి. ఇక పూనమ్‌ పాండేకి ఈ రుగ్మత ఉందని ఎవరూ ధ్రూవీకరించలేదు కానీ మొదటి నుంచి ఆమె ప్రవర్తన, చేసిన పనులు చూస్తుంటే ఆమెకి ఈ రుగ్మత ఉండే అవకాశాలు ఉన్నాయని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: సెన్స్‌లెస్‌, లూజ్‌ టాక్‌.. సందీప్‌ రెడ్డి వంగా ఇది తగ్గించుకుంటే మంచిది!

s

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *